Site icon NTV Telugu

Top Headlines @9AM: టాప్ న్యూస్

9am

9am

Nude photo: మహబూబ్ నగర్‌ లో న్యూడ్ ఫోటోల కలకలం

మహబూబ్ నగర్‌ జిల్లా జడ్చర్ల లో న్యూడ్ ఫోటోల కలకలం రేపాయి. సమస్యలు తొలిగిపోయి, ఇంట్లో నోట్ల వర్షం కురుస్తుందని కేటుగాళ్ళు మహిళలను నమ్మించాడు. అతని మాటలు నమ్మిన అమాయక ఆడవారు నిజంగానే సమస్యలు తొలిగిపోతాయని నమ్మారు. వారి కష్టాలు తొలగిపోయి మంచి జీవనం సాగుతుందని నమ్మడంతో.. వారి నమ్మకాన్ని ఆసరాగా తీసుకున్న తాంత్రికుడు పూజలు చేయాలని నమ్మించాడు. ఫోటోలు ఎందుకు అని అడిగినా పూజలకు అవసరమని నమ్మించాడు. న్యూడ్‌ ఫోటోలైతే ఇంకా త్వరగా సమస్యలు తొలగిపోతాయని మహిళలను నమ్మించి మహిళలను న్యూడ్‌ ఫోటోలు తీశాడు. తాంత్రిక పూజలకు ఉపయోగిస్తున్నానని నమ్మించిన హైదరాబాద్ లోని తాంత్రికుడికి పంపించాడు. అంతేకాకుండా.. పూజలపేరుతో పలువురి మహిళల్ని హైదరాబాద్ కు తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. ఈవిషయాన్ని ఎవరికి చెప్పకూడదని ఒకవేళ చెబితే ఇప్పటి వరకు చేసిన పూజలు ఫలించవని బెదిరించాడు. దీంతో మహిళలు మోసపోయామని గ్రహించిన పోలీసులకు ఆశ్రయించడంతో తాంత్రికుడి అసలు గుట్టు రట్టు అయ్యింది. ఈఘాతుకానికి పాల్పడుతున్న ముగ్గురుని పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఈముఠాలో ఇద్దరు పురుషలతో పాటు ఒక మహిళకూడా ఉండటం గమనార్హం. అయితే వీరు మహిళల న్యూడ్‌ ఫోటోలను హైదరాబాద్‌ లోని కొందరికి పంపించారా? లేక మరెవరికైనా పంపించారా? వీళ్లు ముగ్గురే ఇలా మహిళలపై తాంత్రిక పూజలని చేస్తున్నారా? వీరితో పాటు మరెవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Dogs Attack: తెలంగాణలో హడలెత్తిస్తున్న కుక్కల దాడులు

హైదరాబాద్‌ లోని చైతన్య పురి మారుతి నగర్ కాలనీలో నాలుగు సంవత్సరాల బాలుడిపై కుక్కలదాడి చేశాయి. కాలనీలో బాలుడు ఆడుకుంటున్న సమయంలో అతనిపై కుక్కలు ఎగబడ్డాయి. దీంతో ఆబాలుడు గట్టిగా కేకలు వేయడంతో అక్కడే వున్న స్థానికులు కుక్కలను తరమికొట్టారు. దీంతో ఆ బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు హుటా హుటిన ఆసుపత్రికి తరలించారు. బాలున్ని చూసిన తల్లిదండ్రులు తీవ్ర ఆందోళ చెందుతున్నారు. ఎన్నోసార్లు మున్సిపాలిటి వెటనరి వాళ్లకు పిర్యాదు చేసిన చర్యలు చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కాలనీ వాసులను కుక్కలు వెంబడించి భయభ్రాంతులు చేశాయని అప్పుడు కూడా ఫిర్యాదు చేసి కుక్కలను పట్టించిన ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయారు. కొంతమంది కాలనీ వాసులు వాటిని విడిపించి, వాటికి ఆహారం వేస్తు కాలనీలోకి వదలడం వల్లనే నా కన్న బిడ్డపై కుక్కలు దాడి చేసి తీవ్ర గాయాలు చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలనీలో వున్న కుక్కల బెడదను లేకుండా చేయాలని బాలుడి తల్లి భాగ్యలక్ష్మి డిమాండ్ చేశారు. మరి దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలని. ఇలాంటి ఘటనే కరీంనగర్‌ లో ఎస్సీ హాస్టల్లో చోటు చేసుకోవడం తీవ్ర దిగ్భాంతిని గురిచేసింది.

