Facebook: ఉద్యోగులకు మెటా షాక్.. ఉద్యోగులపై వేటుకు ప్లాన్ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెటా సంస్థ మరోసారి తమ ఉద్యోగులకు మరో షాక్ ఇవ్వనుంది. పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు యోచిస్తోంది. రాబోయే కొద్ది నెలల్లో దశల వారిగి ఉద్యోగులను తొలగిచేందుకు సిద్ధమైంది. వేల మందిపై వేటు వేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతేడాది మెటా.. సుమారు 11 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది.ఇది అప్పుడు ఆ సంస్థ ఉద్యోగుల్లో 13 శాతానికి సమానం. ఈ సారి కూడా దాదాపు 11 వేల మంది వరకు ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం.
Also Read: Mlc Kavitha: బై బై మోదీ.. కవితకు మద్దతుగా ఫ్లెక్సీలు..
Also Read
- Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
- Prashant Kishor: రూ.10 వేలతో ఓట్లు కొని గెలిచారు.. నితీష్‌కుమార్‌పై మరోసారి ప్రశాంత్ కిషోర్ విమర్శలు
- Dimple Choudhary: ప్రముఖ డ్యాన్సర్‌తో అనుచిత ప్రవర్తన.. స్టేజ్‌పై కీచకుడి చెంపపగలగొట్టిన నర్తకి
- Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
ఉద్యోగులపై వేటుకు సంబంధించి మెటా సంస్థ వచ్చే వారం తొలి ప్రకటన విడుదల చేయనున్నట్లు సమాచారం. నాన్- ఇంజినీరింగ్ రోల్స్‌లో పనిచేస్తున్న ఉద్యోగులను అధికంగా తొలగించనున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగుల పెర్ఫార్మెన్స్ ఆధారంగా ఉద్యోగుల వేటు ఉండనుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. కాగా, మెటా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్క్ జుకర్‌బర్గ్ ఉద్యోగుల తొలగింపుపై గతంలోనే పరోక్ష సూచన చేశారు. కొన్ని ప్రాజెక్టులను నిలిపివేయనున్నట్లు అప్పట్లోనే వెల్లడించారు.
Also Read:Congress Leader Azharuddin: అవకాశమిస్తే కామారెడ్డి నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తా
2022లో మొదలైన ఈ లేఆఫ్స్ ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అమెజాన్, మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ వంటి బడా కంపెనీలు భారీగా ఉద్యోగులపై వేటు వేశాయి. గూగుల్ సైతం 12,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ఇటీవల వెల్లడించింది. 2022 నుంచి ఇప్పటివరకు మొత్తం తొలగించిన ఉద్యోగుల సంఖ్య 3లక్షలు దాటిందని అంచనా. 2023లో ఇప్పటి వరకు 340 కంపెనీలు 1.10 లక్షల మంది ఉద్యోగులను తొలగించాయని అంచనా. కాగా, ఉద్యోగులకు ఉద్వాసన పలికిన కంపెనీల్లో యాహూ, బైజూస్, గోడ్యాడీ, గిట్‌హబ్, ఇబే, ఆటోడెస్క్, ఓఎల్ఎక్స్ గ్రూప్ వంటి ప్రముఖ సంస్థలు ఉన్నాయి. ఆర్థిక మాంద్యం భయాలు రోజురోజుకీ బలపడుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లోనూ తొలగింపులు కొనసాగనున్నాయి.
తాజావార్తలు
-
Cockfight: కోడిపందాలపై ఎస్ఓటీ పంజా.. ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో కింగ్ పిన్..
-
Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
-
Prashant Kishor: రూ.10 వేలతో ఓట్లు కొని గెలిచారు.. నితీష్‌కుమార్‌పై మరోసారి ప్రశాంత్ కిషోర్ విమర్శలు
-
Rama Nandana: యూట్యూబర్స్ ‘గలీజ్ దందా’ స్కామ్.. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీస్..
-
Sourav Ganguly: మమతకు మద్దతుగా యూసుఫ్ పఠాన్‌ను గంగూలీ రాజీనామా చేయమన్నారా..? ఇదిగో క్లారిటీ..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!