ఐపీఎస్ సునీల్ కుమార్ సంచలన వ్యాఖ్యలు.. కాపులకు సీఎం.. దళితులకు డిప్యూటీ సీఎం..!
సస్పెన్షన్ లో వున్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ పొలిటికల్ కామెంట్స్ మరోసారి వేడిని రాజేశాయి. కాపు, దళితులతో రాజ్యాధికారం ఫార్ములాను ప్రతిపాదించి మరోసారి సంచలనం సృష్టించారు. కాపులకు ముఖ్యమంత్రి పదవి.. దళితులకు డిప్యూటీ సీఎం కోసం ప్రణాళిక బద్ధంగా ఆలోచన చేయాలని సూచించారు సునీల్ కుమార్. ఆ దిశగా కాపులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆదివారం అనకాపల్లి జిల్లా గాంధీ గ్రామంలో జరిగిన అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు సునీల్ కుమార్.. దళితవాడ పంచాయతీ డిమాండ్‌కు కాపు సోదరులు మద్దతిస్తే, తాము వారికి మద్దతిస్తామని పేర్కొన్నారు.. అయితే, అఖిల భారత సర్వీస్ నిబంధనలను సునీల్ కుమార్ ఉల్లంఘించారని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు కేంద్రానికి ఫిర్యాదు చేశారు.. ప్రభుత్వ సర్వీసులో ఉన్న అధికారి ఇలా రాజకీయ, కులపరమైన వ్యాఖ్యలు చేయడం అఖిల భారత సర్వీసుల నియమావళిని ఉల్లంఘిచడమే అంటున్నారు అధికారులు.. ఇక, ఈ వ్యవహారంపై కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) కార్యదర్శికి సోమవారం లేఖ రాశారు రాఘురామ కృష్ణం రాజు.. కులాలను రెచ్చగొట్టేలా ఉన్న ఈ వ్యాఖ్యలు రాజ్యాంగ, సర్వీస్ నిబంధనలకు విరుద్ధమని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. కాగా, ఈ వ్యవహారంతో సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ మరో వివాదంలో చిక్కుకున్నట్టు అయ్యింది..
భార్యా భర్తల మధ్య వివాదం.. భర్తను దారుణంగా హత్య చేసిన బంధువులు..!
దంపతుల మధ్య నెలకొన్ని వివాదాన్ని పరిష్కరించేందుకు వచ్చిన బంధువులే.. భర్త ప్రాణాలు తీసిన ఘటన కలకలం రేపుతోంది.. నంద్యాల అరుంధతీ నగర్ లో పెద్దన్న అనే వ్యక్తిని కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. బంధువులే హత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. నంద్యాల జీజీహెచ్‌లో పెద్దన్న అనే వ్యక్తి సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తున్నారు. అర్ధరాత్రి దాటాక భార్య, భర్తల విషయంలో పెద్దన్న , అతని బంధువుల మధ్య వివాదం తలెత్తింది.రోడ్లపై గుంపులు గుంపులుగా కొట్టుకున్నారు. పెద్దన్నను కత్తులతో పొడిచిన రాజు, అతని బంధువులు హత్య చేశారు. పెద్దన్నకు సపోర్టు గా వచ్చిన ఉప్పరిపేటకు చెందిన సురేష్ పై కూడా రాజు, అతని బంధువులు కత్తులతో దాడి చేశారు. సురేష్ పరిస్థితి విషమంగా ఉండడంతో నంద్యాల జీజీహెచ్‌కు తరలించారు.. అయితే, మొత్తంగా భార్యాభర్తల మధ్య వివాదాల పరిష్కారం కోసం వచ్చిన బంధువులే.. సదరు వ్యక్తిని దారుణంగా హత్య చేయడం స్థానికంగా కలకలం రేపుతోంది..
రాజన్న ఆలయ విస్తరణ పనుల్లో తాత్కాలిక బ్రేక్..!
రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పేరుగాంచిన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్న ఆలయంలో జరుగుతున్న విస్తరణ పనులకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఆలయ విస్తరణలో భాగంగా చెన్నై నుంచి తెప్పించిన భారీ యంత్రంతో ఫైల్ పుట్టింగ్ విధానంలో పనులు ప్రారంభించినప్పటికీ, క్షేత్రస్థాయిలో ప్రతికూల పరిస్థితులు ఎదురవడంతో అధికారులు వీటిని నిలిపివేశారు. ఆలయ దక్షిణ రహదారితో పాటు పరిసర ప్రాంతాల్లో పిల్లర్ల కోసం రంధ్రాలు వేసిన సిబ్బందికి అనుకున్న ఫలితం రాలేదు. కొన్నిచోట్ల కేవలం 5 నుంచి 8 అడుగులు మాత్రమే రంధ్రాలు వేయగలిగారు. మరికొన్ని చోట్ల 5 అడుగులు దాటినా, పిల్లర్ల ఏర్పాటుకు అవసరమైన సరైన బేస్ దొరకకపోవడంతో పనులు ముందుకు సాగలేదు. దీంతో హైదరాబాద్ నుంచి వచ్చిన సాంకేతిక నిపుణుల బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఫైల్ పుట్టింగ్కు బదులుగా ఓపెన్ పుట్టింగ్‌ల ద్వారా పిల్లర్లు వేయాలని అధికారులకు సూచించారు. ఈ సాంకేతిక వివరాలను జిల్లా ఇన్చార్జి కలెక్టర్, వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ (వీటీడీఏ) వైస్ చైర్మన్ గరీమా అగర్వాల్‌కు సాంకేతిక బృందం వివరించింది. తాజా సమాచారం ప్రకారం, అధికారులు త్వరలోనే ఓపెన్ పుట్టింగ్ విధానంలో పిల్లర్ల నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించారు. దీంతోపాటు, పనుల కోసం తెచ్చిన భారీ యంత్రాన్ని తిరిగి చెన్నైకి పంపాలని అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మార్పుల కారణంగా ఆలయ విస్తరణ పనులు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.
ప్రయాణంలో ఉండగా విమానానికి బాంబు బెదిరింపు.. ప్రయాణికుల్లో భయాందోళన..!
అంతర్జాతీయ విమానాలకు బాంబు బెదిరింపులు రావడం ఇటీవల సర్వసాధారణం అవుతున్న నేపథ్యంలో.. తాజాగా కువైట్ నుంచి హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం (Shamshabad International Airport)కు వస్తున్న ఇండిగో విమానానికి (ఫ్లైట్ నెంబర్: 6E 1234) బాంబు బెదిరింపు మేయిల్ రావడం తీవ్ర కలకలం రేపింది. కువైట్ నుండి అర్ధరాత్రి 1:30 గంటలకు బయలుదేరిన ఈ విమానం ఉదయం 8:10 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవాల్సి ఉంది. అయితే, విమానం సిబ్బందికి బాంబు బెదిరింపు మెయిల్ అందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి రిస్క్ తీసుకోకుండా, భద్రతా కారణాల దృష్ట్యా ఈ విమానాన్ని హైదరాబాద్‌కు రాకముందే హుటాహుటిన ముంబై ఎయిర్‌పోర్ట్‌కు దారి మళ్లించారు. కాగా.. విమానం దారి మళ్లింపు జరిగింది కానీ, తాజా సమాచారం ప్రకారం ఇండిగో విమానం ముంబైలో ఇంకా ల్యాండ్ అవ్వలేదు. ఈ పరిణామంతో విమానంలో ఉన్న పైలట్‌తో సహా ప్రయాణికులందరూ భయం గుప్పెట్లో ఉన్నారు. విమానంలో అసలు ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ సంఘటన నేపథ్యంలో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు సిబ్బందితో పాటు ముంబై ఎయిర్‌పోర్టు సిబ్బంది పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు. విమానం సురక్షితంగా ల్యాండైన తర్వాత భద్రతా దళాలు పూర్తి స్థాయిలో తనిఖీలు చేపట్టనున్నాయి.
ఐఏఎస్ శిక్షణా కేంద్రంలో రాజ్‌నాథ్‌సింగ్‌కు వింత అనుభవం.. ఏం జరిగిందంటే..!
