ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. క్యాంప్ కార్యాలయం నుంచి ప్రధాని నరేంద్ర మోదీతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని మాట్లాడారు. ప్రధానితో వీసీ కార్యక్రమానికి హాజరయ్యారు ఏపీ సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, సీఎస్ సమీర్ శర్మ, రెవెన్యూశాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, సమాచారశాఖ కమిషనర్ టి విజయ్ కుమార్‌రెడ్డి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మల్లిఖార్జునరావు ఇతర ఉన్నతాధికారులు.
75 ఏళ్ల స్వాతంత్ర్య ఉత్సవాల సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ బుధవారం వివిధ రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, తెలంగాణ గవర్నర్ తమిళిసై, టీఎస్ సీఎం చంద్రశేఖర్ రావు పాల్గొన్నారు.ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సమీక్షా సదస్సులో పాల్గొన్నారు ఉత్సవాల జాతీయ అమలు కమిటీ సభ్యుడు, గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్. ప్రధాని మోడీ సూచనలను నమోదు చేసుకున్నారు గవర్నర్.