కరోనా మహమ్మారి తరిమేందుకు ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది.. భారత్ ఒకేరోజు కోటి డోసుల వ్యాక్సిన్ వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.. తాజాగా, భారత్ వ్యాక్సినేషన్‌లో కొత్త రికార్డు సృష్టించింది.. ఆగస్టు నెలలో దేశవ్యాప్తంగా ఏకంగా 18 కోట్ల వ్యాక్సిన్లు వేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.. ఆ నెలలో జీ7 దేశాల్లో వేసిన మొత్తం వ్యాక్సిన్ల కంటే కూడా.. భారత్‌లో వేసిన వ్యాక్సిన్ల సంఖ్యే ఎక్కువని తెలిపింది కేంద్రం.. ఆగస్టు నెలలో భారత్‌లో…
కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా వ్యాక్సినేషన్‌పై ప్రత్యేకంగా దృష్టిసారించింది కేంద్రం… ఎప్పటికప్పుడు దీనిపై అన్ని రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను అలెర్ట్ చేస్తూ.. కావాల్సిన డోసులు సరఫరా చేస్తోంది.. ఇక, వ్యాక్సినేషన్‌పై తాజాగా ఓ ప్రకటన చేసింది కేంద్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ.. ప్రస్తుతం వ్యాక్సినేషన్ శరవేగంగా సాగుతోందని తెలిపిన కేంద్రం.. ఇప్పటికే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 65,00,99,080 వ్యాక్సిన్ డోసులను పంపించాం.. త్వరలో మరో 1,20,95,700 వ్యాక్సిన్ డోసులు సమకూర్చనున్నట్టు ప్రకటించింది. అయితే,…