పంజాబ్‌లోని ఫజిల్కాలో దారుణ ఘటన వెలుగు చూసింది. భర్త ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అనుమానంతో భార్య.. కోపంతో అత్తగారింటి నుంచి వెళ్లిపోయింది. అయితే.. ఆమెకు నచ్చజెప్పి తన ఇంటికి తీసుకొద్దామని.. అత్తగారింటికి వెళ్లిన భర్తపై అత్తమామలు దాడికి పాల్పడ్డారు. అతనిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో అతడు తీవ్రంగా కాలిపోయాడు. మూడు రోజుల పాటు ప్రాణాలతో పోరాడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. భార్య, అత్తమామ, బావమరిది సహా ఐదుగురిపై హత్య కేసు నమోదు చేశారు. మృతుడు ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు.
Shock to BRS: బీఆర్‌ఎస్‌కు భారీ షాక్.. రేపు కాంగ్రెస్‌లోకి మరో ఎమ్మెల్యే!
పంజాబ్‌లోని హిరావాలి గ్రామంలో మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనతో ప్రజలు ఇంకా భయాందోళనల్లోనే ఉన్నారు. భార్యను తీసుకురావడానికి అత్తమామల ఇంటికి వెళ్లిన ఉపాధ్యాయుడిని అత్తమామలు సజీవ దహనం చేశారు. మృతుడు ఫాజిల్కాలోని జట్టియాన్ ప్రాంతానికి చెందిన ఉపాధ్యాయుడు విశ్వదీప్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. కుటుంబ కలహాల కారణంగా ప్రభుత్వ ఉపాధ్యాయుడు విశ్వదీప్ కుమార్‌ను సజీవ దహనం చేసి హతమార్చేందుకు ప్రయత్నించారని ఖుఖేడా పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ హర్దేవ్ సింగ్ తెలిపారు. హిరావాలి గ్రామంలోని చుట్టు ప్రక్కన ఉన్న స్థానికులు.. తీవ్రంగా కాలిపోయిన ఉపాధ్యాయుడిని ఫాజిల్కాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారన్నారు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో.. అక్కడి నుంచి ఫరీద్‌కోట్ మెడికల్ కాలేజీకి రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ ఈరోజు మధ్యాహ్నం మరణించాడు. ఉపాధ్యాయుడి కుటుంబ సభ్యుల వాంగ్మూలాల ఆధారంగా పోలీసులు.. మృతుడి భార్య శుకాంతల, అత్త పాలిదేవి, బావమరిది సికందర్, మామపై ఖూయి ఖేడా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. కాగా.. నిందితుడైన బావమరిదిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. త్వరలోనే మిగిలిన నిందితులను పట్టుకుంటామని పేర్కొన్నారు.
Tamil Nadu: కరుణానిధిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని యూట్యూబర్ అరెస్ట్..
మృతుడు విశ్వదీప్‌కుమార్ భార్య కూడా ఉపాధ్యాయురాలే. భార్యాభర్తలిద్దరూ ఒకే ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. అతడికి వేరే మహిళతో సంబంధం ఉన్నట్లు అనుమానించిన భార్య.. కోపంతో తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో.. తన భర్తను ఉద్యోగం నుంచి తొలగించాలని అధికారులకు తెలిపింది. కాగా.. భార్యకు నచ్చజెప్పి తీసుకొద్దామని వెళ్లి భర్తపై అత్తమామలు పెట్రోల్ పోసి నిప్పంటించారు.