గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో కరోనా కలకలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైద్యం చేసి ప్రాణాలు నిలిపేవారే కరోనా బారిన పడుతున్నారు. హైదరాబాద్ లో కరోనా తీవ్రత రానురాను పెరుగుతోంది. తాజాగా గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో సిబ్బందికి, విద్యార్థులకు కరోనా సోకింది. గాంధీ ఆస్పత్రిలో 44 మంది వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో 20 మంది మెడికోలు, 10 మంది హౌస్ సర్జన్స్, 10 మంది పీజీ స్టూడెంట్లు, నలుగురు అధ్యాపకులు ఉన్నారు. వీరందరినీ ఐసోలేషన్లలో చికిత్స అందిస్తున్నారు.. దీంతో హాస్పిటల్‌లో పని చేస్తున్న మిగతా సిబ్బందికి వెంటనే కరోనా పరీక్షలు నిర్వహించారు.
విషయం తెలుసుకున్న వెంటనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గాంధీ హాస్పిటల్‌లో నాన్ కోవిడ్ అడ్మిషన్లు నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. అత్యవసర సర్వీసులను మాత్రమే అనుమతించాలని ఆదేశాలు జారీచేశారు. మరోవైపు ఉస్మానియా ఆస్పత్రిలో కూడా కరోనా కలకలం రేపింది.. దాదాపు 25 మంది హౌస్ సర్జన్స్, 23 పీజీ విద్యార్థులు, మరో ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇతర వైద్యులు, సిబ్బంది, రోగులు ఆందోళనకు గురవుతున్నారు.
Also Read
తాజావార్తలు
-
CM Revanth Reddy US visit: రేవంత్ యూకే పర్యటనకు ఓకే.. యూఎస్ టూర్‌కు నో.. ఎందుకంటే..? కేంద్రం క్లారిటీ
-
CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని సీజేపీ అల్టిమేటం..
-
Asim Munir: పాక్ సైన్యంపై అసిమ్ మునీర్ కొత్త ఎత్తుగడ.. దేనికోసమో..!
-
India vs Sri Lanka 2nd Test: భారత్‌తో రెండో టెస్టుకు శ్రీలంక కీలక మార్పులు.. జట్టులోకి ఇద్దరు కొత్త ఆటగాళ్లు
-
Rahul Gandhi: పెల్లెట్ గన్ రగడ.. రాహుల్, ప్రియాంకా గాంధీల మెరుపు ధర్నా..
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్‌ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!