అల్లుడి కిడ్నాప్, హత్యకు స్కెచ్ వేసిన అత్త.. ట్విస్ట్ ఏంటంటే..?
గుంటూరు జిల్లా తెనాలికి చెందిన మణికంఠకు నాలుగేళ్ల క్రితం పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన లిఖితతో పెళ్లయింది. వీరికి ఒక కుమార్తె సంతానం.. అయితే, పెళ్లి జరిగినప్పటి నుంచి అత్త విజయలక్ష్మి ప్రవర్తన మణికంఠకు నచ్చలేదు. దీంతో, తన భార్య లిఖితను కూడా పుట్టింటికి దూరంగా ఉండాలని చెప్పారు. లిఖిత కూడా తల్లితో దూరంగా ఉంటూ వచ్చింది. ఈ నేపథ్యంలో తన కూతుర్ని తనకు దూరం చేస్తున్నాడని అల్లుడు మణికంఠపై అత్త విజయలక్ష్మి పగ పెంచుకుంది. అల్లుడు అడ్డు తొలగించుకుంటే కూతురు తన వద్దకు వస్తుందని భావించింది. పక్కా పథకం ప్రకారం నలుగురితో కలిసి తెనాలి చేరుకుంది. రాత్రి సమయంలో అల్లుడు మణికంఠను బలవంతంగా కారులో ఎక్కించుకొని బయలుదేరింది. తెనాలి శివారుకు వచ్చిన తర్వాత మణికంఠపై అందరూ కలిసి కర్రలతో దాడి చేశారు. మణికంఠను బలవంతంగా కారులో ఎక్కించుకోవడం గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. తెనాలి 3 టౌన్ పోలీసులు వెంటనే స్పందించి చేబ్రోలు మండలం కారును శేకూరు వద్ద కారును అడ్డుకున్నారు. మణికంఠను కాపాడి కిడ్నాప్ కు ప్రయత్నించిన అత్త విజయలక్ష్మితో పాటు ఆమెతో సహకరించిన నలుగురిని అరెస్టు చేశారు. ఇక, అల్లుడి కిడ్నాప్, హత్యకు అత్త చెప్పిన కారణం విని పోలీసులు కూడా షాక్ తినాల్సి వచ్చింది..
16 నెలల్లోనే రూ.10లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు.. ఏపీలో పెట్టుబడులకు అనుకూల విధానాలు..
ఆస్ట్రేలియాలో ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతోంది.. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలతో శరవేగంగా ముందుకు సాగుతోందని లోకేష్ పేర్కొన్నారు. హెచ్ఎస్ బీసీ బ్యాంక్ సీఈవో ఆంటోనీ షా నేతృత్వంలోని సీనియర్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్ బృందంతో మంత్రి నారా లోకేష్ సిడ్నీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విజనరీ సీఎం చంద్రబాబునాయుడు పెట్టుబడిదారులకు ఊతమిచ్చే పారిశ్రామిక విధానాలను ప్రకటించారని, దీంతో కేవలం 16 నెలల్లోనే ఏపీకి రూ.10లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని వెల్లడించారు.. రాష్ట్రంలో 1,051 కిలోమీటర్ల సువిశాల తీరప్రాంతంతో పాటు రోడ్లు, అధునాతన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఒకసారి ఆంధ్రప్రదేశ్ తో ఎంవోయూ చేసుకున్నాక ఆ పరిశ్రమను మాదిగా భావించి అవసరమైన అన్ని అనుమతులు, ప్రోత్సహకాలు అందిస్తామని లోకేష్ తెలిపారు. ఆంధ్రపదేశ్ ఆర్థిక రాజధాని విశాఖపట్నం భారీ పెట్టుబడులతో డేటా సిటీగా అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. ఏపీలో నెలకొన్న పరిశ్రమల అనుకూల వాతావరణం, అమలుచేస్తున్న సులభతర వాణిజ్య విధానాలను తెలుసుకునేందుకు వచ్చే నెల 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించే పార్టనర్ షిప్ సమ్మిట్ కు రావాల్సిందిగా పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేశారు మంత్రి నారా లోకేష్..
ఉద్యోగులకు దీపావళి కానుక.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి రోజు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఉద్యోగులు, పింఛనర్లకు దీపావళి కానుకను డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.. ఉద్యోగులకు డీఏ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కూటమి సర్కార.. ఇక, గత ఏడాది అంటే 2024 జనవరి 1వ తేదీ నుంచి డీఏ అలవెన్స్‌ను 3.64 శాతం పెంచుతూ ఆదేశాలిచ్చింది. అంటే, డీఏ పెంపు 2024 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది ఏపీ సర్కార్.. ఈ మేరకు ఏపీ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్‌కుమార్ ఉత్తర్వులు విడుదల చేశారు.. కొత్త డీఏతో పాటు సంబంధిత బకాయిలు కూడా త్వరలో విడుదల చేయనున్నట్టు పేర్కొంది ఏపీ ఆర్థికశాఖ.. కాగా, ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏను ప్రకటించింది. నాలుగు పెండింగ్ డీఏలకు గాను ఒక డీఏను ఇవ్వడానికి ఒప్పుకుంది. నవంబర్ 1 నుంచి ఉద్యోగులకు ఒక డీఏ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం.. దీని కోసం ప్రతి నెలా రూ.160 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్న విషయం విదితమే. అలాగే, మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్ ను 180 రోజులు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. రిటైర్ అయ్యేలోపు ఎప్పుడైనా ఈ చైల్డ్ కేర్ లీవ్ తీసుకునే అవకాశం కల్పించారు. అయితే, మొత్తం ఉద్యోగులకు కలిసి రాష్ట్ర రెవెన్యూలో 99.50 శాతం జీతభత్యాలకు పోతోంది అన్నారు. రూ. 51,200 కోట్లు ఉద్యోగుల జీతాలకు ఖర్చు చేయాల్సి వస్తుంది.. దాపరికం ఏమీ లేదు, ఎవరినీ పట్టించుకోని పరిస్థితి లేదు.. దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడా ఇలాంటి పరిస్థితి లేదన్నారు. ఈ ఏడాది రూ. 51, 400 కోట్లు రాష్ట్ర ఆదాయం అయితే రూ. 51, 200 కోట్లు జీతాల రూపేణా ఇచ్చామన్నారు. మన రాష్ట్రంలో 99 శాతం రెవెన్యూ HR కే వెళ్తుందన్నారు. రాష్ట్రాల రెవెన్యూలో కేరళ 68 శాతం, తెలంగాణ 38 శాతం, తమిళనాడు 42, కర్ణాటక 38 శాతం జీతభత్యాలకు ఇస్తోంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించిన విషయం విదితమే.. కాగా, ఇప్పుడు 2024 జనవరి 1వ తేదీ నుంచి డీఏ అలవెన్స్‌ను 3.64 శాతం పెంచుతూ ఆదేశాలిచ్చింది ప్రభుత్వం.. డీఏ పెంపు 2024 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది ఏపీ సర్కార్..
మీ కూతుర్లు హిందూయేతరులతో వెళ్తే కాళ్లు విరగ్గొట్టండి..
బీజేపీ మాజీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. వివరాల్లోకి వెళితే, ఈ నెల ప్రారంభంలో భోపాల్‌లో జరిగిన ఒక ధార్మిక కార్యక్రమంలో ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. తల్లిదండ్రుల కోరికలకు వ్యతిరేకంగా తమ కుమార్తెలు ప్రవర్తిస్తే వారిని శారీరకంగా శిక్షించాలని సూచించారు. అలాగే, మీ కుమార్తె మాట వినకుండా హిందూయేతరుల ఇంటికి వెళితే, ఆమె కాళ్లు విరగ్గొట్టడానికి ఏ మాత్రం వెనుకాడకండి అని పేర్కొనింది. విలువలను పాటించనివారు, తల్లిదండ్రుల మాట విననివారు శిక్షార్హులు అని చెప్పుకొచ్చింది. మీ పిల్లల మంచి భవిష్యత్తు కోసం వారిని కొట్టాల్సి వస్తే వెనకడుగు వేయకండి అని తెలిపింది. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే, మాజీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఈ దేశంలో బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొడుతుందని కాంగ్రెస్ ప్రతినిధి భూపేంద్ర గుప్తా ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లో కేవలం ఏడు మత మార్పిడుల కేసుల్లోనే శిక్ష పడితే, ఇంత గోల, విద్వేషం ఎందుకు వ్యాప్తి చేస్తున్నారు? అని ప్రశ్నించారు. దేశంలోని ప్రజలను మత ప్రాతిపాదికన బీజేపీ విభజిస్తుంది అని పేర్కొన్నారు.
కానిస్టేబుల్ను హత్య చేసిన నిందితుడు.. చికిత్స పొందుతూ రియాజ్ మృతి..
నిజామాబాద్ లో సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రియాజ్ చికిత్స పొందుతూ మరణించాడు. అయితే, రియాజ్ మృతిపై విభిన్న కథనాలు వినిపిస్తుండటంతో ఈ ఘటన మరింత చర్చనీయాంశంగా మారింది. అయితే, ఆదివారం నాడు పోలీసులు నిందితుడు రియాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు, ఓ యువకుడితో జరిగిన ఘర్షణలో గాయపడిన రియాజ్‌ను చికిత్స కోసం నిజామాబాద్‌లోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రియాజ్ చనిపోయినట్లు పేర్కొన్నారు. అయితే, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, చికిత్స పొందుతున్న రియాజ్ బాత్రూంకు వెళ్లే నెపంతో లేచాడు. ఈ సమయంలో సెక్యూరిటీగా ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్ల దగ్గర నుంచి తుపాకీ లాక్కొని వారిపైనే దాడికి పాల్పడ్డాడు. అంతేకాకుండా, పోలీసులపై తుపాకీ ఎక్కు పెట్టి ఫైరింగ్ చేసేందుకు ప్రయత్నం చేశాడు. రియాజ్ దాడి చేయడంతో ఒక కానిస్టేబుల్ గాయ పడ్డాడు. ఇక, పరిస్థితి విషమించడంతో సెక్యూరిటీగా ఉన్న మరొ కానిస్టేబుల్ ఆత్మరక్షణ కోసం ఫైరింగ్ చేశాడు. కాల్పులు జరపడంతో రియాజ్ తప్పించుకుని పారిపోతుండటంతో పోలీసులు కాల్పులు జరపినట్లు పేర్కొన్నారు. ఈ ఘటన జీజీహెచ్‌లో కలకలం సృష్టించింది. అలాగే, రియాజ్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.
తమిళనాడును ముంచెత్తిన భారీ వర్షాలు.. విమాన రాకపోకలకు అంతరాయం
తమిళనాడు వ్యాప్తంగా విస్తరంగా వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లు జలమయం అయ్యాయి. చెన్నై ఎయిర్‌పోర్టులోకి వరద నీళ్లు చేరడంతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దక్షిణ చెన్నైలోని అనేక ప్రాంతాల్లో మోకాలి లోతు నీళ్లు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఓ వైపు దీపావళి.. ఇంకోవైపు భారీ వర్షాలు. వేడుకలపై వర్షం ప్రభావం చూపిస్తోంది. అంతేకాకుండా దీపావళి వ్యాపారంపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇదిలా ఉంటే అక్టోబర్ 21న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం నగరంలోని వేలచేరి, మేదవాక్కం, పల్లికరణై, ఈసీఆర్ నీలంకరైతో సహా శివారు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి.
143 మందితో జాబితా విడుదల చేసిన ఆర్జేడీ
బీహార్‌లో ఎన్నికల సమరం నడుస్తోంది. రెండు విడతల్లో జరుగుతున్న పోలింగ్‌కి తొలి విడత నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. రెండో దశ ఎన్నికల ప్రక్రియకు నామినేషన్లు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో 143 మందితో కూడిన అభ్యర్థులను జాబితాను ఆర్జేడీ విడుదల చేసింది. మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ వైశాలి జిల్లాలోని రఘోపూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఇప్పటికే తేజస్వి యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. 2020 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఆర్జేడీ ఒక సీటు తక్కువగా పోటీ చేస్తోంది. 2020లో 144 సీట్లలో పోటీ చేయగా.. 2025లో 143 సీట్లలోనే పోటీ చేస్తోంది. మాధేపుర నుంచి చంద్ర శేఖర్, మోకామా నుంచి వీణా దేవి (సురభన్ భార్య), ఝా నుంచి ఉదయ్ నారాయణ్ చౌదరి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా సోమవారం మూడో జాబితాను విడుదల చేసింది. ఆరుగురు సభ్యులతో కూడిన జాబితాను హస్తం పార్టీ ప్రకటించింది. రెండు విడతల్లో జరిగే ఎన్నికల్లో మొత్తం ఇప్పటి వరకు 59 మంది అభ్యర్థులను కాంగ్రెస్ వెల్లడించింది. తొలి జాబితాలో 48 మంది, రెండో జాబితాలో ఐదుగురు, తాజాగా ఆరుగురు అభ్యర్థుల లిస్టును విడుదల చేసింది. ఇలా మొత్తం 59 మంది అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది.
టపాకాయలు కాల్చడంలో గాయాలయ్యాయా..? ఇంటి వద్దే సురక్షిత చికిత్స ఇలా చేసుకోండి.!
దీపావళి పండుగ సంతోషకరమైన వాతావరణాన్ని, కాంతులను తీసుకువస్తుంది. అయితే బాణాసంచా కాల్చే ఉత్సాహం వల్ల లేదా దీపాల కారణంగా చిన్న నిప్పురవ్వలు, పేలుడు క్రాకర్ల వలన చర్మంపై కాలిన గాయాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ ప్రమాదాలు పండుగ ఆనందాన్ని బాధగా మార్చవచ్చు. అయితే చాలా వరకు చిన్న కాలిన గాయాలకు సరైన చికిత్స, సంరక్షణతో సులభంగా నయం చేయవచ్చు. సరైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మచ్చలు పడకుండా పండుగను ఆస్వాదించవచ్చు. ముఖ్యంగా కాలిన గాయం అయినప్పుడు తక్షణ చర్య తీసుకోవడం చాలా ముఖ్యం. మొదటగా చేయవలసింది కాలిన ప్రాంతాన్ని వెంటనే చల్లబరచడం. ఇందుకోసం కాస్త నీటిని 5 నుండి 10 నిమిషాల పాటు గాయంపై నిరంతరాయంగా పడేలా చేయాలి. ఈ చర్య ఆ ప్రాంతాన్ని చల్లబరచడం ద్వారా వాపును తగ్గిస్తుంది. ఇంకా చర్మాన్ని రక్షిస్తుంది. అయితే ఐస్‌ను నేరుగా కాలిన గాయంపై వాడకూడదు. ఎందుకంటే ఇది రక్త ప్రవాహాన్ని పరిమితం చేసి గాయాన్ని మరింత తీవ్రం చేస్తుంది. చల్లబరచిన తర్వాత ఆ ప్రాంతాన్ని శుభ్రమైన గుడ్డతో మెల్లగా తుడవాలి. బొబ్బలు కనిపిస్తే, వాటిని వదులుగా ఉండే స్టెరైల్ గుడ్డతో కప్పాలి. చాలా మంది ఇళ్లలో వాడే పాత చిట్కాలైన టూత్‌పేస్ట్, నెయ్యి లేదా వెన్న వంటివి ఉపశమనం ఇచ్చినట్లు అనిపించినా.. వాటిని ఉపయోగించకపోవడం మంచిది. ఎందుకంటే, ఇవి గాయంపై వేడిని ఉంచి ఇన్‌ఫెక్షన్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. అందువల్ల సరైన చికిత్స పద్ధతులను మాత్రమే అనుసరించాలి.
బ్యాటర్లను కాపాడటానికి బౌలర్లను బలి చేస్తారా..?
ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి వన్డేలో భారత్ ఘోర పరాజయం పాలైంది. 7 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టు చేతిలో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ టీమిండియా మేనేజ్మెంట్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాడు. పెర్త్ వన్డేలో భారత జట్టు కూర్పు సరిగ్గా లేదని.. బ్యాటింగ్ డెప్త్ కోసం బౌలింగ్ విభాగాన్ని నీరు గార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ విషయంలో మేనేజ్‌మెంట్ తీరును అశూ తప్పుబట్టాడు. వాళ్లు కేవలం ఇద్దరు స్పిన్నర్లతోనే ఎందుకు ఆడారో నాకు అర్థం కావడం లేదు.. పేస్ ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డిని ఆడించింది బ్యాటింగ్‌లో డెప్త్ కోసమే.. ఇక స్పిన్ ఆల్‌రౌండర్లు సుందర్, అక్షర్ కూడా బ్యాటింగ్ చేస్తారు కాబట్టి నితీశ్‌ను వారికి జతచేశారు అని పేర్కొన్నారు. ఇక, అసలు మీరెందుకు ( టీమిండియా మేనేజ్‌మెంట్) బౌలింగ్‌పై దృష్టి పెట్టడం లేదు బాస్ అని అశ్విన్ ప్రశ్నించారు. ఇలాంటి పెద్ద మైదానాల్లో కాకపోతే కుల్దీప్ యాదవ్ ఇంకెక్కడ స్వేచ్ఛగా బౌలింగ్ చేయగలడు?.. ఈ పిచ్‌పై బంతిని తిప్పుతూ అతడు బౌన్స్ కూడా రాబట్టగలడు అని పేర్కొన్నారు. ఏదైనా అంటే.. బ్యాటింగ్ డెప్త్ అని మాట్లాడుంటారు.. బ్యాటింగ్ ఆర్డర్ రాణించాలంటే.. బ్యాటర్లే పూర్తి బాధ్యత తీసుకోవాలి.. పరుగులు రాబట్టడం వాళ్ల పని.. కానీ, అదనపు బ్యాటర్ కోసం ఆల్‌రౌండర్లను ఆడించి బ్యాటర్ల పని మరింత సులువు చేయాల్సిన అవసరం ఏముంది? అని క్వశ్చన్ చేశారు. జట్టులో ఉన్న అత్యుత్తమ బౌలర్లను పక్కన పెట్టడం ఎంత వరకు సమంజసం? అని రవిచంద్రన్ అశ్విన్ అడిగారు.
పాపం రష్మిక.. ఏం చెబుతుందో ఏమో?
రష్మిక హీరోయిన్‌గా నటించిన హిందీ ‘దామా’ మూవీ అక్టోబర్ 21వ తేదీన అంటే ఈ మంగళవారం నాడు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వాస్తవానికి, మంగళవారం నాడు సినిమాలు రిలీజ్ అవ్వవు. కానీ, దీపావళి సందర్భంగా ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. వరుసగా హారర్ సినిమాలతో హిట్టు కొడుతున్న హిందీ ‘మేడాక్’ ఫిలిమ్స్ సంస్థ ఈ సినిమాని నిర్మించింది. ఆదిత్య డైరెక్ట్ చేసిన ఈ సినిమాను దినేష్ విజన్, అమర్ కౌశిక్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాలో రష్మికతో పాటు ఆయుష్మాన్ ఖురానా, నవాజుద్దీన్ సిద్ధికి, హరీష్ రావల్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు. డిసెంబర్ 2024లో ప్రారంభమైన ఈ సినిమాని ఏడాదిలోపే పూర్తి చేసి రిలీజ్ చేస్తున్నారు. అయితే, ఈ సినిమా ప్రమోషన్స్‌లో రష్మిక యాక్టివ్‌గా ఉంది. కానీ, ఆమెకు ఎంగేజ్‌మెంట్ గురించిన ప్రశ్నలు ఎదుర్కాలేదు. కానీ, ఆమె నటించిన మరో సినిమా ‘గర్ల్ ఫ్రెండ్’ వచ్చే నెల 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాని రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేయగా, లేడీ ఓరియంటెడ్ సినిమాగా రూపొందింది. ఈ సినిమా ప్రమోషన్స్ కచ్చితంగా తెలుగులో చేయాల్సిందే. తెలుగు మీడియా గురించి తెలిసిందే కదా, ఒకవేళ రష్మిక కనుక తెలుగు మీడియా ముందుకు వస్తే, ఖచ్చితంగా ఆమెను సీక్రెట్ ఎంగేజ్‌మెంట్ గురించి ప్రశ్నిస్తారు. ఈ విషయం మీద రష్మిక ఎలా స్పందిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
పవర్ స్టార్ కోసం రెండు స్క్రిప్ట్ లు రెడీ చేస్తున్న దిల్ రాజు టీమ్
OG సూపర్ హిట్ కావడంతో వన్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఆ సినిమా ఇచ్చిన కాన్ఫిడెంట్ తో మరిన్ని సినిమాలు చేసేందుకు రెడీ అయ్యారు పవర్ స్టార్. ఇప్పటికే నలుగురు నిర్మాతలు అడ్వాన్స్ లు కూడా ఇచ్చారు. వీరిలో ప్రస్తుతం టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజుతో సినిమా చేసేందుకు పవర్ స్టార్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచేసినట్టు సమాచారం. గతంలో వీరి కాంబోలో వకీల్ సాబ్ వచ్చిన సంగతి తెలిసిందే. పవన్ డేట్స్ దొరకడంతో ఇమ్మిడియట్ గా సినిమా చేసేందుకు కథల వేటలో ఉన్నాడు దిల్ రాజు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం రెండు పవర్ ఫుల్ కథలను రెడీ చేస్తున్నాడు దిల్ రాజు. అందులో ఒక కథలో కాలేజీలో పాఠాలు చెప్పే ప్రొఫెసర్ గా కనిపించబోతున్నాడట. మరొటి ఆవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమా అని తెలుస్తోంది. రెండు కథలు లైన్స్ ను పవర్ స్టార్ కు వినిపించేందుకు టీమ్ రెడీ అవుతోంది. కథ ఓకే అయితే ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత పవర్ స్టార్ నటించబోయే సినిమా ఇదే అవుతుంది. ఈ సినిమాను తమ ఆస్థాన దర్శకుడు, SVC లక్కీ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరక్షన్ లో చేయించాలనేది దిల్ రాజు ప్లాన్. అనిల్ రావిపూడి ప్రస్తుతం చేస్తున్న మన శంకర వరప్రసాద్ గారు షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమా తర్వాత పవర్ స్టార్ సినిమా ఉండే ఛాన్స్ ఉంది. మరి దిల్ రాజు టీమ్ రెడీ చేసే కథకు పవర్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో.