రీతు సాహు కేసులో కొత్త ట్విస్ట్..! సీబీఐ ఎంట్రీతో..
బెంగాల్ విద్యార్థిని రీతు సాహు మృతి కేసు విశాఖ పోలీసులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.. కేవలం పోలీసులకే కాదు, విచారణ కమిటీ అధికారులు, కాలేజీ యాజమాన్యం, హాస్టల్ నిర్వాహకులు పాత్రపై నిగ్గు తేల్చాలి.. మొదట పోలీసులు, తర్వాత హైకోర్టు, ఇప్పుడు సీబీఐకి విద్యార్థిని కేసు అప్పగించాలంటూ ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశం జారీ చేసింది. అది 2023 జూలై 14న హాస్టల్ భవనం పైనుంచి పడి మృతి చెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.. ఏపీ పోలీసుల దర్యాఫ్తు పై నమ్మకం లేక పశ్చిమ బెంగాల్ సీఎం ఆదేశాల మేరకు అక్కడ కేసు నమోదు చేసారు.. తాజాగా సీబీఐకి అప్పగించడంతో కేసు కొలిక్కి ఎప్పుడు వస్తుందో ఎవరిని దోషులుగా తెలుస్తారో సస్పెన్స్ గా మారింది..
వాయుగుండంగా అల్పపీడనం..! భారీ నుంచి అతి భారీ వర్షాలు..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది. అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉంది. వాయుగుండం ఈనెల 27న ఉత్తర కోస్తా తీరాన్ని తాకే ఛాన్స్ ఉంది. దీని ప్రభావంతో రాబోయే ఐదు రోజుల్లో ఏపీలోని వివిధ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈరోజు నుంచి ఈనెల 29వరకు ఆంధ్రప్రదేశ్‌లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఏలూరు, పశ్చిమగోదావరి, గుంటూరు, పల్నాడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. కోస్తా తీర ప్రాంతాల్లో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్ళకూడదని హెచ్చరించారు అధికారులు. ఇవాళ రాష్ట్రంలో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు అధికారులు. రేపు ఉత్తరాంధ్ర, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయన్నారు. మరో రెండ్రోజులు తెలంగాణ జిల్లాలకు భారీ వర్షసూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆదిలాబాద్, కుమురంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీవర్షాలు కురిస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది.
తెలంగాణలో కొత్త మద్యం షాపులు.. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ..
తెలంగాణలోని 2,620 మద్యం షాపుల లైసెన్సుల జారీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రోజు నుంచి వచ్చే నెల (అక్టోబర్) 18వ తేదీ వరకు దరఖాస్తుల ప్రక్రియ జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీలు, గీత కార్మికులకు కేటాయించే దుకాణాలను జిల్లా కలెక్టర్లు గురువారం డ్రా పద్ధతిలో ఎంపిక చేసినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. దుకాణాలల్లో గౌడ్లకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. అక్టోబర్ 23వ తేదీన కొత్త దుకాణాల కేటాయింపునకు సంబంధించి డ్రా ప్రక్రియ నిర్వహిస్తారు. ఈ డ్రాలో దుకాణాల లైసెన్స్ పొందిన వారు మొదటి వాయిదా మొత్తాన్ని అక్టోబర్ 23 నుంచి 24 మధ్య చెల్లించాల్సి ఉంటుంది. లైసెన్స్ ఫీజు మొత్తాన్ని ఆరు విడతలుగా చెల్లించే అవకాశం కల్పించారు. డిసెంబర్ 1 నుంచి నూతన దుకాణాల లైసెన్స్ అమలులోకి