ప్రమాదంలో శ్రీశైలం డ్యామ్..! మరమ్మతులు చేస్తారా..?
శ్రీశైలం జలాశయం.. ఉభయ తెలుగు రాష్ట్రాలకు సాగునీరు, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తిలో చాలా కీలకం. జల విద్యుత్ ఉత్పత్తిలో శ్రీశైలం జలాశయందే సింహభాగం. సుమారు 25 లక్షల ఎకరాలకు సాగునీరు, వేలాది గ్రామాలకు తాగునీరు అందిస్తున్న బహుళార్తక సాధక ప్రాజెక్టు శ్రీశైలం. ఇంతటి ప్రాధాన్యత ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు 2009లో ప్రమాదంలో పడింది. కృష్ణ, తుంగభద్ర నదుల నుంచి వచ్చిన 25 లక్షల క్యూసెక్కుల వరద ఉద్ధృతిని తట్టుకొని నిలబడిన మహోన్నతమైన ప్రాజెక్టు శ్రీశైలం జలాశయం.. ఈ ఏడాది ఆగష్టులోగా మరమ్మతులు చేయకుంటే ముప్పు తప్పదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ హెచ్చరించింది. ఈమేరకు ఈనెల మొదటివారంలో జలవనరుల శాఖకు లేఖ కూడా రాసింది. దీంతో అప్రమత్తమైన ఇరిగేషన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ అప్రమత్తమై కీలక సమావేశం నిర్వహించారు.
వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి కొత్త ప్రయోగం..! ఢిల్లీలో క్లౌడ్ సీడింగ్..!
దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం వెంటాడుతూనే ఉంది.. అయితే, కాలుష్యాన్ని కట్టడి చేయడానికి ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుందట.. దీనికోసం క్లౌడ్-సీడింగ్ ట్రయల్స్ నిర్వహిస్తుంది.. ఐదు క్లౌడ్ సీడింగ్ ట్రయల్స్ నిర్వహించనున్నట్టు తెలుస్తుండగా.. ఒక్కొక్కటి వేర్వేరు రోజుల్లో, విమానాలు మేఘాలలోకి రసాయనాలను ఇంజెక్ట్ చేయడానికి ఒకటి నుండి ఒకటిన్నర గంటల పాటు పనిచేస్తాయని ఓ అధికారి తెలిపారు. వాతావరణ పరిస్థితులను బట్టి, బహుశా ఒక వారంలోపు ట్రయల్స్ త్వరితగతిన నిర్వహించవచ్చని పేర్కొన్నారు.. ఐదు ట్రయల్స్‌ను వారంలోపు లేదా ఒకటి లేదా రెండు రోజుల వ్యవధిలో నిర్వహించవచ్చు. షెడ్యూల్ క్లౌడ్ లభ్యతపై ఇది ఆధారపడి ఉంటుందన్నారు. క్లౌడ్-సీడింగ్, లేదా కృత్రిమ వర్షం అనేది నిర్దిష్ట పదార్థాలను మేఘాలలోకి చెదరగొట్టడం ద్వారా వర్షపాతాన్ని ప్రేరేపించే ఒక టెక్నిక్, ఇది ఇతర వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటే చివరికి వర్షానికి దారితీస్తుంది.. అయితే, ఈ ట్రయల్స్ కోసం ప్రదేశాలను ఇంకా ఖరారు చేయలేదని ఓ అధికారి అంటున్నారు.. ప్రణాళిక నుండి అమలు వరకు ప్రయోగానికి నాయకత్వం వహిస్తున్న ఐఐటీ కాన్పూర్, వివిధ శాస్త్రీయ, లాజిస్టికల్ అంశాల ఆధారంగా సైట్‌లను ఎంపిక చేయనున్నారు.. భద్రత మరియు గగనతల పరిమితుల కారణంగా లుటియెన్స్ ఢిల్లీతో సహా నగరంలో లేదా ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ట్రయల్స్ నిర్వహించలేమని.. అందువల్ల, కార్యకలాపాలు ఢిల్లీ శివార్లలో జరుగుతాయి, ఇక్కడ వాతావరణ పరిస్థితులు కూడా కీలక పాత్ర పోషిస్తాయన్నారు.
