ట్రావెల్… అడ్వెంచర్ ఈ రెండింటికి అవినాభావ సంబంధం ఉంటుంది. అడ్వెంచర్ ట్రావెలింగ్ చేసేవారు లైఫ్‌లో ఎప్పుడూ అందరికంటే ముందు ఉంటారు. అయితే, కొంతమంది టైం ట్రావెల్‌ను నమ్ముతుంటారు. టైమ్ ట్రావెల్ అంటే కాలంతో ప్రయాణించడం కాదు..కాలంలో ప్రయాణించడం. అంతే, గతకాలంలో లేదా రాబోయే కాలంలో ప్రయాణించడం అని అర్థం. ఇలాంటి విషయాలు కాల్పానిక నవల్లో లేదా సినిమాల్లో చూస్తుంటాం. కానీ, ఓ యువకుడు తాను కాలంలో ప్రయాణం చేసినట్టుగా చెప్తున్నాడు.
Read: సీఎంకు టీచర్లు షాక్: బదిలీలు పోస్టింగ్‌లకోసం లంచాలిచ్చాం…
తాను 2027 కాలం నుంచి వచ్చానని, భూమిపై నివశించిన చివరి వ్యక్తిని తానే అని చెప్తూ ఓ వీడియో పోస్ట్ చేయాడు. ఎత్తైన బిల్డింగ్‌లు ఆ వ్యక్తి తప్పా మరేమి కనిపించలేదు. టైమ్ ట్రావెల్‌ను నమ్మేవారు ఆ వీడియో చూస్తే నిజమే అనుకుంటారు. ఇలా టైమ్ ట్రావెల్‌కు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసిన యూనికోసోబ్రెవివియంట్ పై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి, భయబ్రాంతులకు గురిచేయడానికి ఇలాంటి వీడియోలు చేస్తున్నారని, ఇదేదో లాక్‌డౌన్ కాలంలో చేసిన వీడియో అని విమర్శలు చేస్తున్నారు.