Ajit Doval: స్వేచ్ఛ అంటే ఇష్టానుసారంగా ప్రవర్తించడం కాదు.. జెన్-జీపై అజిత్ దోవల్ కీలక వ్యాఖ్యలు
- జెన్-జీ ఉద్యమంపై అజిత్ దోవల్ కీలక వ్యాఖ్యలు
- స్వేచ్ఛ అంటే ఇష్టానుసారంగా ప్రవర్తించడం కాదు
- జాతీయ ప్రయోజనాలే ముఖ్యంగా ఉండాలని హితవు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జెన్-జీ ఉద్యమంపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్వేచ్ఛ అంటే ఇష్టానుసారంగా ప్రవర్తించడం కాదని.. యువత జాతీయ ప్రయోజనాల గురించి కూడా ఆలోచించాలని హితవు పలికారు. లోకమాన్య బాల గంగాధర్ తిలక్ వర్ధంతిని పురస్కరించుకుని మహారాష్ట్రలోని పూణెలో శనివారం ఒక ప్రత్యేక కార్యక్రమం జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అజిత్ దోవల్‌కు 2026 లోకమాన్య తిలక్ జాతీయ అవార్డును ప్రదానం చేశారు. దోవల్‌కు సాంప్రదాయ పూణేరి తలపాగా, జ్ఞాపిక, చెక్కు, గీతా రహస్య ప్రతిని అందజేశారు.
అవార్డు స్వీకరించిన అనంతరం దోవల్ ప్రసంగించారు. యువత స్వేచ్ఛ యొక్క నిజమైన అర్థాన్ని గ్రహించాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రధాని మోడీ, అమిత్ షాల నాయకత్వాన్ని బహిరంగంగా ప్రశంసించారు. మోడీ, అమిత్ షా వంటి బలమైన నాయకత్వం మనకు ఉండటం మన అదృష్టమని తెలిపారు. భారతదేశం ప్రస్తుతం అంతర్గత, బాహ్య సవాళ్లను ఎదుర్కొంటోందని… దేశం వేగంగా అభివృద్ధి చెందుతుండగా.. అనేక వ్యతిరేక శక్తులు దాని పురోగతి గురించి ఆందోళన చెందుతున్నాయన్నారు. ఇటువంటి సమయంలో ప్రతి పౌరుడు అన్నింటికన్నా ముందుగా జాతీయ ప్రయోజనాల గురించి ఆలోచించాలని కోరారు.
Also Read
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
- CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఇండియా కూటమిలోకి విజయ్ పార్టీ TVK!
యువతకు సందేశం ఇస్తే.. ‘‘నేటి తరం స్వేచ్ఛ యొక్క నిజమైన అర్థాన్ని అర్థం చేసుకోవడం చాలా కీలకం. స్వేచ్ఛ అంటే తమకు నచ్చింది చేసుకునే హక్కు అని కొందరు భావిస్తారు. కానీ అలాంటి ఆలోచన పూర్తిగా తప్పు.’’ జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకమైన మార్గంలో మనం అడుగు కూడా పెట్టకూడదని హితవు పలికారు. భారతదేశాన్ని శక్తివంతం చేయడమే మన మొదటి కర్తవ్యంగా ఉండాలన్నారు.
ఈ సందర్భంగా చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. పూణెలో తన ప్రాథమిక విద్య సమయంలోనే లోకమాన్య తిలక్ ఆలోచనల గురించి మొదటిసారిగా వివరంగా తెలుసుకున్నానని వివరించారు. బ్రిటిష్ పాలనలో ప్రజలు భయంతో మౌనంగా ఉన్నప్పుడు.. తిలక్ నిర్భయంగా మాట్లాడారని.. జైలులో ఉన్న తర్వాత కూడా ఆయన తన సాంఘిక సేవను ఎన్నడూ విడిచిపెట్టలేదన్నారు. తిలక్ జీవితం, పోరాటాల నుంచి స్ఫూర్తి పొంది దేశ నిర్మాణానికి తోడ్పడాలని యువతకు దోవల్ విజ్ఞప్తి చేశారు.
ఇటీవల నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళన చేపట్టారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులపై లాఠీఛార్జ్ జరిగింది. అనంతరం ఆందోళనలు తీవ్రం కావడంతో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది.
- Tags
- ajit doval
- Freedom
- Gen Z
తాజావార్తలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!