ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు.. ఇందులో లాంటి అనుమానం లేదు..!
ఓ వైపు సంక్షేమంతో పాటు.. మరోవైపు అభివృద్ధిపై దృష్టిసారించింది ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం.. ఇప్పటికే పలు సంస్థలు ఏపీకి వస్తుండగా.. మరికొన్ని కంపెనీలు కూడా రాష్ట్రం వైపు చూస్తున్నాయి.. అయితే, ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం.. ఇందులో ఎలాంటి అనుమానాలు లేవు అన్నారు మంత్రి టీజీ భరత్.. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రభుత్వ భూములు ఇష్టానుసారం పంచుతున్నారు అని దుష్ప్రచారం చేస్తున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై మండిపడ్డారు.. ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని.. అందుకే కుట్రతో దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. అయితే, 20 లక్షల ఉద్యోగాలు.. ఐదేళ్లలో ఇస్తాం.. ఇందులో ఎలాంటి అనుమానాలు లేవు అన్నారు.. డిటైల్డ్.. ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంటేనే.. ల్యాండ్ అలాట్ అవుతుంది అని స్పష్టం చేశారు.. నిబంధనల తర్వాత సేల్ డీడ్ ఇస్తారు.. ఇష్టారాజ్యంగా భూ కేటాయింపు జరగదని తెలిపారు.. ఊరికే భూ కేటాయింపులు జరగవు.. ఈ వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తోన్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దు అని సూచించారు మంత్రి టీజీ భరత్..
మెడికల్ కాలేజీలపై హర్షకుమార్ హాట్ కామెంట్లు..
మెడికల్ కాలేజీల వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్‌లో పాలక, ప్రతిపక్షాల మధ్య.. ఆరోపణలు, విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది.. పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీ నిర్వహణకు ప్రభుత్వం సిద్ధం కాగా.. అవి ప్రైవేట్‌పరం చేయొద్దు అంటూ.. ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి.. అయితే, వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేయడం తగదని అంటున్నారు అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్.. వైద్య కళాశాలలను ప్రభుత్వం నడపటానికి ఇబ్బంది ఏమిటి..? అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు పరిస్థితులు ఏమీ బాగోలేదు, మెడికల్ సీట్లు 150 ఉంటే 100 సీట్లు అమ్ముకుని, 50 సీట్లు రిజర్వేషన్లకు ఇస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం పెట్టే సభలలో వారి డప్పు వాళ్లే కొట్టుకుంటున్నారని.. చేసేది తక్కువ బడాయి ఎక్కువ అన్నట్టుంది ఈ ప్రభుత్వం పనితీరు ఉందంటూ విమర్శలు గుప్పించారు. ఇక, ఉచిత ఇసుక పేదలకు అందడం లేదని, కొంత మంది ఎమ్మేల్యేలు, మంత్రులకు ఉచిత ఇసుక వ్యాపారంగా మారిందని ఆరోపించారు హర్షకుమార్. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్.. చేనేత కుటుంబాలకు ఆర్థిక సాయం అందలేదని, 15 నెలల పాలనలో ఒక్క కుటుంబానికి కూడా ఆర్థిక సహాయం అందజేయలేకపోయారని విమర్శించారు.. నారా లోకేష్ గెలవడానికి మంగళగిరిలో చేనేత కార్మికులు ఎక్కువ కావడంవల్ల, చేనేత కుటుంబానికి సంవత్సరానికి 20,000 ఇస్తా అన్నాడు.. కానీ, గెలిచిన తర్వాత చేనేత కుటుంబాలకు అన్యాయం చేశారని విమర్శించారు. వేట విరామ సమయంలో గత సంవత్సర కాలంగా మత్స్యకారుడికి ఆర్థిక సాయం అందిస్తామని ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు.. డ్వాక్రా సంఘాలకు రుణాలు ఊసే లేదని మండిపడ్డారు అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్..
