ఆ పాలకు గిరాకీ చాలా తక్కువ. ఎవరో కొంతమంది తప్పించి పెద్దగా తాగేవారు కాదు. అందుకే ఆ పాలు చాలా చౌకగా దొరికేవి. లీటర్ పాలు కేవలం రూ.30 కి మాత్రమే దొరికేవి. అయితే, గత కొన్ని రోజులుగా మధ్యప్రదేశ్‌లోని ఛత్తార్‌పూర్‌లో డెంగీ కేసులు పెరిగిపోతున్నాయి. డెంగీ జ్వరం వచ్చిన వారిలో ప్లేట్‌లెట్స్ సంఖ్య పడిపోతుంది. ప్లేట్‌లెట్స్ సంఖ్య పెరగాలి అంటే మేకపాలు తాగాలని చాలా మంది సూచిస్తుండటంతో అక్కడి ప్రజలు మేకపాలను పెద్ద ఎత్తున కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. వారం రోజుల క్రితం వరకు మేకపాలు లీటర్ రూ.30 ఉండగా, ఇప్పుడు వాటి ధరలకు రెక్కలు వచ్చాయి. ఏకంగా లీటర్ పాలను రూ.300కి అమ్ముతున్నారు. మేకపాలు పుష్టికరంగా ఉంటాయి. అయితే, వీటిని తాగేందుకు చాలామంది ఆసక్తి చూపించరు.
Read: చీకటిపడ్డాక మహిళలను అటు వెళ్లొద్దన్న బీజేపీ నేత… బీఎస్పీ విమర్శలు…