క్రమంగా ప్రపంచాన్ని చుట్టేసే పనిలో పడిపోయింది కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. ఇప్పటికే భారత్‌లో పలు రాష్ట్రాల్లో ఈ కేసులు వెలుగు చూడగా.. ఇప్పుడు తెలంగాణను కూడా తాకింది. నిన్నటి వరకు భారత్‌లో 37 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఏపీలోనూ ఒక కేసు వెలుగుచూసింది.. ఇప్పుడు తెలంగాణలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదు అయినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.. అయితే, మరో వ్యక్తికి సంబంధించిన పూర్తి రిపోర్ట్ రావాల్సి ఉందని చెబుతున్నారు.. కెన్యా, సోమాలియా నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులకు ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలింది.. మరోవైపు విదేశాల నుంచి హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చి.. ఇక్కడి నుంచి కోల్‌కతా వెళ్లిన మరో వ్యక్తికి కూడా ఒమిక్రాన్‌గా తేలింది.
Read Also: హోటల్‌లో టిప్పు విషయంలో గొడవ.. యువకులపై దాడి..
దీంతో తెలంగాణలో రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి.. హైదరాబాద్‌లోని మెహిదీపట్నం ప్రాంతంలోనే ఈ రెండు కేసులు నమోదు అయ్యాయి.. ఒకరు కెన్యా నుంచి.. మరొకరు సోమాలియా నుంచి వచ్చారని.. ఆ ఇద్దరు వ్యక్తుల కుటుంసభ్యులను కూడా ఐసోలేషన్‌కు తరలించామని వెల్లడించారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు.. కాగా, ఇప్పటి వరకు తెలంగాణలో 6,78,688 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఒమిక్రాన్ వేరియంట్ ప్రారంభం అయిన తర్వాత విదేశాల నుంచి 5396 మంది రాష్ట్రానికి చేరుకున్నారు. కాగా, ఒమిక్రాన్ సోకిన వ్యక్తులు ఆస్పత్రి నుంచి పారిపోయినట్టు ప్రచారం సాగింది.. ఆ ప్రచారాన్ని హెల్త్ డైరెక్టర్ కొట్టిపారేశారు.