హైదరాబాద్ మేయర్ ఇంట్లో 5వేల కుక్కల్ని వదలాలి
మంత్రి కేటీఆర్ సార్ మీకు ఒక విన్నపం హైదరాబాద్ మేయర్ గా విధులు నిర్వహిస్తున్న విజయ లక్ష్మీ నివాసంలో అంబర్ పేట సంఘటనలో బాలున్ని పీక్కుతిని చంపేసిన కుక్కలనే కాకుండా.. కనీసం ఐదు వేలకుక్కలని మేయర్ ఇంట్లో వదిలేయాలని కోరారు. ఎవరు ఏ ఏవిధల్లో ఉంటారో కూడా తెలియదు.. మేయర్ విజయలక్ష్మీని ఎవరు నియమించారో కూడా నాకు తలియదు కానీ ఒక మేయర్ ఇంట్లోకి కుక్కల్ని వదిలి బయట నుంచి తాళం వేస్తే ఆ మేయర్ కుక్కల మధ్యలో కూర్చొని కుక్కల్ని ఎంత ప్రేమ చూపిస్తుందో ఏఏ కుక్కల్ని ప్రేమగా అన్నం తినిపిస్తుందో చూడాలని ఉందని మంత్రి కేటీఆర్‌ను ఆర్టీవీ కోరారు. ఆ సంఘటనను నేనే కాదు మంత్రిగారు యావత్ ప్రజానీకం చూడాలని అనుకుంటున్నారు అంటూ ఆర్టీవీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడమ్ మేయర్ మీక్కూడ అదే చెబుతున్నా.. ఎందుకంటే ఎక్కువగా మాట్లాడితే.. మాట్లాడని అంటారు. ఎందుకంటే ఆడవారంటే నాకు చాలా గౌరవం కానీ.. మీరంటే అస్సలు గౌరవం లేదంటూ ఆగ్రహంతో ఊగిపోయారు ఆర్టీవీ..
జీతాల్లో కోతలు.. విప్రోపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు
ఐటీ సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా నెలకొంది. ఆర్ధికమాంద్యం భయాలతో ఇప్పటికే మెటా, అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్ వంటి దిగ్గజ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా వేల సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఇదిలా ఉంటే ఈ ప్రభావం భారత ఐటీ కంపెనీలపై కూడా పడుతోంది. దేశీయ దిగ్గజ ఐటీ సంస్థ విప్రో ఇటీవల ఫ్రెషర్ల జీతాలను తగ్గించాలని నిర్ణయించింది. రూ. 6.5 లక్షల ప్యాకేజీ ఉన్న ఉద్యోగులకు జీతం తగ్గించి రూ. 3.5 లక్షలు ఆఫర్ చేయనున్నట్లు ప్రకటించింది. దీనిపై ఐటీ ఉద్యోగుల నుంచి నిరసన వ్యక్తం అవుతోంది. తాజాగా ఈ విషయంపై ఐటీ ఉద్యోగ సంఘం NITES కేంద్ర కార్మిక మంత్రికి లేఖ రాసింది. ఆఫర్ లెటర్ నిబంధనలను ఉల్లంఘించినందుకు, ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు టెక్ కంపెనీపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆన్‌బోర్డింగ్ కోసం ఎదురుచూస్తున్న ఫ్రెషర్లకు జీతం ఆఫర్‌లను తగ్గించే విప్రో నిర్ణయానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేసింది. విప్రో తీసుకుంటున్న చర్యలు కార్మికుల దోపిడి, ఉద్యోగ భద్రతకు దారితీసే ప్రమాదం ఉందని లేఖలో పేర్కొంది.
పాక్ ఆర్థిక సంక్షోభంపై జై శంకర్ ఏమన్నారంటే..
పీకల్లోతు ఆర్ధిక కష్టాల్లో ఉంది దాయాది దేశం పాకిస్తాన్. తమ దేశం ఇప్పటికే దివాళా తీసిందని సాక్షాత్తు అక్కడి మంత్రులే చెబుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్దం చేసుకోవచ్చు. క్లిష్ట సమయంలో ఐఎంఎఫ్ కానీ, పాక్ మిత్రదేశాలు అయిన సౌదీ, యూఏఈ, చైనా వంటివి కూడా పాకిస్తాన్ కు సాయాన్ని అందించేందుకు ఇష్టపడటం లేదు. మరోవైపు రాజకీయ అస్థిరత కూడా పాకిస్తాన్ పరిస్థితి దిగజారడానికి కారణం అయింది. ఐఎంఎఫ్ తన షరతులకు అంగీకరిస్తేనే తప్పా పాకిస్తాన్ కు బెయిలౌట్ ప్యాకేజీని ఇస్తామని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే పలువరు పాకిస్తాన్ జర్నలిస్టులు, మాజీ సైనికాధికారులు భారత్, పాకిస్తాన్ ను ఆదుకోవాలని కోరుతున్నాయి. దీనిపై ఇప్పటికే భారత్ స్పష్టతతో ఉంది. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ.. భారత్ కు శ్రీలంక లాగా, పాకిస్తాన్ కాదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఇదిలా ఉంటే తాజాగా డైలాగ్‌లో మాట్లాడుతూ పాకిస్తాన్ ఎకనామిక్ క్రైసిస్ గురించి ప్రస్తావించారు.
హోలీ జరుపుకోని ప్రదేశాలు ఉన్నాయి.. అవి ఎక్కడున్నాయంటే?
రంగుల పండుగ హోలీని ప్రతి సంవత్సరం ఉత్సాహంతో జరుపుకుంటారు. ఈ సంవత్సరం హోలీని దేశవ్యాప్తంగా మార్చి 8న ఘనంగా జరుపుకోబోతున్నారు. మరోవైపు దేశంలో హోలీ జరుపుకోని కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. ఇది వింటే మీరు ఆశ్చర్యపోవచ్చు. అయితే ఇది చాలా నిజం. ఈ ప్రదేశంలో హోలీ జరుపుకోకపోవడానికి గల కారణాలు కూడా మీకు కొంచెం వింతగా అనిపించవచ్చు.. ఇక్కడ హోలీ ఎందుకు ఆడరో చూద్దాం. ఉత్తరాఖండ్‌లోని ఈ గ్రామంలో హోలీ జరుపుకోరు. ఉత్తరాఖండ్‌లోని క్యూలీ, కుర్జాన్, జౌండ్లీ గ్రామాల్లో 150 ఏళ్లుగా హోలీ ఆడడం లేదు. ఈ గ్రామాలు రుద్రప్రయాగ, అగస్త్యముని బ్లాకుల పరిధిలోకి వస్తాయి. ఈ ప్రదేశంలో హోలీని జరుపుకోకపోవడానికి అనేక కారణాలు చెప్పబడ్డాయి. ఈ గ్రామానికి ఇష్టమైన దేవత త్రిపుర సుందరి దేవి. ఒకటిన్నర శతాబ్దం క్రితం, ప్రజలు ఈ గ్రామంలో హోలీ జరుపుకోవడానికి ప్రయత్నించారు. అదే సమయంలో గ్రామంలో కలరా మహమ్మారి వ్యాపించింది. ఈ సంఘటన తర్వాత ఈ గ్రామ ప్రజలు హోలీ జరుపుకోవడానికి ప్రయత్నించలేదు.
రష్యా ఉక్రెయిన్ యుద్దానికి ఏడాది
సరిగ్గా ఏడాది క్రితం ఫిబ్రవరి 24, 2022లో ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం ప్రారంభం అయింది. ఇప్పటికీ ఇరు దేశాల మధ్య రావణకాష్టంలా ఈ యుద్దం జరుగుతూనే ఉంది. ఈ యుద్ధంలో ఉక్రెయిన్, రష్యాలు తీవ్రంగా నష్టపోతున్నా, ఇరు దేశాలు పట్టు వీడటం లేదు. గతేడాది ఇదే రోజు తెల్లవారుజామున పెద్ద ఎత్తున రష్యా బలగాలు ఉక్రెయిన్ పై సైనికచర్యను ప్రారంభించాయి. ఈ యుద్ధం ఇరు దేశాలపైన మాత్రమే ప్రభావం చూపించలేదు. ప్రపంచంలో ప్రతీ దేశంపై దీని ఎఫెక్ట్ పడింది. వెస్ట్రన్ దేశాలు ఉక్రెయిన్ ను నాటో కూటమిలో చేర్చుకునేందుకు ప్రయత్నించడంతో రష్యా దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకప్పుడు సోవియట్ యూనియన్ లో భాగం అయిన ఉక్రెయిన్, అమెరికా నేతృత్వంలోని నాటో కూటమిలో చేరితే తనకు ఇబ్బందులు ఎదురవుతాయని రష్యా భావించింది. నాటోలో చేరొద్దని ఉక్రెయిన్ ను హెచ్చరించింది. అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ మాత్రం రష్యా బెదిరింపులను పట్టించుకోకుండా నాటోలో చేరేందుకే మొగ్గు చూపాడు. ఇదిలా ఉంటే యుద్ధానికి ఓ కారణం కావాలి కాబట్టి.. ఉక్రెయిన్ దేశంలో రష్యన్ మాట్లాడే డాన్ బాస్ ప్రాంతంలోని ప్రజలపై ఉక్రెయిన్ 2014 నుంచి అకృత్యాలకు పాల్పడుతోందని రష్యా ఈ యుద్ధాన్ని మొదలు పెట్టింది.
కేంద్రంలో కాంగ్రెస్ సర్కార్ పక్కా
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడడం ఖాయం అన్నారు ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు. రాహుల్ గాంధీ ప్రధాని అవడం తథ్యం అన్నారు. రాయపూర్ లో జరిగే కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు, దేశంలో మార్పుకు నాంది కానున్నాయి. రాహుల్ గాంధీ చేపట్టిన “భారత్ జోడో” యాత్ర అనుభవాలు, ప్రజల నుంచి వచ్చిన ప్రతిస్పందన ఈ ప్లీనరీ సమావేశాల్లో ప్రధానంగా చర్చకు రానున్నాయి. సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీ అధినేతగా సోనియా గాంధీ కొనసాగడం, సుమారు 4 వేల కిలోమీటర్ల దూరం రాహుల్ గాంధీ పాదయాత్ర చేయడం ఈ ప్లీనరీ సమావేశాల సందర్భంలో స్మరించుకోవాల్సిన చారిత్రాత్మక అంశాలు అన్నారు గిడుగు రుద్రరాజు. ఈ ప్లీనరీ సమావేశాల్లో పాల్గొనేందుకు ఏపి నుంచి సుమారు 450 మంది ప్రతినిధులు వచ్చారన్నారు. దేశ రాజకీయాల్లో ఇదో చారిత్రాత్మక ఘట్టం అన్నారాయన. రాజకీయ, ఆర్ధిక, విదేశాంగ విధానం, యువత, నిరుద్యోగం, సామాజిక న్యాయం, సాధికారత, వ్యవసాయ రంగాల సమస్యల పరిష్కారాల కోసం కాంగ్రెస్ పార్టీ విధానాలను ఈ వేదిక ద్వారా దేశ ప్రజలకు స్పష్టం చేస్తాం అని ఎన్టీవీతో మాట్లాడుతూ చెప్పారు. ఇదిలా ఉంటే నేటి నుంచి మూడు రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు రాయ్ పూర్ లో నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన పార్టీ 85 వ ప్లీనరీ సమావేశాలు జరుగుతాయి. ఇవాళ ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ పార్టీ “స్టీరింగ్ కమిటీ” సమావేశం ఉంటుంది. ఏఐసిసి సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న ఆరు తీర్మానాలను ఖరారు చేయనుంది స్టీరింగ్ కమిటీ. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు తీర్మానాలను ఖరారు చేయనుంది సబ్జెక్ట్ కమిటీ. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ” (సిడబ్ల్యుసి) కి ఎన్నికలు నిర్వహించే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది స్టీరింగ్ కమిటీ.
ఘనంగా తిరుపతి 893వ పుట్టిన రోజు వేడుకలు
ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతికి ఒక ప్రత్యేకత ఉంది. వ్యక్తులు, సంస్థలు జన్మదినోత్సవాలు జరుపుకున్నట్టే తిరుపతికి కూడా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. తిరుపతి 893వ పుట్టిన రోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఎమ్మేల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. దీంతో ఈ వేడుకలకు నగర వాసులు భారీగా పాల్గొన్నారు. తిరుపతి ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు, మహిళలు మరియు భక్తులతో నాలుగు మాఢ వీధులగుండా భారీ ర్యాలీ చేశారు. 24-2-1130 సౌమ్య నామ సంవత్సరం , ఫాల్గుణ పౌర్ణమి, ఉత్తర నక్షత్రం నాడు తిరుపతి నగరంలో భగవద్ రామానుజ చార్యుల వారు గోవింద రాజ స్వామిని ప్రతిష్టించారు. మొదట గోవింద రాజ పురం, ఆ తర్వాత రామానుజ పురం, 13 వ శతాబ్దం నుంచి తిరుపతి గా పిలవడం ప్రారంభం అయ్యింది. దీనికి చారిత్రక ఆధారాలు, శిలా శాశనాలు ఆధారాలుగా ఉన్నాయన్నారు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. స్థానిక గోవిందరాజులు స్వామి గుడి వద్ద వేద పండితులు, మంగళ వాయిద్యాలు, భజన మండళ్ల ప్రదర్శనల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోవింద రాజస్వామి ఆలయం ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం నుంచి పట్టు వస్త్రాలు, సారే తీసుకుని గోవింద రాజస్వామి ఆలయం లోకి తీసుకు వెళ్ళిన ఎమ్మేల్యే భూమన, మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి. తిరుపతి నగరం 893 పుట్టిన రోజు సందర్భంగా గోవింద రాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