వస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కొత్త మద్యం దుకాణాలకు భారీగా దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తుంది. ప్రస్తుత మద్యం దుకాణాల లైసెన్స్‌ల గడువు ఈ ఏడాది నవంబర్‌తో ముగియనుంది. గతంలో ఉన్న 2 లక్షలు ఉన్న దరఖాస్తు ఫారం ధరను ఈసారి 3 లక్షలుగా నిర్ణయించారు. ఈ మొత్తం సొమ్ము నాన్ రిఫండబుల్‌గా ప్రభుత్వం పేర్కొంది. కొత్త లైసెన్స్ కాల పరిమితి 2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు అమల్లో ఉంటుంది. కొత్త మద్యం దుకాణాలకు ఆరు స్లాబుల కింద లైసెన్స్ ఫీజు నిర్ణయంచింది. 5 వేల జనాభా వరకు మద్యం దుకాణం లైసెన్స్ ఫీజు 50 లక్షలుగా నిర్ణయించారు. 5 వేల నుంచి 50 వేలు జనాభా వరకు మద్యం దుకాణం లైసెన్స్ ఫీజు 55 లక్షలు, 50 వేలు నుంచి 1 లక్ష జనాభా వరకు మద్యం దుకాణం లైసెన్స్ ఫీజు 60 లక్షలుగా నిర్ణయించారు. లక్ష నుంచి 5 లక్షల జనాభా వరకు మద్యం దుకాణం లైసెన్స్ ఫీజు 65 లక్షలుగా, 5 లక్షల నుంచి 20 లక్షల జనాభా వరకు మద్యం దుకాణం లైసెన్స్ ఫీజు 85 లక్షలుగా నిర్ణయించారు. 20 లక్షలు కంటే ఎక్కువ జనాభా ఉన్న మద్యం దుకాణం లైసెన్స్ ఫీజు కోటి 10లక్షల లైసెన్స్ ఫీజుగా నిర్ణయించారు. మొత్తానికి.. నోటిఫికేషన్ విడుదల కావటంతో తమ అదృష్టం పరీక్షించుకునేందుకు రెడీ అయ్యారు మద్యం వ్యాపారులు.
సుంకాలపై మరో బాంబ్ పేల్చిన ట్రంప్.. భారత్‌కు భారీ ఎఫెక్ట్
సుంకాలపై ట్రంప్ మరో బాంబ్ పేల్చారు. ఫార్మా దిగుమతులపై 100 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. బ్రాండెడ్, పేటెంట్ ఔషధాల దిగుమతులపై అక్టోబర్ 1, 2025 నుంచి 100 శాతం సుంకం విధిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే అప్‌హోస్టర్డ్ ఫర్నిచర్‌పై 30 శాతం, భారీ ట్రక్కులపై 25 శాతం దిగుమతి సుంకాలు విధించనున్నట్లు వెల్లడించారు. ఫార్మా దిగుమతులపై ఎక్కువగా అమెరికాతో భారతదేశమే వాణిజ్యం చేస్తోంది. దీంతో ఎక్కువగా భారత్‌పైనే ఆ ప్రభావం పడనుంది. ఇప్పటికే భారత్‌పై 50 శాతం సుంకం అమలవుతోంది. కొత్తగా అక్టోబర్ 1 నుంచి ఫార్మా దిగుమతులపైన కూడా 100 శాతం సుంకం విధించడంతో భారత్‌పై తీవ్ర ప్రభావం పడనుందని నిపుణులు భావిస్తున్నారు. అమెరికాతో భారతదేశం అతిపెద్ద ఫార్మాస్యూటికల్ వస్తువుల ఎగుమతి మార్కెట్ ఉంది. 2024లో భారతదేశం నుంచి రూ.7,72,31 కోట్లు ఫార్మా ఎగుమతులు జరిగాయని ఫార్మాస్యూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనే పరిశ్రమ సంస్థ తెలిపింది. ఇక 2025 మొదటి అర్ధభాగంలో రూ.32,505 కోట్ల విలువైన ఫార్మా ఉత్తత్తులు ఎగుమతి చేసినట్లు పేర్కొంది. ఆయా నివేదికల ప్రకారం.. అమెరికాలో ఉపయోగించే జనరిక్ ఔషధాలలో 45 శాతం, బయోసిమిలర్ ఔషధాల్లో 15 శాతం భారతదేశం సరఫరా చేస్తుంది. డాక్టర్ రెడ్డీస్, అరబిందో ఫార్మా, జైడస్ లైఫ్ సైన్సెస్, సన్ ఫార్మా , గ్లాండ్ ఫార్మా వంటి సంస్థలు ఆదాయంలో 30-50 శాతం వరకు అమెరికన్ మార్కెట్ నుంచే సంపాదిస్తున్నట్లు సమాచారం. అమెరికన్లు.. భారతదేశంలో తయారయ్యే తక్కువ ధర జనరిక్లపైనే ఆధారపడతారని తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఫార్మాపై 100 శాతం సుంకం విధించడంతో అమెరికన్లు ఇబ్బంది పడవచ్చు.
