సీఎంకు టీచ‌ర్లు షాక్‌: బ‌దిలీలు పోస్టింగ్‌ల‌కోసం లంచాలిచ్చాం…

రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌కు టీచ‌ర్లు షాకిచ్చారు.  టీచ‌ర్ల‌ను స‌న్మానించే కార్యక్ర‌మానికి హాజ‌రైన ఆయ‌న‌కు అనూహ్య‌రీతితో టీచ‌ర్లు షాకిచ్చారు. కొత్త పోస్టింగ్‌లు, బ‌దిలీల విష‌యంలో తాము స్థానిక ఎమ్మెల్యేలతో పైర‌వీలు చేయించుకొని ముడుపులు ఇచ్చామని స‌భ‌లోని కొంత‌మంది టీచ‌ర్లు ఆరోప‌ణ‌లు చేశారు.  ఈ ఆరోప‌ణ‌లు విన్న సీఎం అశోక్ గెహ్లాట్ షాక‌య్యారు.  వెంట‌నే ఈ ఆరోప‌ణ‌లు నిజ‌మేనా అని తిరిగి సీఎం అందిముందు ప్ర‌శ్నించారు.

Read: ఆఫ్ఘ‌న్‌లో మ‌ళ్లీ బాంబు పేలుడు.. ఏడుగురు మృతి…

దానికి స‌భ‌లోని వారు నిజ‌మే అని చెప్ప‌డంతో ఆయ‌న మ‌రింత షాక‌య్యారు.  వెంట‌నే ఈ ఆరోప‌ణ‌ల‌పై విచార‌ణ చేప‌డ‌తామ‌ని తాత్కాలికంగా ఆ స‌మ‌స్య‌కు చెక్ పెట్టే ప్ర‌య‌త్నం చేశారు.  కాంగ్రెస్ ప్ర‌భుత్వాల రాష్ట్రాల్లో అవినీతి అధికంగా జ‌రుగుతుంద‌ని బీజీపీతో స‌హా ప్ర‌తిప‌క్ష పార్టీలు విమ‌ర్శ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే.  ఇప్పుడు స్వ‌యంగా టీచ‌ర్లు స‌భ‌లో రాజ‌స్థాన్ సీఎంను ముడుపుల విష‌యాన్ని కుండ‌బ‌ద్ధ‌లు కొట్ట‌డంతో ప్ర‌తిప‌క్షాల‌కు మ‌రోక ఆయుధం దొరికిన‌ట్ట‌యింది.  త్వ‌ర‌లోనే వివిధ రాష్ట్రాల్లో జ‌రిగనున్న ఎన్నిక‌ల్లో ఈ అంశాన్ని ప్ర‌తిప‌క్షాలు ప్ర‌చారాస్త్రంగా వాడుకునే అవ‌కాశం ఉన్న‌ది.  

Related Articles

Latest Articles