Teachers Affair: టీచర్ల వివాహేతర సంబంధం.. ఫోన్ కాల్‌తో అడ్డంగా బుక్

వాళ్లిద్దరు టీచర్స్.. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించే ఉన్నత హోదాలో ఉన్నారు. అలాంటి ఆ ఇద్దరు దారి తప్పారు. వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. గుట్టుచప్పుడు కాకుండా కామక్రీడల్ని కొనసాగించారు. తాము చేస్తోంది తప్పని తెలిసినప్పటికీ.. తమ కామ కోరికలు తీర్చుకోవడం కోసం హద్దుమీరారు. కానీ, ఒక ఫోన్ కాల్ వీరిని అడ్డంగా పట్టించింది. ‘నేను వస్తున్నాను, తలుపు తీసి ఉంచు’ అంటూ ఫోన్‌లో చెప్పిన మాట.. వారి బాగోతాన్ని బట్టబయలు చేసింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్‌లో కుక్కల నాగేందర్, ఓ మహిళ ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. ఒకే స్కూల్‌లో పని చేస్తుండటం.. వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగి, అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఏఆర్ కానిస్టేబుల్ అయిన ఉపాధ్యాయురాలి భర్తకు వారి తతంగం గురించి తెలిసి, గతంలోనే ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆమెను మరో పాఠశాలకు పంపారు. అయినా సరే.. ఆమె తీరు మార్చుకోలేదు. అతనితో వివాహేతర సంబంధం కొనసాగించింది. అయితే.. ఈసారి రహస్యంగా తమ రిలేషన్ కొనసాగించారు. తన భర్తకు అనుమానం రాకుండా, ఆ ఉపాధ్యాయురాలు సీక్రెట్‌గా ఎఫైర్ నడిపింది.

Sadhvi Prachi: స్వరా భాస్కర్ పెళ్లి చేసుకునే ముందు ఒక్కసారి “ఫ్రిజ్” చూడాల్సింది..

బాలీవుడ్ నటి స్వరాభాస్కర్ ఇటీవల సమాజ్ వాదీ పార్టీ నేత ముస్లిం అయిన ఫహద్ అహ్మద్ ను పెళ్లి చేసుకుంది. దీనిపై ఇటు హిందూ, అటు ముస్లిం వర్గాల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. కొంత మంది ముస్లిం మతపెద్దలు ఈ వివాహాన్ని తప్పుబట్టారు. ఇదిలా ఉంటే హిందూ నేతలు కూడా స్వరా తీరును విమర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ వివాహం గురించి విశ్వహిందూ పరిషత్(వీహెచ్పీ) నాయకురాలు సాధ్వీ ప్రాచీ కాలక వ్యాఖ్యలు చేశారు. స్వరాభాస్కర్ హిందూ మతానికి వ్యతిరేకి అని.. ఆమె తన మతానికి చెందిన వారిని కాదని పెళ్లి చేసుకుంటుందని అనుకున్నానని.. ఇప్పుడు అది జరిగిందని, ఓ ముస్లింను వివాహం చేసుకుందని సాధ్వీ ప్రాచీ అన్నారు. శ్రద్ధా వాకర్ ను ఆమె లవర్ అఫ్తాబ్ పూనావాలా చంపి, 35 ముక్కలుగా చేసి ఫ్రిజ్ లో పెట్టాడని.. స్వరా భాస్కర్ కు కూడా ఇదే గతి పట్టవచ్చని అన్నారు. శ్రద్ధా వాకర్ విషయాన్ని స్వరాభాస్కర్ పట్టించుకోలేదని.. పెళ్లి వంటి పెద్ద నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి ఫ్రిజ్ చూసి ఉండాల్సిందంటూ వ్యాఖ్యానించారు. పెళ్లి ఆమె వ్యక్తిగతం, నేను పెద్దగా చెప్పడానికి ఏం లేదు, కానీ శ్రద్ధకు జరిగిందే స్వరాకు జరగవచ్చని సాధ్వీ ప్రాచీ అన్నారు.

Kiran Abbavaram: రేయ్ ఎవర్రా మీరంతా? నా సినిమాని ఎందుకు చూస్తారు?

యంగ్ హీరో, సీమ కుర్రాడు కిరణ్ అబ్బవరంపై కెరీర్ స్టార్టింగ్ నుంచి సోషల్ మీడియాలో నెగిటివిటి ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంది. కిరణ్ ఏ సినిమా చేసినా? ఏ ఈవెంట్ లో మాట్లాడినా? వాటిపై నెగటివ్ కామెంట్స్ చేస్తూ, సినిమాలు ఫ్లాప్ అంటూ ఒక ప్రాపగాండాలా మీమ్స్ చేస్తున్నారు. నిజానికి హిట్స్ అండ్ ఫ్లాప్స్ ఏ హీరోకైనా మాములే, ఇండస్ట్రీలో ప్రతి హీరో ఫేస్ చేసిన ఈ ఫేజ్ నుంచే కిరణ్ అబ్బవరం సక్సస్ ట్రాక్ ఎక్కాడు. అయితే ఫ్లాప్ స్ట్రీక్ లో ఉండగా ఏ హీరోపై రానన్ని కామెంట్స్ కిరణ్ అబ్బవరంపై వస్తున్నాయి ఇందుకు కారణం ఏంటో తనకి కూడా తెలియదని, దయచేసి నన్ను టార్గెట్ చేసి కామెంట్స్ చెయ్యొద్దు అని కిరణ్ అబ్బవరం తన ప్రతి సినిమా ఫంక్షన్ లో చెప్తూనే ఉంటాడు.