మంత్రి సత్యకుమార్ సవాల్.. అసెంబ్లీలోనైనా.. ఎక్కడైనా సరే..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి సవాల్ విసిరారు ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్.. ఆరోగ్య శాఖ పై చర్చ కు తాను సిద్ధంగా ఉన్నానని, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోనైనా ఇక ఎక్కడైనా చర్చకు సిద్ధమా అని ఛాలెంజ్ చేశారు.. ఇక, రాయచోటి వెనుకబడిన ప్రాంతమన్నారు.. మెరుగైన వైద్యం కోసం కడప, తిరుపతికి వెళ్లాల్సి ఉందన్నారు. రాయచోటి కి 23 కోట్ల 75 లక్షల నిధులతో 50 పడకల క్రిటికల్ కేర్ సెంటర్ ను మంజూరు చేసి నిర్మిస్తున్నామన్నారు. ట్రామ, సీవోపీడీ కేసులకు రాయచోటిలో చికిత్స అందేలా ఈ కేంద్రం ఉపయోగపడుతుందన్నారు. ఇక, రాష్ట్రంలో 24 క్రిటికల్ కేర్ కేంద్రాలను గతంలో కేంద్రం మంజూరు చేసిందన్నారు మంత్రి సత్యకుమార్.. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వకపోవడంతో అవన్నీ మూలనపడ్డాయన్నారు. ఈ ఏడాది డిసెంబర్ లోపు 20 క్రిటికల్ కేర్ కేంద్రాలను పూర్తి చేస్తామన్నామని వెల్లడించారు. క్యాన్సర్ మరణాలను తగ్గించడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్న ఆయన.. కర్నూలులో స్టేట్ క్యాన్సర్ హాస్పిటల్ ను పూర్తి చేశామన్నారు. అతి ఖరీదైన క్యాన్సర్ చికిత్స కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా మన రాష్ట్రంలోనే వైద్య సేవలు అందేలా ఏర్పాట్లు చేశామన్నారు. విలేజ్ హెల్త్ క్లినిక్ లను గాలికి వదిలేసారని వైఎస్ జగన్ అంటున్నారని మండిపడ్డారు.. వైద్యశాఖలో ఎక్కడా ఖాళీలు లేకుండా భర్తీలు చేస్తున్నామన్నారు.. కోటి 43 లక్షల కుటుంబాలకు 23 లక్షల వైద్య బీమా అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్.
వైద్యం, విద్య ప్రభుత్వ రంగంలోనే ఉండాలి.. మెడికల్ కాలేజీలపై క్లారిటీ ఇవ్వండి..!
కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్.. ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు.. ప్రధాని నరేంద్ర మోడీ మాటలు నోటితో నవ్వడం.. నోసటితో ఎగతాళి చేసే విధంగా ఉన్నాయని మండిపడ్డారు. దేశంలో విద్వేషాలు, విభజనలు సృష్టించడం బీజేపీ పని అని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీకి ఊతామి ఇస్తున్నాయని, ప్రజల్ని బ్రష్టు పట్టిస్తున్నాయని విమర్శించారు. బేషరతుగా బీజేపీకి మద్దతు ఇస్తున్నామని మంత్రి నారా లోకేష్ ప్రకటించడమే టీడీపీ ఉనికికే ప్రమాదమని హెచ్చరించారు.. చంద్రబాబు కంటే లోకేష్ ఎక్కువగా మాట్లాడుతున్నాడని అన్నారు రాఘవులు.. ఋషికొండ భవనాలపై కూడా బీవీ రాఘవులు సూటిగా స్పందించారు.. అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన సైన్స్, ఆర్ట్, హెరిటేజ్ మ్యూజియంలా మార్చాలని.. పిల్లల కోసం జూ, బోటానికల్ గార్డెన్ ఏర్పాటుచేయాలని సూచించారు.. కానీ, కళ్యాణ మండపంలా అద్దెకు ఇవ్వాలన్న కూటమి ఆలోచన దారుణమని అన్నారు. మెడికల్ కాలేజీల వివాదంపై స్పందిస్తూ.. అసలు, పీపీపీ, ప్రైవేటీకరణపై మంత్రి నారా లోకేష్ క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైద్యం, విద్య ప్రభుత్వ రంగంలోనే ఉండాలని స్పష్టం చేశారు రాఘవులు.. ల్యాండ్ పూలింగ్ రైతుల అంగీకారంతోనే జరగాలని, 2013 చట్ట ప్రకారం పరిహారం చెల్లించాలన్నారు. రెండో దశ పూలింగ్‌కు సీపీఎం వ్యతిరేకమని పేర్కొన్నారు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు..
