వైన్ ఎంత కాలం నిల్వ ఉంచితే అంత టేస్ట్ ఉంటుంది. ధర కూడా అదే రేంజ్ లో ఉంటుంది. పాతకాలం నాటి వైన్ బాటిల్స్ కోసం చాలా మంది వెతుకుతుంటారు. స్పెయిన్‌లో ఆర్టియో రెస్తారెంట్ వైన్‌కు ప్రసిద్ధి. ఇక్కడ పాతకాలం నాటి వైన్ దొరుకుతుంటుంది. ఈ రెస్టారెంట్‌లో వైన్ సేవించేందుకు అధిక సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. అయితే, బుధవారం రోజున ఓ జంట వైన్ కోసం రెస్టారెంట్‌కు వచ్చింది. కావాల్సిన వైన్ కొనుగోలు చేయడమే కాకుండా అక్కడి నుంచి వెళ్లే సమయంలో 45 వైన్ బాటిల్స్‌ను దొంగతనంగా తీసుకెళ్లారట. అందులో 215 సంవత్సరాల నాటి చాతౌ డి క్విమ్ బాటిల్స్ కూడా ఉన్నాయని, వీటి ఖరీదు బయట మార్కెట్లో సుమారు మూడు కోట్ల రూపాలయ వరకు ఉంటుందని రెస్టారెంట్ నిర్వాహకులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Read: మందు, సిగరేట్ నుంచి బయటపడాలంటే.. రోజూ ఇలా చేయాలి…