సాలీ అంటూ మహిళా ప్రయాణికులపై దాడి.. ఉబెర్ డ్రైవర్ పై కేసు
దేశ రాజధానిలో మహిళలకు రక్షణ కరువైంది. కారులో వెళదామని కారు బుక్ చేసుకుంటే.. డ్రైవర్ దాడికి తెగబడ్డాడు. దీంతో డ్రైవర్ కేసు నమోదు చేశారు పోలీసులు. పూర్త వివరాల్లోకి వెళితే.. నోయిడాలో మహిళా ప్రయాణికులపై దాడికి పాల్పడ్డాడు ఉబెర్ కారు డ్రైవర్. ఆఫీసుకు వెళ్లేందుకు ఐదుగురు అమ్మాయిలు ఉబెర్ బుక్ చేశారు. బొటానికల్ గార్డెన్ మెట్రో స్టేషన్ నుంచి సెక్టార్ 128లోని ఆఫీసుకు వెళ్తుండగా.. అటువైపు ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని డ్రైవర్ బ్రిజేష్ కు చెప్పడంతో .. చుప్ మ్యాప్ ఐసీ దికారై అంటూ.. వారిపై ఆగ్రహంతో ఊగిపోయాడు. తన దగ్గర 13 కార్లు ఉన్నాయన్నాడు. భయపడిన మహిళలు కారు ఆపాలని కోరారు. డ్రైవర్ బ్రిజేష్ వెళ్తున్న వైపు ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని.. మరో దారిలో వెళ్లాలని సూచించారు. దీనికి ఆగ్రహం వ్యక్తం చేసిన బ్రిజేష్.. ‘చుప్.. మ్యాప్ ఇలాగే చేపిస్తుంది.. నా దగ్గర పదమూడు కార్లు ఉన్నాయి..’ అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో బిజ్రేష్ .. సాలీ.. నీలాంటోళ్లు నా దగ్గర పది మంది పనిచేస్తారు అంటూ.. రాడ్డుతో వారిపై దాడికి తెగబడ్డాడు. బయట పడ్డ యువతులు అతడిపై కంప్లైంట్ ఇవ్వడంతో.. అతన్ని వెంటనే అదుపులోకి తీసుకున్నారు.. ఉబెర్ ఫ్లాట్ ఫామ్ నుంచి అతడిని తొలగించారు.
