Andhra Pradesh: కొవిడ్-19 బూస్టర్ డోస్ టీకా విషయంలో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఏపీలో ఇప్పటికే సుమారు 59 లక్షల మంది ఈ మూడో డోస్ వేయించుకున్నారు. దేశం మొత్తమ్మీద ఏ రాష్ట్రంలోనూ లేదా ఏ కేంద్ర పాలిత ప్రాంతంలోనూ ఇంత తక్కువ వ్యవధిలో ఇంత ఎక్కువ మంది బూస్టర్ డోస్ తీసుకోలేదు.