మనదేశ రాజకీయాల్లో ప్రధానమంత్రులది కీలక స్థానం. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న వేళ ప్రధానమంత్రుల మ్యూజియం ప్రారంభమయింది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి భారత్‌కు ప్రధాన మంత్రులుగా సేవలందించిన వారి జీవిత విశేషాలను వివరించేలా ఢిల్లీలో ఏర్పాటు చేసిన మ్యూజియంను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని ప్రసంగించారు. ప్రతి యుగంలో, ప్రతి తరంలో ప్రజాస్వామ్యాన్ని మరింత సాధికారికంగా, ఆధునికంగా మార్చడానికి నిరంతర ప్రయత్నం జరుగుతూనే ఉంది. మారుమూల పల్లె నుంచి, పేదరికం నుంచి, రైతు కుటుంబం నుంచి ప్రధాని పదవిని…
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తున్నారు. కరోనా మహమ్మారిపై భారత్ పోరాటం స్ఫూర్తిదాయకం అన్నారు రాష్ట్రపతి. ప్రతి భారతీయుడికి స్వాతంత్య్ర అమృతోత్సవ్ శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రపతి. రాష్ట్రపతి హోదాలో రామ్ నాథ్ కోవింద్ కి ఇది చివరి ప్రసంగం కావడం విశేషం. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరులకు నివాళులర్పించారు రాష్ట్రపతి. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ మూలసూత్రంతో ప్రభుత్వం పనిచేస్తోంది. దేశాభివృద్ధి ప్రయాణంలో దోహదపడిన వ్యక్తులను స్మరించుకుంటున్నాం…
ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. క్యాంప్ కార్యాలయం నుంచి ప్రధాని నరేంద్ర మోదీతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని మాట్లాడారు. ప్రధానితో వీసీ కార్యక్రమానికి హాజరయ్యారు ఏపీ సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, సీఎస్ సమీర్ శర్మ, రెవెన్యూశాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, సమాచారశాఖ కమిషనర్ టి విజయ్ కుమార్‌రెడ్డి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మల్లిఖార్జునరావు…
ప్రముఖ నటుడు డైలాగ్‌కింగ్ సాయికుమార్‌ను ఇన్‌కమ్‌టాక్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారు హైదరాబాద్‌లో ఘనంగా సత్కరించారు. భారతదేశానికి స్వాతంత్య్రం లభించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మన దేశ ప్రధాని నరేంధ్ర మోడి నేతృత్వంలో 2021 మార్చి 12న ప్రారంభమై 2022 ఆగస్టు 15వరకు 75వారాలపాటు జరిగే కార్యక్రమమే ‘‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’’. ఈ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లోని ఐటీ శాఖవారు అనేక రంగాల్లో లబ్దప్రతిష్ఠులైన కొంతమందిని ఎంపికచేసి సత్కరించారు. తోలుబొమ్మలాట కళాకారులు…