10 రోజులు.. 4 ప్రమాదాలు.. సింగరేణిలో ఏం జరుగుతోంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక సంస్థగా పేరున్న సింగరేణి కాలరీస్ ప్రమాదాలకు నిలయంగా మారిందా? యాజమాన్యం కార్మికుల భద్రతను పట్టించుకోవడం లేదా? నల్లబంగారం అందించే కార్మికుల ప్రాణాలకు విలువే లేదా? అంటే అవుననే అనిపిస్తోంది. తాజాగా 10 రోజుల వ్యవధిలో నాలుగు ప్రమాదాలు జరగడం విస్మయం కలిగిస్తోంది. దీంతో సింగరేణిలో ఏం జరుగుతోందని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.

కాసిపేట మండలం కల్యాణి ఖని ఉపరితల బొగ్గు గనిలో ప్రమాదం జరిగింది. షవర్ ఆపరేటర్ మట్టి పోస్తుండగా మట్టి కుప్ప కింద పడి అండర్ మేనేజర్ పురుషోత్తం ప్రమాదవశాత్తు మృతిచెందాడు. పది రోజుల వ్యవధిలో మంచిర్యాల జిల్లా సింగరేణిలో నాలుగో ప్రమాదం జరిగింది. శ్రీరాంపూర్‌లోని ఎస్ఆర్పీ-3 అండర్ గ్రౌండ్ గనిలో నవంబర్ 10న ప్రమాదం జరిగింది. బొగ్గుగని పైకప్పు ఉన్నట్టుండి పెళపెళమంటూ కూలి.. భారీ శిథిలాల రూపం లో విరుచుకుపడింది. దీంతో నలుగురు కార్మికులు సజీవ సమాధి అయ్యారు.
Also Read
- Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్‌దేవ్‌పై కంగనా ఫైర్
- Amit shah: రేపు తమిళనాడులో దక్షిణాది ముఖ్యమంత్రులతో అమిత్ షా భేటీ.. ఆ 3 అంశాలపై చర్చ
- Delhi CNG Blast: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. సీఎన్జీ సిలిండర్ పేలి ముగ్గురు మృతి
- PM Modi: యువతపై ప్రత్యేక దృష్టి.. రోజుకో యూనివర్సిటీ సందర్శనకు కేంద్ర మంత్రి!
నవంబర్ 10 ఉదయం 10:30 గంటలకు ఈ ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో టింబర్‌మెన్ వి.కృష్ణారెడ్డి (57), బేర లక్ష్మయ్య (60) బదిలీ వర్కర్లు గాదం సత్యనారాయణరాజు (32) రెంకా చంద్రశేఖర్ మృతిచెందారు. మృతదేహాల వెలికితీత కోసం భూపాలపల్లి, రామగుండం, శ్రీరాంపూర్‌కు చెం దిన సింగరేణి రెస్క్యూ టీమ్ చర్యలు చేపట్టారు. భారీ శిథిలాలు కావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.
మృతుల కుటుంబాల్లో అర్హులైన ఒకరికి తక్షణమే వారు కోరుకున్న ప్రాంతంలో ఉద్యోగం ఇస్తామని యాజమాన్యం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు మ్యాచింగ్ గ్రాంట్, గ్రాట్యూటీ తదితర చెల్లింపులు కలుపుకొని దాదాపు రూ.70 లక్షల నుంచి రూ. కోటి దాకా అందజేశామని సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ ప్రకటించారు. గనుల్లో తరుచుగా ప్రమాదాలు జరుగుతూ కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నా యాజమాన్యం రక్షణ చర్యలు తీసుకోవడం లేదు. యాజమాన్యం టార్గెట్లపై చూపుతున్న శ్రద్ధ కార్మికుల రక్షణలో చూపడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మరో ప్రమాదం జరగడంపై కార్మికులు మండిపడుతున్నారు.
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్‌లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!