కరోనా మహమ్మారి తరిమేందుకు ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది.. భారత్ ఒకేరోజు కోటి డోసుల వ్యాక్సిన్ వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.. తాజాగా, భారత్ వ్యాక్సినేషన్లో కొత్త రికార్డు సృష్టించింది.. ఆగస్టు నెలలో దేశవ్యాప్తంగా ఏకంగా 18 కోట్ల వ్యాక్సిన్లు వేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.. ఆ నెలలో జీ7 దేశాల్లో వేసిన మొత్తం వ్యాక్సిన్ల కంటే కూడా.. భారత్లో వేసిన వ్యాక్సిన్ల సంఖ్యే ఎక్కువని తెలిపింది కేంద్రం.. ఆగస్టు నెలలో భారత్లో 18 కోట్లకు పైగా డోసుల వ్యాక్సిన్ వేస్తే.. జీ7 దేశాలైన కెనడా, బ్రిటన్, అమెరికా, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్ కలిపి ఆ స్థాయిలో కూడా వేయలేకపోయారు.. కెనడాలో అతి తక్కువగా 30 లక్షల డోసులు వేస్తే.. జపాన్లో 4 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేశారు.. కాగా, భారత్లో ఇప్పటి వరకు 66.89 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు వేసినట్టు.. ఇవాళ కోవిడ్ బులెటిన్లో పేర్కొంది కేంద్రం.