చిరంజీవికి చెప్పండి… రిక్వెస్ట్ కాదు హక్కు… : పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిన్న “రిపబ్లిక్” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆయన మాట్లాడుతూ “సినీ పెద్దలకు నా విన్నపం. సినిమా టిక్కెట్లను అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు తీసుకోవాలనుకుంటుంది అంటే… వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఎందుకు డబ్బులు లేవంటే… చిత్రపరిశ్రమలో వచ్చిన సంపద గవర్నమెంట్ ఖజానాలోకి వెళ్తే బ్యాంకులకు మా దగ్గర ఇంత సంపద ఉందని చూపించుకోవచ్చు. చిత్రపరిశ్రమ నుంచి మేము టిక్కెట్లు అమ్ముతాము కాబట్టి… మటన్ కొట్టును అమ్ముతున్నాము… ఇసుక అమ్ముతున్నాము దాని మీద వచ్చే ఆదాయం చూపించొచ్చు. బ్రాందీ మీద ఆదాయం ఉంది. ఇవన్నీ చూపించి బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుంటారు. అందులో భాగంగానే చిత్రపరిశ్రమ డబ్బులు కూడా లోన్లు పెట్టడానికి తీసుకుబోతున్నారు.

Read Also : ఆమెకు అసలు బోన్స్ ఉన్నాయా ? హీరోయిన్ పై మహేష్ కామెంట్స్

భారీ పథకాలకు ప్రతి ఒక్కరినీ బలి చేస్తే… 100 మంది దగ్గర పన్నులు వసూలు చేసి 40 మందికి ధార పోస్తానంటే మిగతా 60 మంది చేతులు కట్టుకుని కూర్చుంటారా ? కుదరదు. మాకు ఆ పథకానికి డబ్బులు… ఖజానా నుంచి డబ్బులు తీసుకురండి అంటే చివరికి ఆర్ధిక శాఖ కార్యదర్శి విసిగిపోయి ‘జల్సా’లో బ్రహ్మానందంలా ‘ఇక్కడ ఇంకా ఏం మిగిలింది చిరిగిపోయిన చొక్కా దానికో బొక్క తప్ప’ అనే డైలాగ్ కొట్టాల్సి వస్తుంది. వైసీపీ ప్రభుత్వం అక్కడ థియేటర్లకు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. దానికి చెబుతున్నా ఇది. భారతదేశ పౌరులుగా ఇది మీ హక్కు. చిరంజీవి గారి లాంటి వ్యక్తులకు కూడా చెప్పండి. ఇది హక్కు… ప్రాధేయపడకండి. ఈ దేశం ఒకడి సొత్తు కాదు… చెప్పండి. కూర్చొని బావా బావా… సోదరా సోదరా అనుకుంటే కాదు… సినిమా పెద్దలు మాట్లాడండి” అంటూ చిత్రపరిశ్రమపై ఏపీ ప్రభుత్వం వైఖరి గురించి మండిపడ్డారు.

-Advertisement-చిరంజీవికి చెప్పండి… రిక్వెస్ట్ కాదు హక్కు… : పవన్

Related Articles

Latest Articles