Sundeep Kishan: 2000 మందికి ఇస్తాను మూడు నెలల పాటు ఫ్రీగా చూసుకోండి

తెలుగు, తమిళ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలైతే చేస్తున్నాడు కానీ సందీప్ కిషన్ కి హిట్ మాత్రం అందని ద్రాక్షాగానే ఉంది. టాలెంట్ ఉండి, మంచి కాంటాక్ట్స్ ఉండి లక్ మాత్రమే లేని హీరోగా సందీప్ కిషన్ కెరీర్ సాగిస్తున్నాడు. ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా సినిమాలకి దూరంగా ఉండకుండా, డిజప్పాయింట్ అవ్వకుండా తిరిగి కెరీర్ ని హిట్ ట్రాక్ ఎక్కించాలి అనే కసితో ఉన్న సందీప్ కిషన్ ‘బ్లడ్ అండ్ స్వెట్’ని పెట్టి ‘మైఖేల్’ సినిమా చేశాడు. విమర్శలు చేసే వాళ్లు కూడా ఆశ్చర్యపోయే రేంజులో సందీప్ కిషన్ మేకోవార్ అయ్యి ‘మైఖేల్’ సినిమాలో నటించాడు. ఈ పాన్ ఇండియా మూవీ బయటకి వచ్చిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ నే తెచ్చుకుంది. దాంతో సందీప్ కిషన్ హిట్ కొడతాడు అనే అందరిలోనూ కలిగింది. అయితే ఫిబ్రవరి 3న మార్నింగ్ షో పడగానే మైఖేల్ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుంది. కొందరు బాగుంది అంటే మరికొంతమంది బాగోలేదు అంటూ తేల్చి చెప్పారు. బాగోలేదు అనే టాక్ ఎక్కువ స్ప్రెడ్ అవ్వడంతో మైఖేల్ మూవీ సందీప్ కిషన్ ఫ్లాప్ లిస్టులో చేరింది. రిలీజ్ అయిన మూడు వారాల్లోనే మైఖేల్ సినిమా ఒటీటీలోకి వస్తుంది అంటే దీని రిజల్ట్ ఏంటో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఫిబ్రవరి 24న ఆహాలో మైఖేల్ మూవీ స్ట్రీమ్ అవ్వనుంది. ఈ సమయంలో సందీప్ కిషన్… “2000 మందికి ఆహా సబ్స్క్రిప్షన్ మూడు నెలలు ఫ్రీ ఇస్తాను…” అంటూ ట్వీట్ చేశాడు. మరి ఒటీటీలో మైఖేల్ మూవీ ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాలి.

Agent: ప్రేమలో కూడా మిషన్ ఏంటి ఏజెంట్?

అక్కినేని ప్రిన్స్ అఖిల్ అక్కినేని నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ఏజెంట్’. స్టైలిష్ యాక్షన్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ అయిన సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో అఖిల్ సాలిడ్ ఫిజిక్ తో, లాంగ్ హెయిర్ తో సూపర్బ్ గా ఉన్నాడు. గ్లిమ్ప్స్, టీజర్, రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ వీడియో, పోస్టర్స్ తో ఇంటెన్స్ యాక్షన్ మోడ్ ఫీలింగ్ ని తెచ్చిన మేకర్స్, ఈసారి లవ్ ఫీల్ ని తీసుకోని వస్తు ఫస్ట్ సాంగ్ అనౌన్స్మెంట్ చేశారు. ఈరోజు సాయంత్రం ఏజెంట్ సినిమా నుంచి రిలీజ్ కానున్న ఫస్ట్ సింగల్ ప్రోమోని విడుదల చేశారు. “నా లేటెస్ట్ మిషన్ వి నువ్వే, సాదించాలనిపిస్తుందే” అంటూ సాగిన ప్రోమో సాంగ్ లో లొకేషన్స్ చాలా ఎగ్జాటిక్ గా ఉన్నాయి. అఖిల్ యాక్షన్ మోడ్ నుంచి లవర్ బాయ్ మూడ్ లోకి వచ్చినట్లు, కూల్ గా కనిపించాడు. హీరోయిన్ సాక్షి, ఏజెంట్ టీజర్ తర్వాత ప్రమోషనల్ కంటెంట్ లో కనిపించడం ఇదే మొదటిసారి. ఈ ప్రోమో సాంగ్ లో సాక్షి, అఖిల్ పక్కన అందంగా కనిపించింది. హిప్ హాప్ తమిళ ఇచ్చిన ట్యూన్ ఇంప్రెస్ చేసింది. మరి ఫుల్ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి.

Exit mobile version