ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇవాళ ఈడీ ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో కవితకు మద్దతుగా ఢిల్లీల్లో ఫ్లెక్సీలు, హోర్డింగులు వెలిశాయి. #Bye Bye Modi అంటూ పోస్ట్ లు దర్శనిమిస్తున్నాయి. ఇతర పార్టీలకు చెందిన నేతలను ఈడీ, సీబీఐలతో వేధించి బీజేపీలో చేర్చుకుంటున్నారని విమర్శిస్తున్నారు. బీజేపీలో చేరితే ఏ కేసులు ఉండవని ఎద్దేవా చేస్తున్నారు. గతంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలను ఈడీ, సీబీఐ కేసులో వేధించి బీజేపీలో చేర్చుకున్నారని పోస్టర్లో పేర్కొన్నారు. బీజేపీలో చేరితే కేసులు ఉండవు అంటూ సామాజిక మాధ్యమాల్లోనూ కవితకు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు.
Also Read:Amit Shah: నేడు హైదరాబాద్‌కు అమిత్ షా రాక.. రాజకీయంగా కాక
మరోవైపు ఈ కేసులో ఇప్పటికే ఓసారి కవితను ప్రశ్నించిన ఈడీ.. మరోసారి కన్‌ఫ్రంటేషన్ ఇంటరాగేషన్ చేసే ఆలోచనలో ఉంది. సిసోడియా, కవిత, అరుణ్‌పిళ్లైను విచారించే ఛాన్స్ ఉంది. ప్రధానంగా అరుణ్ పిళ్లైతో కవిత ఆర్థిక లావాదేవీలపైనే ఈడీ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. లిక్కర్ స్కామ్ కేసులో సేకరించిన వివరాలు, దర్యాప్తులో తేలిన ఆధారాలతో కవితను విచారించే అవకాశం ఉంది. కవితకు దాదాపు 33శాతం వాటా ఇస్తామంటూ చాటింగ్ జరిగినట్లు ఈడీ గుర్తించింది.