ఉస్మానియా ఆస్పత్రిని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.7కోట్లతో క్యాథ్‌ల్యాబ్, సిటీ స్కాన్ లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా మరో నాలు క్యాథ్ ల్యాబ్‌లను అందుబాటులోకి తీసువస్తామని ఆయన వెల్లడించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన వైద్య అందేలా ఏర్పాటు చేస్తున్నామని, ఉస్మానియా అస్పత్రిలో రూ.5 కోట్లతో అధునాతన మార్చురీని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
రాత్రి పూట పోస్టుమార్టం చేసేలా ఏర్పాట్లు కూడా చేస్తున్నామని ఆయన అన్నారు. ఉస్మానియా పాత భవనం కోర్టు కేసు పూర్తవగానే పరిష్కరిస్తామని అయన అన్నారు. అంతేకాకుండా ఒమిక్రాన్‌పై పూర్తి ఏర్పాట్లు చేస్తున్నామని, తెలంగాణలో థర్డ్‌వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు.