Live In Relationships: సహజీవనం వివాహంతో సమానమే.. జంటలకు హైకోర్టు భరోసా
- సహజీవనం వివాహంతో సమానమే
- వ్-ఇన్ రిలేషన్‌షిప్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
- మేజర్ల జోలికి వెళ్లొద్దని పేరెంట్స్‌కు సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లివ్-ఇన్ రిలేషన్షిప్లో ఉన్న జంటలకు ఢిల్లీ హైకోర్టు కీలక భరోసా ఇచ్చింది. పరస్పర అంగీకారంతో కలిసి జీవించే వయోజనుల లివ్-ఇన్ సంబంధం వివాహానికి సమానమైనదే అని కోర్టు వ్యాఖ్యానించింది. ఇద్దరూ మేజర్లు, తమ ఇష్టపూర్వకంగా కలిసి జీవిస్తున్నప్పుడు వారి నిర్ణయంలో తల్లిదండ్రులు, బంధువులు లేదా స్నేహితులు జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేసింది.
ఓ జంట తమ సంబంధం విషయంలో మహిళ కుటుంబ సభ్యుల నుంచి బెదిరింపులు ఎదురవుతున్నాయని పేర్కొంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఇద్దరూ 30 ఏళ్ల వయసులో ఉన్నారని, కొంతకాలంగా కలిసి జీవిస్తున్నామని, త్వరలో వివాహం చేసుకోవాలని భావిస్తున్నామని కోర్టుకు తెలిపారు. అయితే మహిళ తండ్రి, సోదరుడు ఈ సంబంధాన్ని వ్యతిరేకిస్తూ హింసకు పాల్పడతామని బెదిరించినట్లు ఆరోపించారు. పోలీసులను ఆశ్రయించినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో వారికి పోలీసు రక్షణ కల్పిస్తూ జస్టిస్ సౌరభ్ బెనర్జీ విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read
- Sonia Gandhi: రాజీవ్ గాంధీ ప్రధాని కావడం నాకు ఇష్టం లేదు.. సోనియా ఆసక్తికర వ్యాఖ్యలు..
- Shehbaz Sharif: "కాశ్మీరీలను భారత్ అణచివేస్తోంది".. పాక్ ప్రధాని ఆరోపణలు.!
- Bengaluru Employee: జీతం ఎక్కువైందని రాజీనామా కోరుతున్న బాస్.. ఉద్యోగి పోస్ట్ వైరల్..
- Karnataka SIR: కర్ణాటకలో SIR పూర్తి.. కోటి మంది పేర్లు తొలగింపు..
పెళ్లి సర్టిఫికెట్ లేకపోతే హక్కులు పోవు
వివాహ ధ్రువీకరణ పత్రం లేకుండా సంబంధంలో ఉన్నంత మాత్రాన ఇద్దరు వయోజనులకు తమ జీవితంపై నిర్ణయం తీసుకునే హక్కు ఉండదని అర్థం కాదని కోర్టు స్పష్టం చేసింది. ఇద్దరూ పరస్పర అంగీకారంతో సంబంధంలోకి వచ్చిన వయోజనులైతే.. తమకు నచ్చిన భాగస్వామిని ఎంచుకునే హక్కు వారికి ఉందని పేర్కొంది. అలాగే తమ భాగస్వామితో కలిసి ఎక్కడ, ఎలా జీవించాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ కూడా వారికి ఉంటుందని తెలిపింది. ముఖ్యంగా తల్లిదండ్రులు లేదా బంధువులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయవచ్చని.. కానీ ఆ అభిప్రాయం ఆధారంగా వయోజనుల నిర్ణయాన్ని నియంత్రించే హక్కు వారికి ఉండదని కోర్టు వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.
అయితే లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌ను ‘వివాహానికి సమానం’గా కోర్టు పేర్కొన్నంత మాత్రాన.. చట్టపరంగా ప్రతి విషయంలోనూ వివాహిత జంటతో లివ్-ఇన్ జంట సమానమని అర్థం కాదని న్యాయ నిపుణులు గుర్తుచేస్తున్నారు. వివాహానికి ప్రత్యేకమైన చట్టపరమైన హక్కులు, బాధ్యతలు, రక్షణలు ఉంటాయి. ఈ కేసులో కోర్టు చేసిన వ్యాఖ్య ప్రధానంగా వయోజనుల వ్యక్తిగత స్వేచ్ఛ, తమ భాగస్వామిని ఎంచుకునే హక్కు, కలిసి జీవించే హక్కుకు సంబంధించినది. కుటుంబ సభ్యుల వ్యతిరేకత లేదా సామాజిక అభిప్రాయాలు మాత్రమే ఆధారంగా ఇద్దరు వయోజనులపై జోక్యం చేసుకునే అధికారం ఎవరికీ ఉండదని కోర్టు స్పష్టం చేసింది.
భారత చట్టాలు కూడా కొన్ని సందర్భాల్లో లివ్-ఇన్ సంబంధాల్లో ఉన్న వ్యక్తులకు రక్షణ కల్పిస్తున్నాయి. ముఖ్యంగా ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్, 2005లో ‘వివాహ స్వభావం కలిగిన సంబంధాలు’ అనే భావనను గుర్తించారు. అర్హత ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి సంబంధాల్లో ఉన్న మహిళలకు గృహ హింస నుంచి చట్టపరమైన రక్షణ లభించవచ్చు. అదేవిధంగా పరస్పర అంగీకారంతో జీవించే వయోజనుల హక్కును భారత న్యాయస్థానాలు గతంలోనూ పలుమార్లు గుర్తించాయి.
కుటుంబ అనుమతి అవసరం లేదు
నగర ప్రాంతాల్లో చాలామంది జంటలకు లివ్-ఇన్ సంబంధం కేవలం వివాహానికి ముందు దశగా కాకుండా.. ఇద్దరూ కలిసి జీవితం కొనసాగించాలనే ఉద్దేశంతో తీసుకునే స్వతంత్ర నిర్ణయంగా మారుతోంది. అయితే కుటుంబ సభ్యుల ఆమోదం విషయంలో ఇప్పటికీ అనేక జంటలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలు వయోజనుల వ్యక్తిగత స్వేచ్ఛను మరోసారి గుర్తుచేస్తున్నాయి. ఇద్దరు వయోజనులు పరస్పర అంగీకారంతో కలిసి జీవించాలని నిర్ణయించుకున్నప్పుడు.. వారి బంధువులకు ఆ నిర్ణయాన్ని బెదిరింపులు, వేధింపులు లేదా బలవంతపు జోక్యంతో అడ్డుకునే హక్కు ఉండదని ఈ తీర్పు స్పష్టం చేస్తోంది.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓపెనర్ల ఆట చూసి ఆశ్చర్యం వేసింది.. నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు..
-
OTR: సీనియర్ ఐఏఎస్ జయేష్ రంజన్ విఆర్ఎస్ నిర్ణయం వెనుక అసలు కథేంటి?
-
Hyderabad: కాటేదాన్‌లో రసాయన పేలుడు: ఒకరికి తీవ్ర గాయాలు, మరొకరికి స్వల్ప గాయాలు..
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
Trivikram : అందరి ముందే హీరోయిన్ శ్రీనిధి శెట్టి కాళ్లు మొక్కిన త్రివిక్రమ్!
ట్రెండింగ్
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!