రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, బిలియనీర్ ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ సోమవారం వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించారు. తన కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల వివాహానికి ఆశీస్సులు పొందేందుకు ఆలయానికి వచ్చినట్లు ఆమె తెలిపారు. రాధిక మర్చంట్‌తో అనంత్ అంబానీ వివాహం జూలై 12న జరుగనుంది. ఈ సమయంలో మూడు రోజుల పాటు జరిగే కార్యక్రమంలో భారత్‌తో పాటు విదేశాలకు చెందిన ప్రముఖులు పాల్గొననున్నారు. తన కొడుకు, కాబోయే కోడలు కోసం బాబా…
Gyanvapi mosque case:వారణాసిలోని జ్ఞానవాపి మసీదు విషయం గతేడాది నుంచి వార్తల్లో నిలుస్తోంది. స్థానిక కోర్టు ఆదేశాలతో వీడియో రికార్డింగ్ చేస్తున్న సమయంలో మసీదులోని వాజుఖానాలోని కొలనులో ‘శివలింగం’ లాంటి నిర్మాణం లభించింది. దీంతో ఒక్కసారిగా ఈ వార్త దేశంలో చర్చనీయాంశంగా మారింది.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారం ఉదయం కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రార్థనలు చేశారు. గత ఆరేళ్లలో 100వ సారి ఆలయాన్ని సందర్శించిన ఉత్తరప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి అయ్యారని అధికారిక ప్రకటన తెలిపింది.
దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన జ్ఞానవాపి మసీదు కేసు విచారణ సోమవారం తిరిగి ప్రారంభం కానుంది. ఐదుగురు మహిళలు జ్ఞానవాపి మసీదులోని దేవతామూర్తులకు పూజ చేసుకునే అవకాశం కల్పించాలని కోరుతూ వారణాసి కోర్టును ఆశ్రయించారు. దీనిపై అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ వివాదాన్ని వారణాసి జిల్లా కోర్టులో పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మే 30న ఇరుపక్షాల వాదనలు విన్న వారణాసి జిల్లా కోర్టు కేసును జూలై 4కు వాయిదా వేసింది. దీంతో…
జ్ఞానవాపి మసీదు కేసు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. తాజాగా వారణాసి జిల్లా కోర్ట్ లో ఈ కేసుపై విచారణ జరగుతోంది. తాజాగా ఈ రోజు వీడియోగ్రఫీ సర్వేను ఛాలెంజ్ చేస్తూ అంజుమన్ ఇంతేజామియా వేసిన పిటిషన్ ను వారణాసి కోర్ట్ విచారించింది. అయితే కోర్ట్ ముస్లింల తరుపున తదుపరి వాదనలను వినేందుకు మే 30కి విచారణ వాయిదా వేసింది. అయితే ఇప్పటికే వీడియో సర్వేపై అభ్యంతరాలు దాఖలు చేసేందుకు హిందూ, ముస్లిం పక్షాలకు కోర్ట్…
జ్ఞానవాపి మసీదు వివాదం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇటీవల వారణాసి కోర్ట్ వీడియో సర్వేకు ఆదేశాలు ఇవ్వడంతో ఈ నెల 14-16 వరకు సర్వే జరిగింది. మసీదులోని వాజుఖానా ప్రదేశంలోని కొలనులో శివలింగం బయటపడిందనే వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే జ్ఞానవాపి మసీదు సర్వేను నిలిపివేయాలంటూ… అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ సుప్రీంను ఆశ్రయించింది. ఇటీవల సుప్రీం కోర్ట్ ఈ వివాదంపై విచారణ జరిపింది. శివలింగం బయటపడిన ప్రాంతానికి రక్షణ కల్పించడంతో పాటు ముస్లింలు ప్రార్థన…
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా జ్ఞానవాపి మసీదు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. వారణాసి కోర్టు మసీదు మొత్తాన్ని వీడియో సర్వే చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఈ నెల 14-16 వరకు వీడియోగ్రఫీ సర్వే చేశారు. ఇదిలా ఉంటే మసీదులో ఉన్న బావితో శివలింగం బయటపడిందని తెలుస్తోంది. నిజానికి సర్వే రిపోర్టును ఈ నెల 17న వారణాసి కోర్టుకు అందించాలి… అయితే మసీదులోని వాజుఖానా బావిలో శివలింగ ఆకారం బయటపడటంతో సర్వే రిపోర్ట్ ఇవ్వడానికి మరో రెండు రోజులు గడువు…
వందేళ్ల క్రితం దొగిలించబడిన అన్నపూర్ణ దేవి విగ్రహం తిరిగి భారత్‌కు రప్పించింది కేంద్ర ప్రభుత్వం.. 18వ శతాబ్దానికి చెందిన అన్నపూర్ణ దేవి విగ్రహాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి అప్పగించారు. వదేళ్ల క్రితం చోరీకి గురైన ఈ విగ్రహాన్ని కెనడాలో గుర్తించారు. కెనడా ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన కేంద్రం.. చివరకు అన్నపూర్ణ దేవి విగ్రహాన్ని వెనక్కి తీసుకువచ్చింది. ఇక, మాత అన్నపూర్ణా దేవి యాత్ర పేరుతో 4 రోజులపాటు విగ్రహంతో శోభాయాత్ర…