తాలిబన్లు కాబూల్‌ను ఆక్రమించుకోవడంతో ఆఫ్ఘనిస్తాన్ మొత్తం వారి సొంతం అయింది. ఆక్రమించుకున్న వెంటనే అంతా బాగుంటుందని ప్రకటించారు. కానీ వారి మాటలను ఎవరూ నమ్మడంలేదు. కాబూలో తో పాటుగా కొన్ని ప్రాంతాలను ఈజీగా ఆక్రమించుకున్నా, కొన్ని ప్రాంతాల్లో మాత్రం తాలిబన్లు తీవ్రంగా పోరాటం చేయాల్పి వచ్చింది. అలాంటి వాటిల్లో ఒకటి చాహర్ కింట్ జిల్లా. ఈ జిల్లాకు సలీమా మజారీ అనే మహిళ మేయర్‌గా పనిచేస్తున్నది. తాలిబన్లు చేస్తున్న దండయాత్రను ఆమె సమర్ధవంతంగా ఎదుర్కొన్నది. దేశంలోని వివిధ ప్రాంతాలను తాలిబన్లు వశం చేసుకుంటున్నా, కింట్ జిల్లాకోసం చాలా కష్టపడ్డారు. తుపాకీ పట్టుకొని మేయర్ సలీమా మజారీ సైనికులతో కలిసి రేయింబవళ్లు పోరాటం చేశారు. చివరకు బల్ఖ్ ప్రావిన్స్ మొత్తం వారి వశం అయ్యే వరకూ పోరాటం చేశారు. చివరకు తాలిబన్లు కింట్ జిల్లాకు ఆక్రమించుకున్నారు. కింట్ జిల్లా ఆక్రమణ తరువాత మేయర్‌ను తాలిబన్లు బందీగా తీసుకేళ్లారు. ఆమె ఎక్కడ ఉన్నదో ఎలా ఉన్నదో ఇప్పటి వరకు సమాచారం లేదు. మేయర్‌గా సలీమా కింట్ జిల్లాలో మంచిపేరు తెచ్చుకున్నారు. ప్రజాయోగ్యమైన ఎన్నో పనులు చేశారు. అభివృద్దికి బాటలు వేస్తున్న సమయంలో తాలిబన్ల దాడితో మొత్తం మారిపోయింది.