స్వాతంత్ర్య దినోత్సవం.. ఉద్యోగుల జీతాల అంశాన్ని ప్రస్తావించిన సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఏపీ సీఎం వైఎస్ జగన్.. జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ.. స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం చివరల్లో ఉద్యోగాల జీతాల అంశాన్ని ప్రస్తావించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. అధికారంలోకి రాగానే ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇచ్చామని గుర్తుచేసిన ఆయన.. కాంట్రాక్టు ఉద్యోగులకు టైం స్కేల్ ఇచ్చామన్నారు.. చాలీ చాలని జీతంతో ఉన్న చిరు ఉద్యోగులకు వేతనాలు పెంచామని.. ఉద్యోగులకు చేయాల్సినవి మరి కొన్ని ఉన్నాయని నాకు తెలుసు.. ఉద్యోగులందరికీ న్యాయం జరిగేలా రాబోయే రోజుల్లో మరికొన్ని నిర్ణయాలు తీసుకుంటామని ప్రకటించారు.
గత కొంత కాలంగా కన్పించని శత్రువుతో పోరాడుతున్నాం అన్నారు సీఎం వైఎస్ జగన్.. గత 16 నెలల కాలంలో ఆశించిన రెవెన్యూ రాలేదు.. వ్యయం మాత్రం అనుకోని విధంగా పెరిగిందన్న ఆయన.. నేటి కంటే రేపు బాగుండేలా ప్రతి రూపాయినీ బాధ్యతగా ఖర్చు చేస్తున్నాం.. రాష్ట్ర గతిని మార్చే నిర్ణయాలు తీసుకున్నామని వెల్లడించారు.. ఇక, రైట్ టు ఎడ్యుకేషనే కాదు.. రైట్ టు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అమలయ్యేలా చర్యలు తీసుకున్నాం అన్నారు ఏపీ సీఎం.. మరోవైపు.. కొత్త లక్ష్యాలను నిర్దేశించుకునే సమయం ఇదని.. రేపు అనేది ప్రతి ఒక్కరికీ భరోసా ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. హక్కులు అందరికీ సమానంగా అందాలన్నారు. పారదర్శక పాలన అందిస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మేలు జరిగేలా చూస్తున్నామని, 26 నెలల కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని సీఎం వైఎస్ జగన్ అన్నారు. వ్యవసాయ రంగంపై రూ.83 వేల కోట్ల వ్యయం చేశామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. రైతులకు పగటిపూటే నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని పేర్కొన్నారు. రైతుభరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున అందిస్తున్నామన్నారు. పెట్టుబడి సాయం కింద రైతులకు ఇప్పటివరకు రూ.17వేల కోట్లు ఇచ్చామని, 31 లక్షల మంది రైతులకు వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా అందించామని సీఎం పేర్కొన్నారు. రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయడంతో పాటు, ధాన్యం కొనుగోలు సేకరణ కోసం రూ.33 వేల కోట్లు ఖర్చు చేశామని’’ సీఎం వైఎస్ జగన్ అన్నారు.
Also Read
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
- Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
- CM Vijay: సీఎం విజయ్ ఖాళీ చేసిన తిరుచ్చి స్థానానికి బైపోల్ ఎందుకు జరగలేదు.. కారణమిదేనా?
తాజావార్తలు
-
US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
-
The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. ‘ది ప్యారడైజ్’ ఓటీటీలో ఊహించని మార్పులు!
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్డౌన్!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు