Site icon NTV Telugu

ఈ స్టార్స్ సినిమాల ట్యాక్స్ కట్టారా ? ఏపీ ప్రభుత్వం ఆరా !

Tollywood

తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఇండస్ట్రీ సమస్యలపై వివాదం పెద్దదవుతోంది. టాలీవుడ్ సమస్యలను పట్టించుకోండి అంటూ మొన్నటికి మొన్న మెగాస్టార్ చిరంజీవి ఏపీ ప్రభుత్వానికి ‘లవ్ స్టోరీ’ మూవీ ప్రీ రిలీజ్ వేడుక వేదికగా విన్నవించుకున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 25న జరిగిన ‘రిపబ్లిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై గట్టిగానే ఫైర్ అయ్యారు. సినీ పెద్దలందరికీ చురకలు అంటిస్తూనే, ఇటు జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు.

Read Also : సన్నాసుల్లారా కోట్లు ఊరికే రాలేదు : పవన్

“పవన్ కళ్యాణ్ సినిమాలు ఆపేస్తే.. అతను నటించిన సినిమాలు ఆపేస్తే భయపడి కాళ్ల దగ్గరకు వస్తారని అనుకుంటున్నట్టున్నారు. వాళ్లు తప్పుగా అర్ధం చేసుకుంటున్నారు. నేనయినా, దర్శకుడైనా, నటులైనా చేసిన సినిమాలకే డబ్బులు తీసుకుంటున్నారు.. అడ్డగోలుగా వేల కోట్లు మాత్రం సంపాదించలేదు.. తప్పుడు కాంట్రాక్టులు చేసి సంపాదించలేదు.. జనాలను ఎంటర్ టైన్ చేసి డాన్సులు వేసి కిందా మీద పడి, ఒళ్లువిరగ్గొట్టుకుని కృషి చేస్తే డబ్బులు వస్తున్నాయి. ట్యాక్సులు కడుతున్నాము. వైసీపీ ప్రభుత్వం అక్కడ థియేటర్లకు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. దానికి చెబుతున్నా ఇది. భారతదేశ పౌరులుగా ఇది మీ హక్కు. చిరంజీవి గారి లాంటి వ్యక్తులకు కూడా చెప్పండి. ఇది హక్కు… ప్రాధేయపడకండి. ఈ దేశం ఒకడి సొత్తు కాదు… సినిమా పెద్దలు మాట్లాడండి” అంటూ ప్రభుత్వ చర్యలపై మండిపడ్డారు.

Read Also : చిరంజీవికి చెప్పండి… రిక్వెస్ట్ కాదు హక్కు… : పవన్

నిన్న పవన్ ఈ కామెంట్స్ చేశారు. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆయన వ్యాఖ్యలను జగన్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నట్టు కన్పిస్తోంది. ఎందుకంటే తాజాగా ఏపీ ప్రభుత్వం గత ఏడాది సంక్రాంతికి విడుదలైన మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’, అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురంలో’ చిత్రాలకు ట్యాక్స్ కట్టారా ? లేదా అనే విషయాలను ఆరా తీస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం ఏరియాల వైజ్ గా సినిమాల కలెక్షన్లకు సంబంధించిన రిపోర్ట్ పంపమంటూ డిస్ట్రిబ్యూటర్లను ఆదేశించినట్టు సమాచారం. గత సంవత్సరం సంక్రాంతికి విడుదలైన ఈ సినిమాలు భారీ వసూళ్లను రాబట్టినా పన్ను ఎగవేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మరి ఈ వివాదం ఎంత దూరం వెళ్తుందో చూడాలి.

Exit mobile version