ముంబైలో మళ్లీ పెరుగుతున్న కేసులు… జులై 15 త‌రువాత‌…

దేశంలో మ‌రోసారి క‌రోనా కేసులు పెరుగుతున్నాయి.  కేసుల‌తో పాటు మ‌ర‌ణాల సంఖ్య‌కూడా పెరుగుతున్న‌ది.  నిన్న‌టి రోజున 43 వేల‌కు పైగా కేసులు న‌మోదైన సంగ‌తి తెలిసిందే.  43 వేల కేసుల్లో 30 వేల‌కు పైగా కేసులు ఒక్క కేర‌ళ రాష్ట్రంలోనే న‌మోద‌య్యాయి.  180 మంది క‌రోనాతో మృతి చెందారు.  ఇక ఇదిలా ఉంటే, మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబైని మ‌ళ్లీ క‌రోనా భ‌య‌పెడుతున్న‌ది.  ముంబై న‌గ‌రంలో నిన్న‌టి రోజున 500 ల‌కు పైగా కేసులు న‌మోద‌య్యాయి.  జులై 15 వ తేదీ త‌రువాత 500 ల‌కు పైగా కేసులు న‌మోదు కావ‌డం ఇదే మొద‌టిసారి.  రేపటి నుంచి గ‌ణేష్ చ‌తుర్థి ఉత్స‌వాలు ప్రారంభం కాబోతున్నాయి.  గ‌ణేష్ ఉత్స‌వాల స‌మ‌యంలో పెద్ద ఎత్తున మండ‌పాలు ఏర్పాటు చేస్తారు.  మండ‌పాల్లో ఏర్పాటు చేసిన గ‌ణ‌ప‌య్య‌ల‌ను చూసేందుకు పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు వ‌స్తుంటారు.  క‌రోనా ముప్పు పొంచి ఉండ‌టంతో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, క‌రోనా నిబంధ‌న‌లు పాటించాల‌ని ప్ర‌భుత్వం హెచ్చ‌రించింది.  

Read: రాజ‌కీయాల్లో శ‌శిక‌ళ రీఎంట్రీ ఇస్తుందా?

Related Articles

Latest Articles

-Advertisement-