తీవ్ర ఒత్తిళ్లలో బంగారం మార్కెట్
అమెరికా ద్రవ్యోల్బణం భారీగా ఎగబాకటంతో ఇన్వెస్టర్లు బంగారంపై భరోసాతో పెట్టుబడి పెట్టలేని పరిస్థితి నెలకొంది. గోల్డ్ రేటు కనీసం 100 బేసిస్ పాయింట్లయినా పెరుగుతుందనుకుంటే మార్కెట్ అనూహ్యంగా సుమారు 40 డాలర్లు నష్టపోయింది. పసిడి ధరలు నిన్న తిరిగి కోలుకునే తరుణంలో సైకలాజికల్ లెవల్ 1700 డాలర్ల తగ్గటం గమనార్హం.
ఏరో సిటీలపై అదానీ గ్రూప్ ఫోకస్
ఏరో సిటీల అభివృద్ధిపై అదానీ గ్రూప్ దృష్టి పెట్టింది. తన గ్రూపు అధీనంలో ఉన్న అన్ని విమానాశ్రయాల్లో వీటి ఏర్పాటుకు ప్లాన్లు వేస్తోంది. ‘సిటీ సైడ్ డెవలప్‌మెంట్ పోర్ట్‌ఫోలియా’ కింద ఈ ప్రాజెక్టును చేపట్టనుంది. అదానీ గ్రూప్ కింద 500 పైగా ఎకరాల భూమి అందుబాటులో ఉంది. దీంతో అందులోని 70 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో వివిధ వాణిజ్య సముదాయాల నిర్మాణాన్ని విస్తృతంగా చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ నిర్మాణాల లిస్టులో హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, రిటైల్స్, ఎంటర్‌టైన్‌మెంట్, హెల్త్‌కేర్ ఆప్షన్లు, లాజిస్టిక్స్, కమర్షియల్ ఆఫీసులు, అనుబంధ రియల్ ఎస్టేట్ సెగ్మెంట్లు ఉండటం విశేషం.
వివిధ కంపెనీల ఫలితాలు
సిమెంట్ తయారీ సంస్థ ఏసీసీ లాభం ఏకంగా 60 శాతం పెరిగింది. ఆదాయ (రెవెన్యూ) వృద్ధి 15 శాతంగా నమోదైంది. ఈ సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలోని తొలి త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. హెచ్‌సీఎల్ టెక్ సంస్థ ఫస్ట్ క్వార్టర్ (క్యూ1) రిజల్ట్స్‌ను డిక్లేర్ చేసింది. నికర లాభం 8.6 శాతం డౌన్ కావటంతో రూ.3,283 కోట్లకు తగ్గినట్లు తెలిపింది. ఈ పరిస్థితుల్లోనూ డివిడెంట్లను ప్రకటించటం చెప్పుకోదగ్గ విషయం. లాభం 634 కోట్లు తగ్గినట్లు ఎల్&టీ ఇన్ఫోటెక్ పేర్కొంది.
స్టాక్ మార్కెట్ అప్‌డేట్
ఈ వారాంతంలో ఇవాళ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 300 పాయింట్లు, నిఫ్టీ 88 పాయింట్లు పెరిగాయి. నిఫ్టీలో మెటల్ సెక్టార్ షేర్లు తప్ప అన్ని రంగాల షేర్లూ నింగి వైపే చూస్తున్నాయి. ఎఫ్‌ఎంసీజీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆటోమొబైల్స్ స్టాక్స్‌కీ ప్రాఫిట్స్ వచ్చాయి. ఈ మూడు సెక్టార్లకూ ఒక శాతం చొప్పున లాభాలు నమోదయ్యాయి.