ఐఏఎస్.. దేశంలోనే ఎంతో పవర్ఫుల్ ఉద్యోగం. ఐఏఎస్‌కు సలెక్ట్ కావడం మామూలు విషయం కాదు. యూపీఎస్సీ నిర్వహించే టెస్టుల్లో నెగ్గుకు రావాలి. ఎన్నో వడపోతల తర్వాత సలెక్ట్ అవుతారు. ఎంతో మేధావులైతేనే తప్ప ఈ ఉద్యోగం సాధించడం అంత ఈజీ కాదు. ఇప్పుడెందుకు ఇదంతా అంటారా? అయితే ఈ వార్త చదవ్సాలిందే. ఉత్తరాఖండ్‌లోని లాల్ బహుదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (LBSNAA)లో దాదాపు 600 మంది ఐఏఎస్‌లుగా శిక్షణ పొందుతున్నారు. సోమవారం కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అకాడమీ సెంటర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రొఫెసర్ అవతారం ఎత్తారు. ఐఏఎస్ ప్రొబెషనర్లను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ క్రమంలో ఒక వింతైన సంఘటన చోటుచేసుకుంది. ప్రసంగం మధ్యలో ఐఏఎస్ ప్రొబెషనర్లకు గణితం నుంచి ఒక ప్రశ్న వేశారు. చాలా సింఫుల్‌గా తేలికైనే ప్రశ్ననే వేశారు. అందరూ చెప్పేస్తారేమోనని రాజ్‌నాథ్‌సింగ్ భావించారు. కానీ అందరూ తెల్లమొహం వేశారు. ఒక్కసారిగా హాలు అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. దీంతో కేంద్ర మంత్రి అవాక్కయ్యారు. ‘‘ఒక వ్యక్తి దగ్గర చాలా డబ్బు ఉంది. అతను సగం Aకి, మూడింట ఒక వంతు Bకి ఇచ్చాడు. మిగిలిన 100 మొత్తాన్ని Cకి ఇచ్చాడు. మొత్తం ఎంత అని రాజ్‌నాథ్‌సింగ్ అడిగారు. ఒక్కసారిగా హాల్ నిశ్శబద్దంగా మారిపోయింది. దీంతో మరోసారి ప్రశ్నను పునరావృతం చేశారు. అయినా కూడా ఎవరు నుంచి సమాధానం రాలేదు. కొంత సమయం తర్వాత ఒక ప్రొబెషర్ సమాధానం చెప్పడానికి ప్రయత్నించారు. ‘‘రూ.3000’’ అని చెప్పారు. దీంతో రాజ్‌నాథ్‌సింగ్ చిరునవ్వుతో తల అడ్డంగా ఊపారు. తప్పు చెప్పారు.. మళ్లీ ప్రయత్నించండి అని బదులిచ్చారు.
అయ్య బాబోయ్, మినీ వేలానికి రికార్డ్ రిజిస్ట్రేషన్స్.. లిస్టులో స్టార్ ప్లేయర్స్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మినీ వేలానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. డిసెంబర్ 16న అబుదాబిలో జరగనున్న వేలం కోసం ఏకంగా 1,355 మంది ఆటగాళ్లు అధికారికంగా నమోదు చేసుకున్నారు. క్రిక్‌బజ్ ప్రకారం ఆటగాళ్ల జాబితా లిస్ట్ 13 పేజీలు ఉండడం విశేషం. ఓ మినీ వేలానికి రికార్డ్ రిజిస్ట్రేషన్స్ రావడం ఇదే మొదటిసారి. రిజిస్ట్రేషన్ లిస్ట్‌లో 14 దేశాల నుంచి ఆటగాళ్లు ఉన్నారు. ఈ వేలంలో ప్రాంచైజీల మధ్య పోటీ బాగా ఉండనుంది. ఇందుకు కారణం వేలంలో సీనియర్ ఆటగాళ్లు, ప్రతిభావంతులైన కుర్రాళ్లు ఉండడమే. మినీ ఆక్షన్ కోసం భారత, విదేశీ ఆటగాళ్ల జాబితాను ఓసారి చూద్దాం. భారత ఆటగాళ్లలో మయాంక్ అగర్వాల్, కేస్భరత్, రవి బిష్ణోయ్, ఆకాష్ దీప్, దీపక్ హుడా, వెంకటేష్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ మావి, నవదీప్ సైనీ, చేతన్ సకారియా, కుల్దీప్ సేన్, పృథ్వీ షా, రాహుల్ త్రిపాఠి, సందీప్ వారియర్, ఉమేష్ యాదవ్ వంటి ప్రముఖులు ఉన్నారు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా నుంచి అనేక మంది స్టార్ ప్లేయర్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన కామెరాన్ గ్రీన్, మాథ్యూ షార్ట్, స్టీవ్ స్మిత్ వేలంలో పాల్గొనడానికి సిద్ధమయ్యారు. జేమీ స్మిత్, వానిందు హసరంగ, మహీశ పతిరాణా, అన్ఱిజ్ నోర్జ్, కోట్జీ, లియామ్ లివింగ్స్టన్ వంటి స్టార్ క్రికెటర్లు కూడా ఉన్నారు. వివాహం కారణంగా జోష్ ఇంగ్లిస్ అందుబాటులో ఉంటాడో లేదో తెలియదు.
నువ్వు ఇల్లు కట్టుకోవడానికి వేరే వాళ్ల కొంప కూలుస్తావా.. అంటూ పూనమ్ కౌర్ ట్వీట్ ‘ఇది సమంతకేనా?’
హీరోయిన్గా పెద్దగా విజయాలు సాధించకపోయినా, సోషల్ మీడియాలో తన విమర్శాత్మక వ్యాఖ్యలతో తరచూ హాట్‌టాపిక్‌గా మారుతుంది పూనమ్ కౌర్. ఎప్పుడూ ఎవరో ఒకరి మీద ఏదో ఓ ట్వీట్ చేస్తూనే ఉంటుంది. తాజాగా మళ్లీ ఒక ట్వీట్‌తో సంచలనం రేపింది. ఆమె షేర్ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రస్తుతం నెటిజన్ల మధ్య పెద్ద చర్చకు దారి తీసాయి. “నువ్వు ఇల్లు కట్టుకోవడానికి వేరే వాళ్ల కొంప కూలుస్తావా. ఇది బాధాకరం. మళ్లీ ఆమె బాగా శక్తివంతమైనది, చదువుకున్నది, అత్యంత ప్రాధాన్యత గల మనిషి. డబ్బు ఉంటే బలహీనమైన, ఆశపడే పురుషులు చాలా మంది వస్తారు” అని రాసింది. ఈ ట్వీట్లో ఎవరిపేరూ ప్రస్తావించకపోయినా, దాని టైమింగ్, పరోక్ష సూచనల వల్ల పూనమ్ సమంత రూత్ ప్రభుని లక్ష్యంగా చేసుకుని మాట్లాడిందనే అభిప్రాయం నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ 1న సమంత, ది ఫ్యామిలీ మ్యాన్ దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. రాజ్ నిడిమోరుకు ఇది వరకే పెళ్లి జరిగింది, పిల్లలు కూడా ఉన్నారు. సమంతతో సంబంధం మొదలైన తర్వాత తన మొదటి భార్య శ్యామలాదేవికి విడాకులు ఇచ్చారన్న వార్తల మధ్యలో పూనమ్ ఈ ట్వీట్ రావడంతో, సోషల్ మీడియాలో మరోసారి చర్చలు రాజుకున్నాయి. దీంతో కొంత మంది నెటిజన్లు, “సమంత పెళ్లి కోసం మరొక కుటుంబం పాడైందా?”, “శ్యామలాదేవి పరిస్థితి ఏమైంది?”అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ ఘటనపై సమంత లేదా ఆమె టీమ్ స్పందిస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది. పూనమ్ కౌర్ ట్వీట్ చేసిన ప్రతి సారి లాగే, ఈసారి కూడా ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కొత్త చర్చను రేపాయి.
