ప్రపంచ వ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన సినిమా ఆదిపురుష్ సినిమా థియేటర్లలో సందడి చేస్తుంది.. మెదటి షోతోనే మంచి టాక్ ను అందుకున్న ఈ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది.. అయితే ఈ సినిమా కు వస్తున్నా టాక్ పై ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి అవద్దుల్లేవు.. రామాయణం కథ ఆధారంగా తెరకేక్కిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా అల్లరించిందని ఇప్పుడు చూస్తున్న పబ్లిక్ రెస్పాన్స్ ను చూస్తే తెలుస్తుంది..
ఇది ఇలా ఉండగా.. తెలుగు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఆదిపురుష్ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లలో ఒక సీటును ఆంజనేయస్వామి కోసం రిజర్వ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ డిమాండ్ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.. కొందరు సపోర్ట్ చేస్తుంటే మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.. అయితే వర్మ ఆంజనేయస్వామికి సీటు అంటే దేవుడిని అవమానించినట్టే అని వెల్లడించారు. మన దేశంలోనే ప్రభాస్ సూపర్ స్టార్ అని రామ్ గోపాల్ వర్మ వెల్లడించారు..
తాజాగా ఓ ప్రముఖ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన వర్మ మాట్లాడుతూ.. ఆదిపురుష్ సినిమాకు ఫ్రీ టికెట్లను ఇవ్వడం ద్వారా తమకు కూడా పాపులారిటీ లభిస్తుందని సెలబ్రిటీలు భావిస్తున్నారని వర్మ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆంజనేయ స్వామికి టికెట్ ను రిజర్వ్ చేయడం ఏంటో నాకు అర్థం కాలేదని ఆర్జీవీ చెప్పుకొచ్చారు. ఈ నిర్ణయం దేవుడిని అవమానించినట్టే అవుతుందని ఆర్జీవీ వెల్లడించారు. హనుమంతునికి థియేటర్ ను సంజీవిని పర్వతంలా ఎత్తుకెళ్లే సత్తా ఉందని, కానీ ఇలా సీటు వేరు చేసి చూడటం ఏంటో అర్థం కావడం లేదు.. ఆంజనేయుడికి సీటును కేటాయించాల్సిన అవసరం అయితే లేదని రామ్ గోపాల్ వర్మ చెప్పుకొచ్చారు. రామ్ గోపాల్ వర్మ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొంతమంది వర్మ కామెంట్ల గురించి పాజిటివ్ గా రియాక్ట్ అవుతుండగా మరి కొందరు నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ ఏపీ సీఎం జగన్ ఆధారంగా వ్యూహం సినిమాను తెరకేక్కిస్తున్నారు.. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది..