బాలీవుడ్ న్యూ కపుల్ విక్కీ కౌశల్, కత్రినా కైఫ్‌కు బహుమతులు వెల్లువెత్తుతున్నాయి. వీరి వివాహానికి హాజరుకాలేకపోయిన పలువురు బాలీవుడ్ ప్రముఖులు వారిని ఖరీదైన బహుమతులతో ముంచెత్తారు. కత్రినా మాజీ ప్రియుడు సల్మాన్ ఖాన్ ఆమెకు హై-ఎండ్ రేంజ్ రోవర్‌ని బహుమతిగా ఇచ్చాడు. దీని విలువ 3 కోట్లు. గతంలో కూడా సల్మాన్ క్యాట్‌కు ఓ రేంజ్ రోవర్‌ను, 2.33 కోట్ల విలువైన ఆడి కారును గిప్ట్ గా ఇచ్చాడు. ఇప్పుడు మరింత ఖరీదైన కారును ఇచ్చాడు.
కత్రినా మరో మాజీ ప్రియుడు రణబీర్ కపూర్ 2.75 కోట్ల విలువైన డైమండ్ నెక్లెస్‌ను బహుమతిగా ఇచ్చాడట. రణబీర్ స్నేహితురాలు అలియా భట్ క్యాట్‌కి పెర్ఫ్యూమ్ తో కూడిన ఖరీదైన గిఫ్ట్ హ్యాంపర్‌ను బహుమతిగా ఇచ్చింది. కత్రినా, విక్కీ పొరిగింటి వారైనా అనుష్క, విరాట్ కోహ్లీ 6.4 లక్షల విలువైన చెవిపోగుల సెట్‌ను బహుమతిగా ఇచ్చారట. షారూఖ్ ఖాన్, గౌరీ ఖాన్ కొత్త జంటకు ఖరీదైన పెయింటింగ్ ను బహుమతిగా అందించారు.
ఇక హృతిక్ రోషన్ విక్కీకి 2.6లక్షల విలువైన బిఎమ్‌డబ్ల్యూ జి310 బైక్‌ను బహుమతిగా అందించినట్లు తెలుస్తోంది. విక్కీతో కలసి ‘మన్మర్జియాన్’లో నటించిన తాప్సీ 1.5 లక్షల విలువైన ప్లాటినం బ్రాస్‌లెట్‌ను బహుకరించింది. ఇక విక్కీ తన భార్య కత్రినాకు 1.3 కోట్ల విలువైన డైమండ్ రింగ్‌ని బహుమతిగా ఇచ్చాడట. కత్రినా తన భర్త విక్కీ కౌశల్ కు ముంబైలో 15 కోట్ల అపార్ట్ మెంట్ ను గిప్ట్ గా అందచేసింది. పెళ్ళి తర్వాత ఈ జంట హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లి తిరిగి ఇండియాకు వచ్చింది. పెళ్ళికి సబంధించిన పనులు పూర్తి కావటంతో త్వరలో తమ సినిమా కమిట్ మెంట్స్ ను పూర్తి చేయటానికి రెడీ అవుతోందీ జంట.