కొత్త రైలు మార్గాలపై సీఎం రేవంత్ సమీక్ష.. అధికారులకు కీలక సూచనలు..
పెండింగ్‌లో ఉన్న రైలు ప్రాజెక్టులు, లైన్లను వేగవంతంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అవసరమైన నిధులను సమకూర్చటంతో పాటు భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టుల అలైన్మెంట్లు ఉండాలని దూరాభారం తగ్గించి, అంచనా ఖర్చును కూడా తగ్గించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రయాణికులకు వేగవంతమైన రవాణా సదుపాయాలు అందించటంతో పాటు కొత్తగా వేసే రైలు మార్గాలన్నీ ఆయా ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి ఉపయోగపడేలా ఉండాలన్నారు. ప్రధానంగా పర్యాటక కేంద్రాలు, పారిశ్రామిక అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలన్నారు. విదేశాల తరహాలో రైలు, రోడ్డు, పోర్ట్ కనెక్టివిటీని అధునాతనంగా అభివృద్ధి చేయాలన్నారు. రాష్ట్రంలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, కొత్తగా ప్రతిపాదనలో ఉన్న ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో దక్షిణ మధ్య రైల్వే అధికారులతో పాటు, వివిధ విభాగాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
రాహుల్ గాంధీ సెక్యూరిటీ ప్రోటోకాల్ పాటించడం లేదు: సీఆర్పీఎఫ్..
రాహుల్ గాంధీ ‘‘సెక్యూరిటీ ప్రోటోకాల్’’ పాటించడం లేదని ఆయనకు భద్రత కల్పిస్తున్న రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) చెప్పింది. ఈ మేరకు సీఆర్పీఎఫ్ వీవీఐపీ సెక్యూరిటీ చీఫ్ సునీల్ జాన్ రాహుల్ గాంధీకి లేఖ రాశారు. ఈ లేఖలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఉద్దేశించారు. రాహుల్ గాంధీ తన భద్రతా కవరేజీని ‘‘సీరియస్’’గా తీసుకోవడం లేదని ఆరోపించారు. ఆయన ఎవరీకి సమాచారం ఇవ్వకుండా విదేశాలకు వెళ్తున్నారని చెప్పారు. ఇటలీ (డిసెంబర్ 30 నుండి జనవరి 9), వియత్నాం (మార్చి 12 నుండి 17), దుబాయ్ (ఏప్రిల్ 17 నుండి 23), ఖతార్ (జూన్ 11 నుండి 18), లండన్ (జూన్ 25 నుండి జూలై 6),మలేషియా (సెప్టెంబర్ 4 నుండి 8) వంటి దేశాలకు గాంధీ చేసిన విదేశీ పర్యటనలను CRPF అధికారి ప్రస్తావించారు. CRPF యొక్క ఎల్లో బుక్‌లో పేర్కొన్న ప్రోటోకాల్‌లను రాహుల్ గాంధీ ఉల్లంఘిస్తున్నట్లు లేఖలో ప్రస్తావించారు. అయితే, ఈ విషయంపై రాహుల్ కానీ, ఖర్గే కానీ స్పందించలేదు.
శివాజీనగర్ మెట్రోకు “సెయింట్ మేరీ” పేరు..? మరో వివాదంలో సీఎం సిద్ధరామయ్య..
