దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. వరుసగా.. బంగారం ధరలు పెరుగుతుండటంతో… పుత్తడిని కొనుగోలు చేయాలంటే… ప్రజలు భయపడిపోతున్నారు. కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది బంగారంపై ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి.
అయితే, ఈరోజు బంగారం ధరలు ప్రస్తుతానికి స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,760 వద్ద ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,830 వద్ద ఉన్నది. ఇక వెండి విషయానికి వస్తే.. కిలో వెండి ధర రూ.100 పెరిగి రూ.65,600 కు చేరుకుంది.