ప్రముఖ దర్శకులు వై వీ ఎస్ చౌదరి మాతృ మూర్తి అస్తమయం
ప్రముఖ దర్శకులు వై వీ ఎస్ చౌదరి మాతృ మూర్తి యలమంచిలి రత్నకుమారి అస్తమయం చెందారు. ఆమె పట్ల తన ప్రేమని గుర్తుచేసుకుంటూ ‘మన పెద్దలు కొంత మందిని చూసి ‘పొట్ట కోస్తే అక్షరం ముక్క రాదు, ఎందుకు పనికొస్తార్రా మీరు?’ అంటూ చదువుకోనివాళ్ళని చూసి మందలిస్తూండేవారు. ఆ సామెతకి అచ్చు గుద్దినట్లు సరిపోయే స్త్రీశక్తే మా అమ్మ ‘యలమంచిలి రత్నకుమారి’.కానీ ఒక లారీడ్రైవర్ అయిన మా నాన్న ‘యలమంచిలి నారాయణరావు’గారి నెలసరి సంపాదనతో తన ముగ్గురు బిడ్డలకు పౌష్టికాహారం, బట్టలు, అద్దె ఇల్లు, విద్య, వైద్యంతో పాటు సినిమాలు చూపించడం నుండీ దేవాలయ దర్శనాలు, సీజనల్ పిండివంటలు, నిలవ పచ్చళ్ళు, పండుగలకు ప్రత్యేక వంటకాలు, సెలబ్రేషన్స్ ఇత్యాది అవసరాలకు తన నోటి మీది లెక్కలతో బడ్జెట్‌ని కేటాయించిన ఆర్ధిక రంగ నిపుణురాలు మా అమ్మ. వీటన్నింటికీ మించి నిత్యం తెల్లవారుజామునే లేస్తూ పనిమనిషి ప్రమేయం లేని జీవితాన్ని తన బిడ్డలకు అందించాలి అనే తపనతో అన్నీ తానై మమ్మల్ని పెంచటానికి తన జీవితాన్ని అంకితం చేసిన ఆదర్శమూర్తి మా అమ్మ. అలా మా అమ్మగారికి తెలిసిన లెక్కలు, ఆవిడ మమ్మల్ని పెంచిన విధానం ఏ చదువూ, ఏ విద్యా నేర్పించలేనిది. అంతేగాకుండా తన యొక్క ఆ విధానాలతో మాలో కూడా ఆ స్ఫూర్తిని నింపిన మహనీయురాలు మా అమ్మ. అటువంటి మా అమ్మ (88 యేళ్ళు) ఈ గురువారం, 25వ సెప్టెంబరు 2025, సాయంత్రం గం8.31ని॥లకు ఈ భువి నుండి సెలవు తీసుకునిఆ దివిలో ఉన్న మా నాన్నని, మా అన్నని కలవడానికి వెళ్ళిపోయారు. ఆవిడ పంచిన రక్తం, ఆవిడ నింపిన లక్షణాలతో ఆమెను స్మరించుకుంటూ భాదతప్త హృదయంతో స్మరించుకున్నారు వై. వి. ఎస్. చౌదరి’
ఈ ఏడాది ఇంకా రూ. 500 కోట్ల టార్గెట్ రీచ్ కానీ టాలీవుడ్.. OG ఆ మార్క్ ను అందుకుంటుందా?
లాస్ట్ ఇయర్ బాక్సాఫీస్ దగ్గర టాలెంట్ చూపిన టాలీవుడ్ ఈ ఏడాది పేలవమైన ప్రదర్శన కనబరుస్తోంది. కల్కి, పుష్ప2తో వెయ్యికోట్లు కొల్లగొట్టి దేవరతో రూ. 500 క్రోర్ మార్క్ క్రాస్ చేసిన టీటౌన్ ఈ ఏడాది థౌజండ్ సంగతి పక్కన పెడితే రూ. 500 క్రోర్ కూడా రీచ్ కాలేకపోయింది. బాలీవుడ్ ఇప్పటికే ఛావాతో పాటు చిన్న సినిమా సైయారాతో రూ. 500 క్రోర్ ప్లస్ కలెక్షన్లను చూసేసింది. కోలీవుడ్ కూడా కూలీతో ఫైవ్ హడ్రెండ్ క్రోర్ టార్గెట్ కంప్లీట్ చేసింది. మాలీవుడ్ వండర్సే క్రియేట్ చేసింది. లూసిఫర్ 2, లోక రూ. 250 ప్లస్ కలెక్షన్లతో ఆల్ టైం హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రాలను చవిచూసింది కేరళ ఇండస్ట్రీ. సౌత్‌లోని ఇతర ఇండస్ట్రీలకు టార్చ్ బేరరైనా టాలీవుడ్ మాత్రం ఈ ఏడాది టాస్క్ కంప్లీట్ చేయడంలో చతికిలపడుతోంది. ఈ ఏడాది టాలీవుడ్లో బోలెడు పాన్ ఇండియా చిత్రాలు వచ్చాయి. కానీ రీజనల్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ సంక్రాంతికి వస్తున్నాంని బీట్ చేయలేకపోయాయి. రూ. 