బెంగళూర్ నగరంలో శివాజీనగర్ మెట్రో స్టేషన్ త్వరలో ప్రారంభానికి సిద్ధమైంది. మెట్రో స్టేషన్‌కు ‘‘సెయింట్ మేరీ’’ పేరు పెట్టాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఒత్తిడి చేస్తుండటం తీవ్ర దుమారానికి కారణమైంది. శివాజీ నగర్ మెట్రో స్టేషన్‌కు సెయింట్ మేరీ పేరు పెట్టడం ఏంటని?? బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మరాఠా ఐకాన్‌ను ఇది అవమానించడమే అని ఆరోపించింది. ఇది శివాజీ మహారాజ్‌ని అవమానించడమే అని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. శివాజీనగర్ లోని సెయింట్ మేరీస్ బసిలికాలో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగించిన సీఎం సిద్ధరామయ్య.. రాబోయే స్టేషన్‌కు సెయింట్ మేరీ పేరు పెట్టాలని కేంద్రానికి సిఫార్సు చేసినట్లు చెప్పారు. ఈ ప్రకటన మహారాష్ట్ర నాయకులతో పాటు కర్ణాటక బీజేపీ నాయకుల నుంచి తీవ్ర విమర్శలకు కారణమైంది.
షోరూంలో వాహనానికి యాక్సిడెంట్ అయితే, ఇన్సూరెన్స్ వస్తుందా..?
కార్ డీలర్షిప్ సాధారణంగా డెలివరీకి ముందే ఇన్సూరెన్స్ ఫార్మాలిటీస్ పూర్తి చేస్తారు. కొనుగోలుదారుడు చెల్లించే ప్రీమియంతోనే ఇది కవర్ అవుతుంది. ఫలితంగా కారు షోరూం నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఇన్సూరెన్స్ పాలసీ యాక్టివ్ గానే ఉంటుంది. ప్రస్తుతం, కొత్త వాహనాలకు జీరో-డిప్రిసియేషన్(జీరో-డిప్) బీమా చేస్తున్నారు. దీని వల్ల చిన్న గీతల దగ్గర నుంచి పెద్ద నష్టాల వరకు అన్నింటిని పూర్తి ఖర్చుతో బీమా సంస్థ తిరిగి చెల్లిస్తుంది. కస్టమర్ చిన్న ప్రాసెసింగ్ లేదా ఫైల్ ఛార్జీలను మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. దీనిని బట్టి చూస్తే, థార్ ప్రమాదంలో నుజ్జునుజ్జు అయిన కారు పాలసీ కిందకు వచ్చే అవకాశం ఉంది. ఇన్సూరెన్స్ కంపెనీ మరమ్మతు ఖర్చులను ఎక్కువగా భరిస్తుంది. ఇన్సూరెన్స్ సాధారణంగా వాహనానికి మాత్రమే ఉంటుంది. థర్డ్ పార్టీ ఆస్తులకు కాదు. అందువల్ల మహీంద్రా షోరూంకు జరిగిన నస్టాన్ని చెల్లించమని కస్టమర్‌ను కోరవచ్చు.
నేపాల్ తాత్కాలిక ప్రధాని రేసులో 54 ఏళ్ల వ్యక్తి.. ఇంతకీ ఎవరు ఈయన?
నిరసనకారుల చర్యలతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన దేశం నేపాల్. ఒక ప్రజాస్వామ్య దేశంలో హింసాత్మక నిరసనలతో ఏకంగా ప్రభుత్వం రద్దు అయిన చరిత్రను నేపాల్ ప్రభుత్వం మూటగట్టుకుంది. తాజాగా నేపాల్ తాత్కాలిక ప్రధానమంత్రి పదవి రేసులో పలువురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. హింసాత్మక నిరసనలకు నాయకత్వం వహిస్తున్న జనరేషన్-జెడ్, దేశ మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కి పేరును మొదట తెరపైకి తెచ్చింది. కానీ ఆమె పేరుపై ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో తాత్కాలిక ప్రధానమంత్రి పదవి రేసులో ఇప్పుడు 54 ఏళ్ల ఇంజినీర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కుల్మాన్ ఘిసింగ్ ముందంజలో ఉన్నారు. పలు నివేదికల ప్రకారం.. నేపాల్‌లో తాత్కాలిక మంత్రివర్గానికి కుల్మాన్ ఘిసింగ్ నాయకత్వం వహించాలని జనరేషన్ Z వర్గాలు ఒక ప్రకటనలో పిలుపునిచ్చాయి. ఈ ప్రభుత్వంలో క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తులతో పాటు జనరేషన్-జెడ్ యువత కూడా ఉండాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.
కంటెంట్ క్రియేటర్లకు పండుగే.. మరింత విస్తరించనున్న మల్టీ లాంగ్వేజ్ ఫీచర్!
ప్రముఖ వీడియో షేరింగ్ ప్లాట్ఫార్మ్ యూట్యూబ్ (YouTube) ఇప్పుడు మల్టీ-లాంగ్వేజ్ ఆడియో ఫీచర్‌ను మరింత విస్తరించినట్లు ప్రకటించింది. దీనితో ఇప్పుడు కోట్ల మంది క్రియేటర్ల కోసం అందుబాటులోకి వస్తోంది. ఈ ఫీచర్ ద్వారా వీడియోలను స్థానిక భాషల్లో అందించడం చాలా సులువు కానుంది. దీనితో కంటెంట్ క్రియేటర్లు తమ కంటెంట్‌ను మరింత ఎక్కువ వ్యూయర్స్ కు చేరవేయగలుగుతారు. ఈ ఫీచర్ తో.. ఒక క్రియేటర్ వారి భాషలో వీడియోను అప్లోడ్ చేస్తే.. మిగితా దేశాలలో వీక్షకులు తమ సొంత భాషలో వీడియోను వీక్షించొచ్చు. మల్టీ-లాంగ్వేజ్ ఆడియో ట్రాక్స్‌ను జతచేసిన క్రియేటర్లు, సాధారణంగా తమ వీడియో వీక్షణలో 25% వరకు ఇతర భాషల్లోనూ వచ్చిన వ్యూస్ ను పొందుతున్నారు. ఈ ఫీచర్ రెండు సంవత్సరాల క్రితం చిన్న స్థాయిలో పైలట్ ప్రోగ్రామ్ గా ప్రారంభమైంది. ఆ సమయంలో వివిధ భాషల్లో డబ్ చేయడానికి దీనిని కొద్దీ మంది క్రియేటర్లకు మాత్రమే అనుమతించారు.
కష్టాన్నే నమ్ముకున్న కుల్దీప్.. ఒక్కమాట అనలేదు! చివరకు బెండు తీశాడు
చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ గత ఆరు నెలలుగా బెంచ్‌కే పరిమితం అయ్యాడు. ప్రతి టీమిండియా స్క్వాడ్‌లోనూ ఉంటున్నా.. తుది జట్టులో మాత్రం అవకాశం రావడం లేదు. 2025 ఆరంభంలో ఇంగ్లండ్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు ఎంపికయ్యాడు. ఐదు టీ20ల్లో ఒక్కసారి కూడా ఛాన్స్ రాలేదు కానీ.. రెండు వన్డేల్లో ఆడాడు. ఆ తర్వాత దుబాయ్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆడిన కుల్దీప్.. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపిక అయ్యాడు. ఇంగ్లీష్ గడ్డపై అతడు ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఆడలేదు. ఆరు నెలలుగా బెంచ్‌కే పరిమితం అయినా కుల్దీప్ యాదవ్ నిరాశ పడలేదు, కుంగిపోలేదు. ఇదే పరిస్థితిలో మరో సీనియర్ ప్లేయర్ అయితే తన అసహనాన్ని ఎక్కడో ఓ చోట కచ్చితంగా వ్యక్తం చేసేవాడే. కానీ కుల్దీప్ అలా చేయకుండా.. కష్టాన్నే నమ్ముకున్నాడు. మరింత ఎక్కువ ప్రాక్టీస్ చేశాడు. ఎట్టకేలకు ఆసియా కప్ 2025 రూపంలో అతడికి అవకాశం వచ్చింది. దుబాయ్ పిచ్ స్పిన్‌కు అనుకూలం కావడంతో అతడికి ఛాన్స్ ఇవ్వక మేనేజ్మెంట్కు తప్పలేదు. వచ్చిన అవకాశాన్ని కుల్దీప్ రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. యూఏఈపై సత్తాచాటాడు. 13 బంతులే సంధించిన కుల్దీప్.. 7 పరుగులే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అద్భుత ప్రదర్శనతో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.
టీమిండియా ఆటగాళ్లపై గౌరవం పోయింది.. బాయ్‌కాట్ ఆసియా కప్!
ఆసియా కప్ 2025 ని భారత్ ఘన విజయంతో ప్రారంభించింది. బుధవారం యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో రికార్డ్ విజయంను అందుకుంది. టీమిండియా తదుపరి మ్యాచ్‌లో దాయాది పాకిస్థాన్‌తో తలపడనుంది. ఈ హైఓల్టేజ్ మ్యాచ్ ఆదివారం దుబాయ్ స్టేడియంలో జరగనుంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇండో-పాక్ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఆసియా కప్‌ను బాయ్‌కాట్ చేయాలని సోషల్ మీడియాలో నెటిజెన్స్, పలువురు ప్రముఖులు పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం నెట్టింట ‘బాయ్‌కాట్ ఆసియా కప్’ ట్రెండ్ అవుతోంది. గత కొన్నేళ్లుగా భారత్-పాకిస్థాన్ మధ్య సంబంధాలు బాగాలేవు. పహల్గాం దాడి, ఆపై ఆపరేషన్ సిందూర్ ఘటనల అనంతరం ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింతగా క్షీణించాయి. పహల్గాం దాడి నేపథ్యంలో సెప్టెంబర్ 14న జరగనున్న భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌ను రద్దు చేయాలని తాజాగా సుప్రీంకోర్టులో ఓ పిల్ దాఖలైంది. అయితే ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించడానికి నిరాకరించింది. అదొక ఆట మాత్రమే, అని, దానిని అలా ఉండనివ్వండి అంటూ వ్యాఖ్యానించింది. ఇక మ్యాచ్‌కు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆసియా కప్‌ను బాయ్‌కాట్ చేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. దాంతో ట్విట్టర్లో ‘బాయ్‌కాట్ ఆసియా కప్’ ట్రెండ్ అవుతోంది.
ఐస్ క్రీమ్ తిని చనిపోయిన నటుడి భార్య..
ఈ మధ్య ఐస్ క్రీమ్ తిన్నా సరే చాలా మంది అది పడక చనిపోతున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో చాలానే జరిగాయి. ఓ నటుడి భార్య కూడా ఇలాగే చనిపోయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపాడు. ఆయన ఎవరో కాదు మలయాళ నటుడు దేవన్. ఆయన తెలుగులో దేశ ముదురు, సాహో, హార్ట్ ఎటాక్, ఏ మాయ చేశావే, మా అన్నయ్య లాంటి సినిమాల్లో విలన్ గా నటించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దేవన్ తన భార్యను తలుచుకుని ఎమోషనల్ అయ్యాడు. ఆయన భార్య చనిపోయి ఇప్పటికి ఆరేళ్లు అవుతోంది. ఈ సందర్భంగా ఆయన తన భార్య ఎలా చనిపోయిందో వివరించారు. నా భార్యకు ఐస్ క్రీమ్ అంటే పడదు. ఆమెకు అలర్జీ. చెన్నలో ఉన్నప్పుడు ఒకసారి ఐస్ క్రీమ్ తింటే తనకు ఊపిరి ఆడలేదు. డాక్టర్ దగ్గరకు వెళ్తే.. జీవితంలో ఐస్ క్రీమ్ తినొద్దని చెప్పాడు. ఆమెకు ఊపిరితిత్తుల్లో అలర్జీ వస్తోందని చెప్పారు. చాలా రోజులు ఆమె ఐస్ క్రీమ్ కు దూరంగా ఉంది. ఓ సారి నా కూతురు లక్ష్మీ మా ఇంటికి వచ్చినప్పుడు తన పిల్లల కోసం ఐస్ క్రీమ్స్ తెచ్చి ఇంట్లో పెట్టింది. అందులో కొన్ని మా ఇంట్లోనే మర్చిపోయి వెళ్లింది. నేను బయట ఉన్నప్పుడు నా భార్య డాక్టర్ చెప్పింది మర్చిపోయి ఐస్ క్రీమ్ తిన్నది. ఊపిరి సమస్య రావడంతో పని వాళ్లు నాకు ఫోన్ చేశారు. నేను వెళ్లేసరికి ఆమె క్రిటికల్ పొజీషన్ లో ఉంది. హాస్పిటల్ కు వెళ్లినా ఆమె బతకలేదు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
