Congress Leader Azharuddin: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్ సంచలన ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వ అవకాశం ఇస్తే కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని వెల్లడించారు. ఆయన కామారెడ్డి పర్యటనలో భాగంగా ఈవాఖ్యలు చేశారు. లింగంపేటలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన సమక్షంలో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ అవకాశం ఇస్తే కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని చెప్పారు. జింఖానా గ్రౌండ్స్‌లో తొక్కిసలాట సందర్భంగా అజారుద్దీన్‌పై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో అజహరుద్దీన్ తప్పు తన వల్ల కాదన్నారు. జింఖానా గ్రౌండ్స్‌లో తొక్కిసలాటకు పాల్పడితే అరెస్టు చేసి ఉండేవారని హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ అన్నారు. జింఖానా మైదానంలో జరిగిన తొక్కిసలాటలో తమ తప్పేమీ లేదన్నారు. తానేమీ తప్పు చేయలేదని స్పష్టం చేశారు. అజారుద్దీన్ ఏం తప్పు చేశానో చెప్పాలని ప్రశ్నించారు. తొక్కిసలాట దురదృష్టకరమని అన్నారు.
Read also: Diplomatic Ties: ఇరాన్, సౌదీ అరేబియా దౌత్య సంబంధాలు.. చైనా మధ్యవర్తిత్వంతో ఒప్పందం
సెప్టెంబర్ 25న 2022 ఉప్పల్ స్టేడియంలో జరగిన టీ20 ఇండియా ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్‌ను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ క్రికెట్ ప్రేమికులు కల్లారా స్టేడియం నుంచి ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు అనేక ఇబ్బందులు పడినవిషయం తెలిసిందే. హైదరాబాద్ నుంచే కాకుండా వివిధ జిల్లాల నుంచి టికెట్ల కోసం వచ్చిన వారు జింఖానా గ్రౌండ్స్‌లో టిక్కెట్లు అమ్ముడవుతాయనే ఆశతో తీవ్ర నిరాశకు గురయ్యారు. అక్కడ జరిగిన తొక్కిసలాటలో పలువురు గాయపడ్డారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ను టార్గెట్ చేశారు.
Dolo 650: డోలో 650 తయారీ సంస్థకు క్లీన్ చీట్ ఇచ్చిన ఫార్మా అసోసియేషన్.. కానీ..