Vizag Crime: దారుణం.. భార్య వివాహేతర సంబంధంతో భర్త బలి
- విశాఖలో భార్య వివాహేతర సంబంధంతో భర్త బలి
- భార్య.. స్నేహితుడు చేసిన మోసం తట్టుకోలేక ఆత్మహత్య
- సూసైడ్ కు ముందు వీడియో రికార్డు చేసిన మృతుడు హరి ప్రకాష్
- ఆరు పేజీల లేఖతో వాంగ్మూలం
- ద్వారకా స్టేషన్ లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వివాహేతర సంబంధాలు పచ్చని సంసారంలో చిచ్చుపెడుతున్నాయి. భార్య భర్తలు సంతోషంగా బతుకుతున్న సమయంలో.. వారి జీవితంలోకి కొందరు మృగాళ్లు చేరి సంసారాన్ని ఆగం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. విశాఖలో దారుణం చోటు చేసుకుంది. భార్య వివాహేతర సంబంధంతో భర్త బలయ్యాడు. మృతుడు విశాఖలోని ఓ ప్రయివేట్ ఇన్స్యూరెన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కట్టుకున్న భార్య, నమ్మిన స్నేహితుడు మోసం చేయడం తట్టుకోలేక హరి ప్రకాష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీతంపేటలో విగ్నేశ్వర విల్లాలోని F11లో హరిప్రకాష్, భువనేశ్వరి కాపురం ఉంటున్నారు. వీరిద్దరికీ ఇది రెండో పెళ్లి కాగా.. మొదటి భార్యకు 12 ఏళ్ల కుమార్తె ఉంది.
Read Also: Mamata Banerjee: డాక్టర్ హత్యపై సీఎం కీలక వ్యాఖ్యలు.. అవసరమైతే నిందితుల్ని ఉరితీస్తామని ప్రకటన
Also Read
అయితే.. స్నేహితుడు రాజేష్‌తో భువనేశ్వరి వివాహేతర సంబంధాలు ఉన్నాయని.. ఈ క్రమంలో అతన్ని వారు తీవ్రంగా వేధించే వారని మృతుడు హరి ప్రకాష్ చనిపోయే ముందు సెల్ఫీ వీడియోలో చెప్పాడు. ఆ వేధింపులు భరించలేకనే తన ప్రాణాలు తీసుకుంటున్నట్టు తెలిపాడు. అలాగే, భువనేశ్వరికి ఆమె బావతోనూ సంబంధాలు ఉన్నాయని ఆరోపించాడు హరి ప్రకాష్. ఆరు పేజీల మరణ వాంగ్మూలం కూడా విడుదల చేశారు. రెండవ భార్య భువనేశ్వరి పెట్టే బాధలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టు అందులో పేర్కొన్నాడు. చనిపోయే ముందు కుటుంబ సభ్యులకు తన ఆవేదన చెప్పుకున్న తీరు కలచి వేస్తోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజేష్ పరారీలో ఉండగా.. హరి ప్రకాష్ కుటుంబం ఈ ఘటనపై ద్వారకా పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
Read Also: National Disaster: జాతీయ విపత్తు అంటే ఏంటి?.. వయనాడు ఘటనపై కేంద్ర వైఖరి?
తాజావార్తలు
-
IND vs ENG 2nd T20: సంజును తొలగించకుండా, వైభవ్‌కు అవకాశం ఇవ్వాలంటే.. ఇదొక్కటే మార్గం!
-
CM Vijay vs DMK: సీఎం విజయ్-త్రిషపై అనుచిత వ్యాఖ్యలు.. మాజీ మంత్రి అరెస్ట్..
-
iQOO Z11i: ఐకూ Z11i విడుదల.. 6500mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లే, Snapdragon 4 Gen 2
-
Indian Govt: ఇక నుంచి ఆ యాప్స్ పని చేయవు.. ఈ రెండు యాప్స్‌పై బ్యాన్ విధించిన కేంద్రం..
-
India Real Estate: రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు బంపర్ బూస్ట్.. 2026 తొలి అర్ధభాగంలో భారీ పెట్టుబడులు..
ట్రెండింగ్
-
IND vs ENG 2nd T20: సంజు అవుట్, వైభవ్ ఇన్.. రెండో టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్‌ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్‌ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్‌లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!