పంజాబ్‌లోని ఫజిల్కాలో దారుణ ఘటన వెలుగు చూసింది. భర్త ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అనుమానంతో భార్య.. కోపంతో అత్తగారింటి నుంచి వెళ్లిపోయింది. అయితే.. ఆమెకు నచ్చజెప్పి తన ఇంటికి తీసుకొద్దామని.. అత్తగారింటికి వెళ్లిన భర్తపై అత్తమామలు దాడికి పాల్పడ్డారు. అతనిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో అతడు తీవ్రంగా కాలిపోయాడు. మూడు రోజుల పాటు ప్రాణాలతో పోరాడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.