Andhra Pradesh: కొవిడ్-19 బూస్టర్ డోస్ టీకా విషయంలో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఏపీలో ఇప్పటికే సుమారు 59 లక్షల మంది ఈ మూడో డోస్ వేయించుకున్నారు. దేశం మొత్తమ్మీద ఏ రాష్ట్రంలోనూ లేదా ఏ కేంద్ర పాలిత ప్రాంతంలోనూ ఇంత తక్కువ వ్యవధిలో ఇంత ఎక్కువ మంది బూస్టర్ డోస్ తీసుకోలేదు. ఆంధ్రప్రదేశ్‌లో మూడు డోసులూ వేయించుకున్నవారి సంఖ్య ప్రస్తుతానికి 9.8 కోట్లకు చేరింది. మరికొద్ది రోజుల్లో 10 కోట్ల మార్క్ కూడా దాటబోతోంది. ఈ దిశలో శరవేగంగా దూసుకెళుతోంది.
పెద్దోళ్లకు బూస్టర్ డోస్‌ని ఉచితంగానే ఇస్తుండటంతో జనం భారీగా క్యూ కడుతున్నారు. ఏపీలో వయోజనులు, 15-18 ఏజ్ గ్రూప్‌వాళ్లు ఇప్పటికే వంద శాతం రెండు టీకాలు వేయించుకున్నారు. 12-14 ఏజ్ గ్రూప్‌వాళ్లు మొత్తం 14.9 లక్షల మంది ఉండగా 14.8 లక్షల మంది రెండు డోసులూ తీసుకున్నారు. ఈ ఏజ్ గ్రూప్‌లోనూ సెంట్ పర్సెంట్ వ్యాక్సినేషన్ ఫీట్‌ను త్వరలో చేరుకోనుంది. ఆంధ్రప్రదేశ్‌లో గడచిన మూడు నెలల్లోనే దాదాపు 55 లక్షల మంది టీకాలు వేయించుకోవటం చెప్పుకోదగ్గ విషయం.
read more:
Botsa Satyanarayana: వాళ్లు విలీన మండలాలు అడిగితే.. రెండు రాష్ట్రాలను మళ్లీ కలపాలని మేం డిమాండ్ చేస్తాం
అక్కడ 18-60 ఏజ్ గ్రూప్‌వాళ్లకు బూస్టర్ డోస్‌ను ఈ నెల 15 నుంచి ఇస్తున్నారు. వ్యాక్సినేషన్ విషయంలో ఏపీ ఇలా రికార్డులు నెలకొల్పుతున్నప్పటికీ రోజూ నమోదవుతున్న కొత్త కరోనా కేసుల సంఖ్య సైతం మరోసారి పెరుగుతోంది. మే నెలలో నిత్యం పది కన్నా ఎక్కువ పాజిటివ్ కేసులు వచ్చేవి కాదు. కానీ ఇప్పుడు రోజుకి ఏకంగా 400 నుంచి 500 మంది వరకు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. జూన్ 8 వరకు కూడా డైలీ యాక్టివ్ కేసుల సంఖ్య పట్టుమని వంద దాటేది కాదు. ఇప్పుడది 2,760 వద్ద ఉంది. జూన్‌లో సగటు పాజిటివిటీ రేట్ 2.9 శాతం ఉండగా జూలైలో 10 శాతం దాటింది.
బూస్టర్ డోస్‌ను ఎక్కువ మంది వేయించుకోవటానికి ఇది కూడా ఒక కారణం కావొచ్చని పరిశీలకులు అంటున్నారు. 2020, 2021 సంవత్సరాల్లో కరోనా పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు కేసుల కట్టడికి సీఎం జగన్ సరైన చర్యలు చేపట్టలేదని ప్రతిపక్ష పార్టీలు విమర్శించేవి. ఆ స్థితి నుంచి రాష్ట్రం ఇవాళ వ్యాక్సినేషన్ విషయంలో దేశంలోనే మొదటి స్థానాన్ని ఆక్రమించటం గొప్ప పరిణామమని అంటున్నారు. ఈ ఘనత సాధించటంలో వైద్య సిబ్బంది పాత్ర కీలకమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే వాళ్లకే ఈ ప్రశంసలు దక్కాలి.