ఇండస్ట్రీ హిట్ మూవీని మిస్ చేసుకున్న పవన్ కల్యాణ్..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఏ స్థాయి ఫ్యాన్ బేస్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన కెరీర్ లో హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండానే భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. అలాంటి పవన్ కల్యాణ్ కూడా కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను రిజెక్ట్ చేశాడు. అప్పట్లో పవన్ హీరోగా ఎదుగుతున్న టైమ్ లో ఓ అదిరిపోయే కథ ఆయన వద్దకు వచ్చింది. కానీ ఆయన అనుకోని కారణాలతో ఆ సినిమాను క్యాన్సిల్ చేసుకుంటే మరో హీరో చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఆ సినిమా ఏదో కాదు నువ్వే కావాలి. తరుణ్ హీరోగా వచ్చిన ఈ సినిమా యూత్ ను ఓ ఊపు ఊపేసింది. ఈ సినిమాతోనే తరుణ్ స్టార్ హీరోగా అవతరించాడు. డైరెక్టర్ కె విజయ్ భాస్కర్ ముందుగా పవన్ కల్యాణ్, అమీషా పటేల్ జంటగా నువ్వే కావాలి కథతో షూటింగ్ మొదలు పెట్టారు. కానీ అనుకోని కారణాలతో ఆ మూవీ ఆగిపోయింది. ఆ తర్వాత అదే కథతో తరుణ్ హీరోగా చేశాడు. రిలీజ్ అయ్యాక యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇద్దరు ఫ్రెండ్స్ అనుకోకుండా ప్రేమికులుగా మారడం.. ఇంట్లో వాళ్ల కోసం ప్రేమను త్యాగం చేయాలని అనుకోవడం లాంటివి ఇందులో కట్టి పడేశాయి. మ్యూజిక్ అయితే ఇప్పటికీ యూట్యూబ్ లో మార్మోగిపోతూనే ఉంటుంది. అంత మంచి సినిమాను పవన్ కల్యాణ్ వదులుకున్నారు. ఒకవేళ ఆయన గనక ఈ సినిమా చేసి ఉంటే రికార్డులు బద్దలైపోయేవేమో. కలెక్షన్లు ఊహకు కూడా అందేవి కావేమో.
జూనియర్ ఎన్టీఆర్ ఆ సినిమా చేసి ఉంటే మరోలా ఉండేదేమో..
జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు వరుసగా పెద్ద సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. వార్-2 డిజాస్టర్ అయినా.. ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సినిమాపైనే భారీ అంచనాలు ఉన్నాయి. ఆ తర్వాత దేవర-2 కూడా లైన్ లో ఉంది. ఇలా వరుసగా సినిమాలతో దూసుకుపోతున్న ఎన్టీఆర్ కు.. కంటెంట్ మీద మంచి గ్రిప్ ఉంది. ఎలాంటి కథలు ఆడుతాయో ఎన్టీఆర్ కు బాగా తెలుసు. కొన్ని సార్లు అది ప్లాప్ కూడా అవుతుందనుకోండి. అయితే ఎన్టీఆర్ అప్పట్లో ఓ బ్లాక్ బస్టర్ సినిమాను వదులుకున్నాడు. అదేదో కాదు.. రవితేజ హీరోగా చేసిన భద్ర. బోయపాటి శ్రీను ఈ సినిమాతోనే డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఈ కథను ముందుగా ఎన్టీఆర్ కు వినిపించాడంట బోయపాటి శ్రీను.