రాజ‌స్థాన్‌లో కాంగ్రెస్ దూకుడు… పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో…

రాజ‌స్థాన్ లోని ఆరు జిల్లాల్లో మూడు ద‌శ‌ల్లో 1564 పంచాయ‌తీల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి.  ఈ ఎన్నిక‌ల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మెజారిటీ పంచాయితీను ద‌క్కించుకుంది.  కాంగ్రెస్ పార్టీ 598 పంచాయ‌తీల్లో విజ‌యం సాధించ‌గా, ప్ర‌తిప‌క్షంలో ఉన్న బీజేపీ 490 పంచాయ‌తీల్లో విజ‌యం సాధించింది. ఆర్ఎల్‌పీ 39, బీఎస్పీ 10, ఎస్సీపీ రెండు స్థానాల్లో గెలుపొందాయి.  ఇక ఇండిపెండెంట్లు 250 చోట్ల విజ‌యం సాధించారు.  కాంగ్రెస్ పార్టీ రాజ‌స్థాన్‌లో గ్రామ‌స్థాయి నుంచి ప‌ట్టు ఉంద‌ని మ‌రోసారి నిరూపించుకుంది.  అశోక్ గెహ్లాట్ ప‌రిపాల‌న విష‌యంలో పెద్ద‌గా వ్య‌తిరేక‌త లేక‌పోవ‌డంతో పార్టీ విజ‌యం సాధించింది.  అయితే, గెహ్లాట్‌కు ముందు బీజేపీ పాల‌న సాగింది.  ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్ప‌టికీ మెరుగైన ఫ‌లితాలు సాధించిన బీజేపీ వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి మ‌రింత‌గా బ‌ల‌ప‌డాల‌ని చూస్తున్న‌ది.  

Read: బాబోయ్ ఈ వీడియో చూస్తే గుండెలు జారిపోవడం ఖాయం…పర్వతంపై నుంచి ప‌డినా…

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-