చర్చలు లేకుండా ఒక ట్విట్టర్ పోస్టుతో యుద్ధ విరమణ ప్రకటిస్తే ఎలా..?
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ముక్తకంఠంతో సైన్యానికి దేశం మొత్తం సంఘీభావం తెలిపిన కేంద్ర ప్రభుత్వం పోరాటం ఆపివేయడం తీవ్రంగా కలిచివేసింది అన్నారు. మన సైనికులు చేసిన పోరాటం ఎటువంటి కార్యరూపం దాల్చాక ముందే.. ఒక్క ట్విట్టర్ తో దేశ సార్వబౌమత్వాన్ని ప్రశ్నార్థకంగా మిగిల్చారు ప్రధాని మోడీ.. ఇందిరాగాంధీలా దాయాది దేశాన్నీ కట్టడి చెయ్యలేక పోయారు అని సెటైర్లు వేశారు. అనాడు చిన్న చిన్న ఘటనలు జరిగితే.. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ను ప్రశ్నించిన మోడీ.. ఇప్పుడు చేసింది ఏంటి అని పొన్నం ప్రభాకర్ అడిగారు. అయితే, కేంద్ర ప్రభుత్వం చర్యలకు దేశ ప్రజలు, కాంగ్రెస్ అధిష్టానం అన్ని రకాలుగా మద్దతు ఇస్తామంటే, ట్విట్టర్ పోస్టుకు స్పందించడం అందరిని కలిచి వేసిందన్నారు మంత్రి పొన్నం. ఇక, యుద్ధ విరమణ ఎందుకు జరిగిందో పార్లమెంట్ వేదికగా చర్చలు జరగాలని రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే కోరుతున్నారు.. చర్చలు లేకుండా ఒక ట్విట్టర్ పోస్టుతో యుద్ధ విరమణ ఎందుకు చేయాల్సి వచ్చిందో ప్రధాని మోడీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక, అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం వాళ్ళు కూడా పాకిస్తాన్ పై చేసే దాడులకు మద్దతిస్తే, విరమణ చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నారు. ఎందుకు పోరాటాన్ని అపారాని దేశ వ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది.. ఒక భారతదేశ పౌరుడిగా నేను ప్రధానినీ ప్రశ్నిస్తున్నాను అని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
పాక్‌తో చర్చలు జరిగితే ఇకపై ఉగ్రవాదం.. పీవోకేపైనే
21వ శతాబ్ధంలో మేక్ ఇన్ ఇండియా తయారు చేసిన ఆయుధాలనే పాకిస్థాన్‌పై ప్రయోగించినట్లు ప్రధాని మోడీ అన్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత సోమవారం తొలిసారి జాతినుద్దేశించి మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా పాకిస్థాన్‌తో చర్చలపై కీలక వ్యాఖ్యల చేశారు. ఇకపై పాకిస్థాన్‌పై చర్చల అంశం వస్తే.. ఉగ్రవాదం, పాకిస్థాన్ ఆక్రమిత కార్మీర్(పీవోకే)పైనే జరుగుతాయని తేల్చి చెప్పారు. ఉగ్రవాదం, చర్చలు ఒకేసారి జరగవన్నారు. ‘‘ఈ రోజు(సోమవారం) బుద్ధ పూర్ణిమ. బుద్ధుడు మనకు శాంతి మార్గాన్ని ప్రబోధించాడు. ఆపరేషన్ సిందూర్ ఒక పేరు కాదు.. ఒక ఆవేదన. ఉగ్రవాదులు చనిపోతే పాక్ ఆర్మీ కన్నీళ్లు పెట్టుకుంది. దీని బట్టి ఉగ్రవాదులను పాక్ ఎలా పెంచి పోషిస్తుందో అర్థమవుతోంది. ఇది యుద్ధాల యుగం కాదు.. అలాగే ఉగ్రవాదుల యుగం కూడా కాదు.. ఉగ్రవాదాన్ని ఉపేక్షించబోమని స్పష్టంగా చెప్పాం’’. అని మోడీ అన్నారు.
