గుజ‌రాత్ సీఎంగా నేడు భూపేంద్ర ప‌టేల్ ప్ర‌మాణ‌స్వీకారం…

గుజ‌రాత్ సీఎంగా నేడు భూపేంద్ర ప‌టేల్ ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌బోతున్నారు.  గుజ‌రాత్ 17 వ సీఎంగా నేడు ప్ర‌మాణ స్వీకారం చేస్తారు.  ఈ ప్ర‌మాణ స్వీకార మ‌హోత్స‌వానికి కేంద్ర మంత్రి అమిత్ షా హాజ‌రుకానున్నారు. ప‌టేల్ సామాజిక వ‌ర్గానికి పెద్ద‌పీట వేస్తూ బీజేపీ అధిష్టానం ఈ నిర్ణ‌యం తీసుకుంది.  అయితే, ఎవ‌రూ ఊహించ‌ని విధంగా భూపేంద్ర ప‌టేల్‌కు ముఖ్య‌మంత్రి బాధ్య‌త‌లు అప్ప‌గిస్తున్నారు.  తెర‌పైకి నితిన్ ప‌టేల్‌, వ్య‌వ‌సాయ శాఖ మంత్రితో పాటు, కొంత‌మంది కేంద్ర‌మంత్రుల పేర్లు తెర‌పైకి వ‌చ్చినప్ప‌టికీ వీరంద‌ర్ని కాద‌ని మొద‌టిసారి ఘ‌ట్లోడియా నియోజ‌క వ‌ర్గం నుంచి అత్య‌ధిక మెజారిటితో విజ‌యం సాధించిన భూపేంద్ర ప‌టేల్‌కు అవ‌కాశం ఇవ్వ‌డం అంద‌ర్ని షాక్‌కు గురిచేసింది.  కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి న‌రేంద్ర తోమ‌ర్ గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా భూపేంద్ర పాటిల్ పేరును ప్ర‌క‌టించారు.  దీనికి అంద‌రూ ఏక‌ప‌క్షంగా ఆమోదం తెలిపారు.  మొద‌టిసారి ముఖ్య‌మంత్రిగా గెలుపొందిన వ్య‌క్తికి గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి అయ్యే అవ‌కాశం ద‌క్క‌డం విశేషం.  

Read: మ‌ళ్లీ చైనాలో లాక్‌డౌన్‌… ఆ న‌గ‌రం పూర్తిగా మూసివేత‌…

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-