యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కు ఆయన అత్త పురంధేశ్వరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. “మీరు చాలా ప్రత్యేకమైన వారు… అందుకే మీ మనోహరమైన ముఖం ఎప్పుడూ చిరునవ్వులతో ఉండాలి… హ్యాపీ బర్త్ డే రాక్‌స్టార్” అంటూ ట్వీట్ చేశారు. ఇక నిన్నటి నుంచే ఎన్టీఆర్ పుట్టినరోజు సెలెబ్రేషన్స్ మొదలుపెట్టారు ఆయన అభిమానులు. నిన్నటి నుంచే ట్విట్టర్లో హ్యాపీ బర్త్ డే ఎన్టీఆర్ అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ ఈ కరోనా సంక్షోభంలో బహిరంగంగా తన పుట్టినరోజు వేడుకలు జరపొద్దు అంటూ అభిమానులను కోరిన విషయం తెలిసిందే.
@tarak9999 You are very special and that’s why you need to float with lots of smiles on your lovely face. 💐
— Daggubati Purandeswari 🇮🇳 (@PurandeswariBJP) May 19, 2021
Happy Birthday Rockstar 🎂#HappyBirthdayNTR pic.twitter.com/lajOfhtWww