రక్తం, నీరు కలిసి ప్రవహించవు..
ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రధాని నరేంద్రమోడీ తొలిసారిగా దేశ ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారు. దేశ మహిళల సిందూరాన్ని దూరం చేస్తే ఏమవుతుందో పాకిస్తాన్‌కి తెలియజేశామని చెప్పారు. అణు బ్లాక్‌మెయిల్‌లకు దిగితే ఇక భారత్ ఎంతమాత్రం సహించదని పాకిస్తాన్‌ని హెచ్చరించారు. పాకిస్తాన్ సైన్యం భారత్ ప్రజల్ని, గుడులను, గురుద్వారాలను టార్గెట్ చేసిందని, మన సైన్యం స్థావరాలను టార్గెట్ చేసిందని ఆయన అన్నారు. పాకిస్తాన్ డ్రోన్లు, మిస్సైళ్లు భారతదేశంపై ప్రయోగించడాన్ని ప్రపంచం చూసిందని, భారత్ తన సొంత ఎయిర్ డిఫెన్స్ సిస్టం ద్వారా వాటిని మనం నాశనం చేశామని చెప్పారు. అణ్వాయుధాలను అడ్డుపెట్టుకొని ఉగ్రవాదానికి పాల్పడతామంటే చూస్తూ ఊరుకోమని చెప్పారు. చనిపోయిన ఉగ్రవాదులను చూసి పాక్ ఆర్మీ ఆఫీసర్లు కన్నీరు పెట్టుకున్నారని, దీని ద్వారా పాక్ ప్రభుత్వం వీరి వెనక ఉన్నదనిన స్పష్టంగా తెలుస్తుందని చెప్పారు. ఉగ్రవాదం ఏ రోజైనా పాకిస్తాన్‌ని నాశనం చేయడం ఖాయమని అన్నారు. ఉగ్రవాదాన్ని మట్టుపెడితేనే పాకిస్తాన్‌కి మనుగడ ఉంటుందని చెప్పారు.
వరల్డ్ క్రికెట్ బ్రాండ్ అంబాసిడర్.. విరాట్ కోహ్లీపై ప్రశంసలు..
కింగ్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో.. అభిమానుల హాట్ బ్రేక్ అయినంత పని అయ్యింది.. ఇదే సమయంలో.. కింగ్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురుస్తోంది.. టెస్ట్ క్రికెట్‌కు ఈ సొగరి ఆటగాడు అందించిన సేవలు, విజయాలను అంతా గుర్తు చేసుకుంటున్నారు.. ఈ సమయంలో.. వరల్డ్ క్రికెట్ బ్రాండ్ అంబాసిడర్.. కోహ్లీ అంటూ భారత మాజీ క్రికెటర్, జాతీయ మాజీ సెలెక్టర్ శరణ్‌దీప్ సింగ్ ప్రశంసించారు.. విరాట్ కోహ్లీని ఒక ఐకాన్‌గా.. ఈ ఫార్మాట్ ఆడిన గొప్ప టెస్ట్ క్రికెటర్లలో ఒకరిగా తాను భావిస్తున్నానని అన్నారు శరణ్‌దీప్ సింగ్.. కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు, 123 మ్యాచ్‌ల్లో 46.85 సగటుతో 9230 పరుగులు చేసిన కింగ్.. ఒక అద్భుతం.. నిజానికి విరాట్ ఒక ఐకాన్. టెస్ట్ క్రికెట్ ఆడిన గొప్ప ఆటగాళ్లలో అతను ఒకడు.. అతను ఎల్లప్పుడూ టెస్ట్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడటం.. వాటిలో గెలవడం ఇష్టపడతాడు. అన్నింటికంటే ముందుగా టెస్ట్ క్రికెట్‌ను ప్రోత్సహించడానికి ఎప్పుడూ ముందు ఉంటాడు.. నాకు, విరాట్ కోహ్లీ వరల్డ్ క్రికెట్ బ్రాండ్ అంబాసిడర్.. ఆటగాళ్లు.. అభిమానుల మధ్య టెస్ట్ క్రికెట్‌ను ప్రోత్సహించడానికి చాలా చేశాడని పేర్కొన్నారు.
