75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవాన అంతా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు ఏపీ సీజే అరూప్ గోస్వామి.. హైకోర్టు ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన సీజే అరూప్ గోస్వామి.. జాతీయ జెండాకు వందనం చేశారు.. ఈ కార్యక్రమానికి జడ్జీలు, ఏజీ శ్రీరాం సుబ్రమణ్యం తదితరులు హాజరు కాగా.. ఈ సందర్భంగా జస్టిస్ అరూప్ గోస్వామి మాట్లాడుతూ.. స్వాతంత్ర్య దినోత్సవాన అంతా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.. స్వాతంత్ర్యం కోసం మహనీయులు చేసిన త్యాగఫలాలను…
సిరిసిల్ల జిల్లాలో గతంలో చూడలేని అభివృధ్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు మంత్రి కేటీఆర్… 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నఆయన.. జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ.. సిరిసిల్ల జిల్లాలో సమారు లక్షా 16వేల 577 మంది రైతులకు 812 కోట్ల రూపాయలను ముందష్తు పంట పెట్టుబడి క్రింద రైతుల ఖాతాలలో ప్రభుత్వం నేరుగా జమ చేసిందన్నారు.. ఋణమాఫీ సంబంధించి జిల్లాలో 25 వేల రూపాయలు ఋణం తీసుకున్న 10,289 మంది రైతులకు…
రేపటి నుంచి రెండో విడత రుణ మాఫీ ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నట్టు ప్రకటించారు తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు.. సిద్దిపేటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎందరో మహనీయుల త్యాగాలతో దేశానికి స్వాతంత్ర్యం సాధించుకున్నాం.. మహనీయుల స్ఫూర్తి, మహాత్ముడి అహింసా మార్గం, ప్రజాస్వామ్య పద్ధతిలో మహోద్యమాన్ని నిర్మించి తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసుకున్నాం అన్నారు. ఏ ఆశయ సాఫల్యం కోసం స్వరాష్ట్రాన్ని కోరుకున్నమో ఆ లక్ష్యసాధన…
విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఏపీ సీఎం వైఎస్ జగన్.. జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ.. స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం చివరల్లో ఉద్యోగాల జీతాల అంశాన్ని ప్రస్తావించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. అధికారంలోకి రాగానే ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇచ్చామని గుర్తుచేసిన ఆయన.. కాంట్రాక్టు ఉద్యోగులకు టైం స్కేల్ ఇచ్చామన్నారు.. చాలీ చాలని జీతంతో ఉన్న చిరు ఉద్యోగులకు వేతనాలు పెంచామని.. ఉద్యోగులకు…