అఖండ 2 సెన్సార్ టాక్.. శివ తాండవమే
హ్యాట్రిక్ సూపర్ హిట్స్ తర్వాత నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘అఖండ-2′. 14 రీల్స్ ప్లస్ బ్యానేర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట అత్యంత భారీ బడ్జెట్ పై ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, టీజర్, సాంగ్స్ సినిమాపై క్రేజ్ ను అమాంతం పెంచాయి. తమన్ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రం సాంగ్స్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. మరో రెండు రోజుల్లో రిలీజ్ కానున్న అఖండ 2 సెన్సార్ కార్యక్రమాలు ముగించుకుని U/A సర్టిఫికెట్ తో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీగా ఉంది. అయితే సెన్సార్ నుండి వస్తున్న టాక్ ఎలా ఉందంటే.. ఫస్టాఫ్ లో బాలయ్య ఎంట్రీ ఓ రేంజ్ లో సెట్ చేశాడట బోయపాటి ఫ్యాన్స్ కు మాత్రమే కాదు ఆడియెన్స్ కు హై ఇస్తుందట. అలాగే అఘోర క్యారక్టర్ ఎంటర్ అయ్యాక సినిమా స్కెల్ మారిపోతుందట. ఇక ఇంటర్వెల్ ఎపిపోడ్ దాదాపు 20 నినిమిషాలు శివ తాండవమే అని సమాచారం. ఇక సెకండాఫ్ ఊహించిన దానికి మించి ఉండబోతుందట. హిమాలయాలలో వచ్చే సీన్స్, మహాకుంభ మేళ ఎపిసోడ్ వేరే లెవల్ లో ఉంటాయని సమాచారం. బాలయ్య యాక్షన్ కు తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ వేరే లెవెల్ లో ఉందని థియేటర్స్ లో గూస్ బమ్స్ గ్యాంరేంటి అని తెలిసింది. ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ ఇచ్చే హై ఫీల్ తో ఆడియెన్స్ కు ఫీస్ట్ ఇవ్వబోతున్నారని టాక్. సో ఈ లెక్కన బాలయ్య బోయ కాంబో మరో సంచలనానికి రెడీ అవుతోంది.
మరో పవర్ఫుల్ రోల్లో తమన్నా..
ఇటీవలి కాలంలో తమన్నా ఎంపిక చేస్తున్న పాత్రలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ఓదెల రైల్వే స్టేషన్ 2లో శక్తివంతమైన పాత్రతో, అలాగే అజయ్ దేవగన్ నటించిన రైడ్ 2లో కీలక క్యారెక్టర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు తాజాగా ఓ బయోపిక్ ద్వారా మరో విభిన్నమైన, భావోద్వేగభరితమైన పాత్రలో కనిపించబోతుంది ఈ మిల్క్ బ్యూటీ. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు వీ. శాంతారాం జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ‘చిత్రపతి వీ. శాంతారాం’. యువ నటుడు సిద్ధాంత్ చతుర్వేది శాంతారాం పాత్రలో కనిపించనున్నాడు. నాటసామ్రాట్ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న అభిజిత్ దేశ్‌పాండే ఈ బయోపిక్‌కి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ బయోపిక్‌లో నటి తమన్నా ముఖ్య పాత్ర పోషించబోతున్నారు. ఈ సినిమాలో ఆమె, శాంతారాం గారి భార్య సాంధ్య పాత్రలో నటించనున్నట్టు సమాచారం. కథ విన్న వెంటనే తమన్నా కూడా ఈ పాత్రను అంగీకరించినట్లు సమాచారం. చిత్రబృందం ప్రస్తుతం షూటింగ్ ప్రారంభానికి సన్నాహాలు చేస్తోంది. వీ. శాంతారాం జీవితం, ఆయన చేసిన ప్రయోగాలు, భారతీయ సినిమాకి అందించిన సేవలను నిజమైన రూపంలో చూపించేందుకు ప్రత్యేకంగా పనిచేస్తున్నట్లు తెలిసింది. ఈ చిత్రం విడుదలైన తర్వాత బాలీవుడ్లో మరో సక్సెస్ఫుల్ బయోపిక్‌గా నిలిచే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమలో ఇప్పటికే చర్చ మొదలైంది. తమన్నా ఈ పాత్రలో ఎలా మెరిసుతుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.