శ్రీకృష్ణుడు రోజూ నా కలలోకి వస్తున్నాడు: అఖిలేష్

త్వరలో యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే ఆ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు మాటల యుద్ధానికి తెరలేపాయి. తాజాగా సమాజ్‌వాదీ పార్టీ నేత, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యూపీలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రామరాజ్యాన్ని స్థాపిస్థానని శ్రీకృష్ణుడు ప్రతిరోజూ తన కలలోకి వచ్చి చెప్తున్నాడని అఖిలేష్ వ్యాఖ్యానించారు. రామరాజ్యానికి సామ్యవాదమే మార్గమని… సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వచ్చినరోజు రాష్ట్రంలో రామరాజ్యం ఏర్పడుతుందని అఖిలేష్ వివరించారు.

Read Also: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు క‌రోనా

యూపీలో అన్ని విషయాల్లో యోగి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. ఆయన్ను వచ్చే ఎన్నికల్లో ఎవరూ కాపాడలేరన్నారు. మరోవైపు యూపీలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న బీజేపీ నేతల గురించి అఖిలేష్ ప్రస్తావించారు. యూపీ, బీహార్‌తో సహా కొన్ని రాష్ట్రాలలో కొంతమంది విద్యార్థులకు పరీక్షా కేంద్రాల్లో మాస్ కాపీయింగ్‌కు సహకరించిన మాదిరిగా.. రాష్ట్రంలోని విఫలమైన బీజేపీ ప్రభుత్వాన్ని గెలిపించడానికి కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని అఖిలేష్ ఎద్దేవా చేశారు.

Related Articles

Latest Articles