Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Aimim Corporator Misbehaving With Police In Hyderabad

Hyderabad Old City: ఇక్కడ ఇలాగే ఉంటుంది.. మరో ఎంఐఎం కార్పొరేటర్‌ హంగామా..

Published Date :April 7, 2022 , 11:03 am
By Sudhakar Ravula
Hyderabad Old City: ఇక్కడ ఇలాగే ఉంటుంది.. మరో ఎంఐఎం కార్పొరేటర్‌ హంగామా..
  • Follow Us :
  • google news
  • dailyhunt

హైదరాబాద్‌లో ఎంఐఎం కార్పొరేటర్లు హల్‌ చల్‌ చేస్తున్నారు.. భోలక్‌పూర్ కార్పొరేటర్ ఘటన మరువక ముందే… ఓల్డ్‌ సిటీలో మరో ఎంఐఎం కార్పొరేటర్‌ వ్యవహారం హాట్‌ టాపిక్‌గా మారిపోయింది.. చార్మినార్‌ యునాని ఆసుపత్రి ముందు నో పార్కింగ్ ఏరియాలో.. తన వాహనాన్ని పార్క్‌ చేశాడు. మక్కా మసీదు ప్రాంతంలో ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో.. వెహికల్స్ పార్కింగ్‌ కోసం యునాని హాస్పిటల్‌ గేట్లు తెరిపించాడు కార్పొరేటర్ సయ్యద్ సొహైల్‌ ఖాద్రి.. అయితే, దీనిపై పోలీసులకు సమాచారం చేరవేశారు పోలీసులు.. డయల్‌ 100కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేశారు.. ఇక, ఫోన్‌ కాల్‌తో రంగంలోకి దిగారు ఎస్సై.. ఘటనా స్థలానికి చేరుకున్నారు.. అయితే, ఎస్సైతో వాగ్వాదానికి దిగాడు ఎంఐఎం కార్పొరేటర్.. ఎస్సైని పట్టుకుని నానా హంగామా చేశాడు.. అసలు మీకు ఇక్కడ ఏం పని.. ఎందుకొచ్చారంటూ నిప్పులు చెరిగాడు.. ఇక్కడ ఇలాగే చేస్తామంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగిన కార్పొరేటర్.

Read Also: Narayana Swamy: మళ్లీ మంత్రి కావాలనే ఆశ లేదు.. జగన్‌ నిర్ణయమే ఫైనల్..

కాగా, ఈ తాజాగా ముషీరాబాద్‎లో పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడిన భోలక్‌పూర్ ఎంఐఎం కార్పొరేటర్‎ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.. మంగళవారం భోలక్‌పూర్‌లో అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ తెరిచి ఉంచడం.. షాపును క్లోజ్ చేయాలని పోలీసులు సూచించడంతో ఎంఐఎం కార్పొరేటర్ గౌస్ రెచ్చిపోయారు.. తన ఇలాకాలో పోలీసులు అడుగు పెట్టొద్దంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాకు ఎక్కి రచ్చ చేసింది… దీంతో మంత్రి కేటీఆర్ పోలీసులతో దురుసుగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ట్విట్టర్ వేదికగా అధికారులను ఆదేశించడంతో.. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. ఐపీసీ 353, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసిన విషయం విదితమే.. మరి ఎప్పుడు చార్మినార్‌ దగ్గర రచ్చ చేసిన కార్పొరేటర్‌ వ్యవహారంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి మరి… మరోవైపు.. హైదరాబాద్‌ పోలీసులపై హాట్‌ కామెంట్లు చేశారు హైదరాబాద్‌ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ.. రేవ్‌ పార్టీ, డ్రగ్స్‌ కేసు వ్యవహారంపై సోషల్‌ మీడియా వేదికగా స్పందించిన ఆయన.. పబ్‌ నిర్వాహకుడిని అరెస్ట్‌ చేసి.. బడా బాబుల పిల్లలను వదిలిపెట్టారని ఆరోపించారు.. పెద్దలకు ఓ న్యాయం.. పేదలకు ఓ న్యాయమా? అంటూ నిలదీస్తూ.. మంత్రి కేటీఆర్, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌కు ట్యాగ్‌ చేసిన విషయం తెలిసిందే.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AIMIM Corporator
  • hyderabad
  • police
  • telangana

తాజావార్తలు

  • Bro 2 Update: పవన్ కళ్యాణ్ ‘బ్రో 2’పై సముద్రఖని క్లారిటీ.. ఇంతకీ ఏమ్మన్నాడంటే?

  • Petrol and Diesel Prices Drop: గుడ్‌న్యూస్‌ చెప్పిన కేంద్రం.. పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం భారీగా తగ్గింపు

  • Virat Kohli New Tattoo: ఐపీఎల్‌కు ముందు విరాట్ కోహ్లీ కొత్త టాటూ.. దాని అర్థం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

  • Anantapur Crime: సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ సమయంలో పోలీసులపై నిందితుల దాడి.. ఆత్మరక్షణ కోసం కాల్పులు..

  • RCB Name Change: ఆర్‌సీబీ పేరు మార్చే ఆలోచనలో కొత్త యాజమాన్యం.. నయా నేమ్ ఏంటో తెలుసా?

ట్రెండింగ్‌

  • Food Storage Tips : ఫ్రిడ్జ్‌లో మాంసం నిల్వ ఎంతకాలం సేఫ్.?పాడైన మాంసాన్ని గుర్తించే సింపుల్ టిప్స్.!

  • Soft Uttapam Tips : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ ‘ఉతప్పం’.. హోటల్ రుచి రావాలంటే ఈ చిన్న చిట్కాలు పాటించండి.!

  • JIO Offers: జియో నుండి భారీ ఆఫర్.. 3 నెలల రీచార్జ్‌కు 1 నెల ఫ్రీ..!

  • CSK Opening Pair 2026: సీఎస్‌కే ఓపెనింగ్ కాంబో ఫిక్స్.. ఆయుష్‌ మాత్రే అవుట్!

  • Ananya Birla-RCB: ఆర్‌సీబీతో లింక్ లేకపోయినా ట్రెండ్ అవుతోన్న అనన్య బిర్లా.. కారణం శుభ్‌మన్ గిల్‌!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions