Padma Awards 2024 : మెగాస్టార్ చిరంజీవి, వెంకయ్య నాయుడికి పద్మ విభూషణ్.. పూర్తి జాబితా ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గణతంత్ర దినోత్సవం వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి.. ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వం దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మ అవార్డులను ప్రకటించింది.. ఈ జాబితాలో వివిధ రంగాలకు చెందిన 132 మంది ప్రముఖులు పద్మ అవార్డుకు ఎంపికయ్యారు.. ఈ లిస్ట్ లోని 110 మందికి పద్మ శ్రీ అవార్డులు దక్కగా, 5 మందికి పద్మ విభూషణ్ అవార్డు దక్కింది.. సినీ హీరో చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్లు ఉన్నాయి. తమిళనాడు నుంచి వైజయంతి మాల బాలికి కూడా పద్మవిభూషణ్ దక్కింది. మరో 17 మందిని పద్మభూషణ్ అవార్డులు వరించాయి. ఇక తమిళనాడుకు చెందిన స్వర్గీయ నటుడు విజయ్ కాంత్ కు పద్మభూషణ్ అవార్డు దక్కింది.. ఎవరెవరికి ఏ అవార్డులు దక్కాయో మొత్తం లిస్ట్ ను ఇప్పుడు ఒకసారి చూద్దాం..
పద్మవిభూషణ్ అవార్డులు 2024…
Also Read
కొణిదెల చిరంజీవి (కళారంగం)- ఆంధ్రప్రదేశ్.
వెంకయ్యనాయుడు ( పబ్లిక్ ఎఫైర్స్)- ఆంధ్రప్రదేశ్.
పద్మ సుబ్రమణ్యం ( కళారంగం)- తమిళనాడు.
వైజయంతి మాల బాలి (కళారంగం)- తమిళనాడు.
బిందేశ్వర్ పాఠక్ ( సామాజిక సేవ)- బీహార్.
పద్మభూషణ్ అవార్డులు 2024..
అశ్విని బాలచందర్ మోహత- మహారాష్ట్ర
సత్యబ్రత ముఖర్జీ – పశ్చిమ బెంగాల్
రామ్ నాయక్ – మహారాష్ట్ర
తేజస్ మధుసుదన్ పటేల్ – గుజరాత్
ఉషా ఉత్తప్ – బెంగాల్
విజయకాంత్ – తమిళనాడు(కళలు)
కుందన్ వ్యాస్ – మహారాష్ట్ర
అంబదాస్ రాజ్ దత్త్ – మహారాష్ట్ర
రాజగోపాల్ – కేరళ
రిన్ పోచే – లద్దాఖ్
ప్యారీలాల్ శర్మ – మహారాష్ట్ర
ప్రసాద్ ఠాకూర్ – బీహార్
ఫాతిమా బీవి – కేరళ
హర్ ముస్జీ ఎన్ కామా – మహారాష్ట్ర
మిథున్ చక్రబొర్తి – పశ్చిమబెంగాల్
సీతారామ్ జిందాల్ – కర్నాటక
యంగ్ లియూ – తైవాన్(వ్యాపార రంగం)
పద్మ శ్రీ అవార్డులు 2024..
ఏపీకి చెందిన హరికథ కళాకారిణి ఉమామహేశ్వరికి పద్మశ్రీ.
తెలంగాణకు చెందిన కేతావత్ సోమ్ లాల్(సాహిత్యం)కు పద్మ శ్రీ అవార్డు దక్కింది,
కళల విభాగంలో ఆనందా చారి (తెలంగాణ)కి పద్మ శ్రీ అవార్డు దక్కింది.
నారాయణపేట జిల్లా దామరగిద్ద వాసి దాసరి కొండప్పకు(బుర్ర వీణ వాయిద్యకారుడు) పద్మశ్రీ.
తెలంగాణకు చెందిన యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్యకు పద్మశ్రీ.
సాహిత్యం విభాగంలో నల్గొండ జిల్లాకు చెందిన కూరెళ్ల విఠలాచార్యకు పద్మ శ్రీ దక్కింది.
చార్మీ ముర్ము(జార్ఖండ్) సెరైకెలా ఖర్సావాన్ ప్రాంతానికి చెందిన గిరిజన పర్యావరణవేత్త. 30 లక్షల మొక్కలను నాటేందుకు కృషి చేశారు.
గుర్విందర్ సింగ్(హర్యానా) నిరాశ్రయులైన, నిరుపేదలు, మహిళలు, అనాథలు, దివ్యాంగుల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారు. బాల్ గోపాల్ దామ్ పేరుతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.
సత్యనారాయణ బేలేరి(కేరళ) కాసరగోడ్‌కు చెందిన రైతు. సంప్రదాయ వరి రకాలను సంరక్షించటంలో పేరు గాంచారు.
సంగంకిమా(పశ్చిమ బెంగాల్) ఐజ్వాల్‌కు చెందిన సామాజిక కార్యకర్తగా అవార్డుకు ఎంపిక అయ్యారు..
పార్వతి బారువా(అస్సాం) భారతదేశపు తొలి మహిళా ఏనుగు మావిటి. జంతు సంరక్షణలో చేసిన కృష్టికి అవార్డును అందుకున్నారు.
జగేశ్వర్ యాదవ్(ఛత్తీస్ ఘడ్) అట్టడుగున ఉన్న బిర్హోర్, పహాడీ కోర్వా గిరిజన తెగ ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేశారు. ఆయనకు అవార్డు దక్కింది..
కె చెల్లమ్మాళ్- దక్షిణ అండమాన్‌కు చెందిన ఆర్గానిక్ రైతు. సేంద్రియ వ్యవసాయాన్ని విజయవంతంగా అభివృద్ధి చేశారు. 5 దశాబాద్ధాలుగా సేంద్రియ వ్యవసాయ రంగంలో కృషి చేస్తున్నారు.
కళల విభాగంలో చూస్తే…. జానకీలాల్ (రాజస్థాన్), గోపీనాథ్ స్వైన్ (ఒడిశా),
స్మృతి రేఖ ఛక్మా – త్రిపుర,
ఓంప్రకాశ్ శర్మ – మధ్యప్రదేశ్,
భద్రప్పన్ – తమిళనాడు,
శాంతిదేవీ పాసవాన్,
శివన్ పాసవాన్ – బిహార్,
అశోక్ కుమార్ బిశ్వాస్ – బిహార్,
బాబూ రామ్‌యాదవ్ – ఉత్తర్‌ప్రదేశ్,
నేపాల్ చంద్ర సూత్రధార్ – (పశ్చిమ బెంగాల్),
రతన్ కహార్ – పశ్చిమ బెంగాల్,
నారాయణన్ – కేరళ,
భాగబత్ పదాన్ – ఒడిశా,
జోర్డాన్ లేప్చా – సిక్కిం,
మచిహన్ సాసా – మణిపుర్,
బాలకృష్ణన్ సాధనమ్ పుథియ వీతిల్ – కేరళ,
వీరందరికి పద్మ శ్రీ అవార్డులు వరించాయి.
క్రీడా రంగంలో.. మహారాష్ట్రకు చెందిన ఉదయ్ విశ్వనాథ్ దేశ్‌పాండేకు పద్మ శ్రీ అవార్డను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.
వైద్య విభాగంలో…. హేమచంద్ మాంఝీ – ఛత్తీస్‌గఢ్,
ప్రేమ ధన్‌రాజ్ – కర్ణాటక, యజ్దీ మాణెక్ షా( గుజరాత్)కు అవార్డు దక్కింది.
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎక్కువ మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి.. అలా మొత్తం 110 మందికి పద్మ శ్రీ అవార్డులు దక్కాయి..
తాజావార్తలు
-
Ram Charan: ఈ సినిమాలో ఆయన నటన చూసి నాకు కంట్లో నీళ్లు వచ్చాయి: రామ్‌చరణ్
-
Vizag Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్..
-
Delhi High Court: ఊపిరాడక చనిపోవాల్సి వస్తుంది.. ‘దేవుడే కాపాడాలి’.. ఢిల్లీ పరిస్థితిపై హైకోర్టు తీవ్ర ఆందోళన
-
Petrol-Diesel: పెట్రోల్‌లో ఇథనాలు, డీజిల్‌లో ఐసోబ్యుటానాల్.. కేంద్రం మరో నిర్ణయం.!
-
Iran-Israel Ceasefire: ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ప్రకటించిన ఇరాన్.. మళ్లీ దాడులు చేస్తే మాత్రం..!
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!