యూపీ ప్ర‌భుత్వంపై రాహుల్ ఫైర్‌… హ‌థ్రాస్ ఘ‌ట‌న‌లోనూ అలానే చేశారు…

ఉత్త‌ర ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు.  ల‌ఖింపూర్ ఘ‌ట‌న‌పై ప్ర‌భుత్వం ఇప్ప‌టి వర‌కు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డంతో రైతులు మండిప‌డుతున్నారు.  అటు ప్ర‌తిప‌క్షాలు సైతం యూపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తున్నాయి.  ప్ర‌భుత్వాలు రైతుల హ‌క్కుల్ని కాల‌రాస్తున్నాయ‌ని రాహుల్ గాంధీ విమ‌ర్శించారు.  ల‌ఖింపూర్ ఘ‌ట‌న‌లో కేంద్ర‌మంత్రి కొడుకును ఎందుకు అరెస్ట్ చేయ‌లేద‌ని ప్ర‌శ్నించారు.  నిన్న యూపీ వెళ్లిన ప్ర‌ధాని ల‌ఖింపూర్ వెళ్లి బాధితుల‌ను ఎందుకు ప‌రామ‌ర్శించ‌లేద‌ని ప్ర‌శ్నించారు.  తాము ల‌ఖింపూర్ వెళ్లేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని, 144 సెక్ష‌న్ అమ‌లులో ఉంటే ముగ్గురు వెళ్లేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.  హ‌థ్రాస్ అత్యాచార ఘ‌ట‌న‌లో యూపీ స‌ర్కార్ ఇలానే వ్య‌వ‌హ‌రించింద‌ని, దేశంలో ప్ర‌స్తుతం నియంత పాల‌న న‌డుస్తోంద‌ని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.  

Read: ఏపీ పీసీసీలో కీల‌క మార్పులు ఉండ‌బోతున్నాయా?

-Advertisement-యూపీ ప్ర‌భుత్వంపై రాహుల్ ఫైర్‌... హ‌థ్రాస్ ఘ‌ట‌న‌లోనూ అలానే చేశారు...

Related Articles

Latest Articles