సినీ విమర్శకుడు, దర్శకుడు, నటుడు కత్తి మహేశ్ కన్నుమూత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ సినీ విమర్శకుడు, నటుడు, రచయిత, దర్శకుడు కత్తి మహేశ్ చెన్నైలో కన్నుమూశారు. కొద్దికాలం క్రితం నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానిక హాస్పిటల్ లో చేర్చి ప్రాధమిక చికిత్స చేసిన అనంతరం బంధువులు చెన్నయ్ లో అపోలో హాస్పిటల్ కు తరలించారు. అక్కడే కంటికి, తల భాగానికి శస్త్ర చికిత్స చేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కి తొలి నుంచి సేవలు అందిస్తున్న కత్తి మహేశ్ కు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వైద్య ఖర్చుల నిమిత్తం 17 లక్షల ఆర్థిక సాయం కూడా చేసింది. ఈ నేపథ్యంలో నిదానంగా కత్తి మహేశ్ కోలుకుంటున్నాడనే అందరూ భావించారు. కానీ రక్త పోటు నియంత్రణలోకి రాకపోవడంతో ఇతర అవయవాలకు ప్రమాదం వాటిల్లి కత్తి మహేశ్ కన్నుమూశాడని అతని మిత్రులు తెలిపారు. సామాజికాంశాలు, రాజకీయాల విషయంలో తన అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పడం కత్తి మహేశ్ కు అలవాటు. తన అభిప్రాయాలతో ఏకీభవించని వారితో సైతం స్నేహపూర్వకంగానే కత్తి మహేశ్ ఉండేవాడు. బిగ్ బాస్ హౌస్ లోనూ పాల్గొని అందరినీ ఆకట్టుకున్న కత్తి మహేశ్ కొన్ని సినిమాలలో నటించాడు. అలానే ‘మిణుగురులు’ చిత్రానికి సహ రచయితగా వ్యవహరించాడు. ‘జర్నలిస్ట్’, ‘పెసరట్టు’, ‘ఎగిసే తారాజువ్వలు’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆ మధ్య కత్తి మహేశ్ శ్రీరాముడి గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం లేపాయి. అలానే గతంలో అతని వల్ల సాంఘిక సమస్యలు ఎదురవుతాయనే ఉద్దేశ్యంతో తెలంగాణ పోలీసు శాఖ కొంతకాలం ఆయన్ని రాష్ట్రం నుండి బహిష్కరించింది.
Also Read
తాజావార్తలు
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
-
Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
-
Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..