Hyderabad: హైదరాబాద్‌ను 3 ‘జిల్లాలు’ చేయనున్న కాంగ్రెస్ పార్టీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు సిటీ చుట్టుపక్కల ఉన్న సబర్బన్ ప్రాంతాల్లోని అసెంబ్లీ సెగ్మెంట్లపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ ఏరియాల్లో బీజేపీకి చెక్ పెట్టడంతోపాటు పార్టీకి పునర్వైభవం తేవటమే లక్ష్యంగా పెట్టుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 24 శాసన సభ నియోజకవర్గాలు ఉండగా 2018 ఎన్నికల్లో కనీసం ఒక్క సీటును కూడా గెలవలేకపోయింది. 2020లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎలక్షన్లలో సైతం 150 వార్డులకు గాను నామమాత్రంగా రెండు చోట్లే నెగ్గింది. మూడో వార్డును ఉపఎన్నికలో దక్కించుకుంది.
సికింద్రాబాద్ లోక్‌సభ ఎంపీ సీటును 2004, 2009ల్లో వరుసగా రెండు సార్లు కైవసం చేసుకున్న హస్తం పార్టీ ఆ తర్వాత వరుసగా రెండు సార్లు (2014, 2019ల్లో) ఓడిపోయింది. 2019లో అయితే మరీ మూడో స్థానానికి పరిమితమైంది. ఈ రెండు సార్లూ ఇక్కడ బీజేపీనే విజయం సాధించింది. ఇక హైదరాబాద్ లోక్‌సభ స్థానానికి వస్తే అక్కడ గత నాలుగు దశాబ్దాల నుంచి కంటిన్యూగా ఎంఐఎమ్మే విక్టరీ కొడుతోంది. ఈ నేపథ్యంలో పార్టీని తిరిగి ఫామ్‌లోకి తీసుకొచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం హైదరాబాద్ జిల్లాను మూడు రాజకీయ జిల్లాలుగా విభజించనుంది. 1. హైదరాబాద్ 2. ఖైరతాబాద్ 3. సికింద్రాబాద్.
Also Read
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
గ్రేటర్ హైదరాబాద్ కాకుండా కేవలం హైదరాబాద్ జిల్లాలోనే 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. దీంతో ఒక్కో జిల్లా కిందికి 5 అసెంబ్లీ సెగ్మెంట్లు రానున్నాయి. అలాగే.. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలను సైతం చిన్న చిన్న యూనిట్లుగా డివైడ్ చేయాలనే ప్రతిపాదన ఉంది. హైదరాబాద్‌ను మూడు పొలిటికల్ డిస్ట్రిక్ట్‌లుగా విభజించేందుకు తెలంగాణ లీడర్‌షిప్ పార్టీ హైకమాండ్ నుంచి రీసెంట్‌గా అనుమతి పొందిందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఈ మూడు రాజకీయ జిల్లాలకు ముగ్గురు అధ్యక్షులను నియమించనున్నారు.
తద్వారా పార్టీని బలోపేతం చేయటంపై మరింత ఎక్కువ దృష్టి పెట్టడానికి వీలుంటుందని పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయిన హైదరాబాద్ జిల్లాలో మళ్లీ ఆ స్థాయిలో చక్రం తిప్పేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. పార్టీ అగ్ర నేతలు రాహుల్ గాంధీతో గానీ లేక ఆయన సోదరి ప్రియాంకా గాంధీతో గానీ భారీ బహిరంగ సభ పెట్టాలని చూస్తోంది. బల్దియా ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా భారీగా పుంజుకున్న సంగతి తెలిసిందే.
దీంతో ఆ పార్టీ మొన్నీమధ్య రంగారెడ్డి జిల్లా శివారు ప్రాంతమైన తుక్కుగూడలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పబ్లిక్ మీటింగ్ పెట్టింది. పది రోజుల కిందట పరేడ్ మైదానంలో ప్రధాని మోడీతోనూ భారీ బహిరంగ సభ నిర్వహించింది. రెండు రోజుల పాటు జాతీయ కార్యవర్గ సమావేశాలను విజయవంతంగా పూర్తిచేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీ సైతం ఇదే స్థాయిలో కార్యక్రమాల నిర్వహణకు సన్నద్ధమవుతోంది.
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!