బీచ్ ఒడ్డున ఘాటు సొగసులు చూపిస్తున్న స్రవంతి
హాట్ యాంకర్ స్రవంతి నిత్యం సోషల్ మీడియాలో రెచ్చిపోతూనే ఉంటుంది. స్రవంతికి పెళ్లి అయి పిల్లలు ఉన్నా సరే.. ఆమె చూపించే అందాల ఆరబోత అంతా ఇంతా కాదు. అప్పట్లో చిన్న ఛానెల్ లో యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీతో మంచి ఫేమ్ తెచ్చుకుంది. దాని తర్వాత బిగ్ బాస్ లోకి వెళ్లి ఇంకా ఫేమస్ అయింది. అలా వచ్చిన క్రేజ్ తోనే తరచూ ఈవెంట్లు, షోలు చేస్తోంది. ఇక ఎంత బిజీగా ఉంటున్నా సరే.. తన ఘాటు అందాలను మాత్రం చూపించకుండా ఉండలేకపోతోంది. తాజాగా ఆమె బీచ్ ఒడ్డున రెచ్చిపోయింది. బీచ్ ఒడ్డున బ్రా అందాలతో దుమ్ములేపింది. ఘాటు పరువాలతో ఆమె చూపిస్తున్న అందాల రచ్చ మామూలుగా ఉండట్లేదు. ఇందులో ఆమె ఎద అందాతో పాటు నడుము అందాలు కూడా బాగానే చూపించేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నేను ‘సినివెన్నెల’పై కోప్పడ్డాను.. త్రివిక్రమ్ సంచలనం..
దివంగత సిరివెన్నెల సీతారామ శాస్త్రి అంటే ఇండస్ట్రీలో విమర్శలకు తావులేని వ్యక్తి. సినిమాలకు పాటలు రాయడంలో ఆయనకున్నంత పట్టు ఇంకెవరికీ ఉండదేమో. అందుకే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కు సిరివెన్నెలతో ఎనలేని అనుబంధం ఉంది. సిరివెన్నెలపై ఎప్పటికప్పుడు తనకున్న అభిమానాన్ని చాటుకునే త్రివిక్రమ్.. ఓ సారి సిరివెన్నలపై కోప్పడ్డాడంట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపాడు. అప్పట్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ వేడుకపై మాట్లాడుతూ.. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గురించి చాలా ఎమోషనల్ గా మాట్లాడారు. ‘ఆయన రాసిన ఉచ్వాసం కవనం పాట విని నా రెండు చేతులు నా రెండు జేబుల్లో పెట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్నాను. నేనెక్కడికి వెళ్తున్నానో కూడా నాకు తెలియదు’ అంటూ చేసిన కామెంట్లు విపరీతంగా వైరల్ అయ్యాయి. ఆ కామెంట్లపై తాజాగా స్పందించాడు త్రివిక్రమ్. ‘అసలు నేను సిరివెన్నెలను పొగడానిని అంతా అనుకున్నారు. కానీ నేను కోప్పడ్డాను. ఆ విషయం ఎవరికీ అర్థం కాలేదు. పొగడ్తలో చాలా డ్రామా ఉంటుంది. కానీ నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడి ఆయనపై నాకున్న అభిమానాన్ని ఆవేశంగా చెప్పేశాను. అందుకే అతి ఎక్కువ మందికి నచ్చింది. ఆయన మీదున్న అభిమానాన్ని చూపించడానికి నాకు ఆవేశం వచ్చేసింది. ఆయన లాంటి వ్యక్తి తెలుగు ఇండస్ట్రీకి దొరకడు. ఆయన రాసే పాటలు బహుషా ఇంకెవరూ రాయలేరేమో అనిపిస్తుంది. ఆయన ప్రభావం నా మీద చాలా ఎక్కువగా ఉంది’ అంటూ తెలిపాడు త్రివిక్రమ్.