300 కోట్లతో 2025లోనే హయ్యెస్ట్ గ్రాసర్ తెలుగు చిత్రంగా మారిన వెంకీ మూవీని ఈ 9 మంత్స్‌లో కనీసం ఒక్క లోకల్ ఫిల్మ్ టచ్ చేయలేదు. గేమ్ ఛేంజర్, ఢాకూ మహారాజ్, హిట్3, కుబేర, హరి హర వీరమల్లు, కింగ్డమ్ ఇలా ఓ పది పాన్ ఇండియా సినిమాలు వచ్చి బిగ్ నంబర్ కోసం ట్రై చేశాయి కానీ రూ. 200 కోట్లు కూడా రీచ్ కాలేకపోయాయి. టాలీవుడ్‌కు ఇక మిగిలింది మూడు నెలలు మాత్రమే. ఈ త్రీ మంత్స్‌లోనే ఫ్రూవ్ చేసుకోవాల్సి ఉంది. ఇందు కోసం ప్రిపేరవుతున్నాయి కొన్ని ఎంగేజింగ్ ఫిల్మ్స్. ఆల్రెడీ ఓజీ ఫిల్మ్ థియేటర్లలో సందడి షురూ చేసింది. హరి హర వీరమల్లుతో ప్లాప్ చూసిన పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో ఆ లెక్క సరిచేయాలనుకుంటున్నాడు. తొలిరోజు సుమారుగా రూ. 150 కోట్ల ఓపెనింగ్ రాబట్టే అవకాశం ఉన్న OG లాంగ్ రన్ లో రూ. 500 మార్క్ అందుకుంటుందేమో చూడాలి.
నిన్నటితో రూ.100కోట్ల వసూళ్లు.. నేడు ఓటీటీలో స్ట్రీమింగ్
మాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డ్ ను తన పేరుతో రాసుకున్న మోహన్ లాల్ ఇటీవల తుడరమ్‌తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ సినిమా రిలీజ్ అయిన కొద్దీ రోజుల గ్యాప్ లోనే హృదయపూర్వం అనే మరో ఫ్యామిలీ ఓరియెంటెట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓనమ్ కానుకగా హృదయ పూర్వం వరల్డ్ వైడ్ గ రిలీజ్ అయింది. ఎంపురాన్, తుడారమ్ తో డబుల్ హండ్రెడ్ క్రోర్ చిత్రాలను దింపిన లాలట్టన్.. హృదయపూర్వం హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు. ఓనం రోజు అనేక సినిమాలు రిలీజ్ అయిన కూడా హృదయపూర్వం సూపర్ హిట్ టాక్ తో రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కాగా ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కు వచ్చేసింది. ఓటీటీలో మలయాళ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. అందుకే వీకెండ్ వస్తుందంటే.. మాలీవుడ్ మూవీస్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తుంటారు. ఎవ్రీ ఫైడేలాగా ఈ వీకెండ్ కూడా మలయాళ స్టార్ మోహన్ లాల్ నటించిన హృదయ పూర్వం డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చింది. రిలీజ్ కు ఈ ముందే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ కొనుగోలు చేసింది. థియేటర్ సూపర్ హిట్ అయిన ఈ సినిమా ఆగస్టు 28న రిలీజ్ కాగా నాలుగు వారల అనంతరం సెప్టెంబర్ 26 అనగా ఈ రోజు నుండి జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్. కన్నడ, హిందీ వంటి పాన్ ఇండియా భాషల్లో హృదయపూర్వంను స్ట్రీమింగ్ చేస్తోంది హాట్ స్టార్.