NTV Telugu Site icon

Top Headlines @9 PM: టాప్ న్యూస్

9pm top headlines

C16543bd F77c 4a47 A07d 86b2359c88be

1 బ్రేకింగ్.. పోలీస్ స్టేషన్లో పవిత్ర.. వారిపై ఫిర్యాదు

నటి పవిత్రా లోకేష్ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. తన పర్సనల్ విషయాలను సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టి వేధిస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత కొన్నిరోజుల నుంచి నరేష్, పవిత్రా లోకేష్ ల మధ్య ఉన్న అనుబంధం గురించి ట్రోల్స్ నడుస్తున్న విషయం తెల్సిందే. ఈ జంట త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ మొదలైన వివాదం.. చిలికి చిలికి గాలివాన గా మారి ఒక హోటల్ రూమ్ లో నరేష్, పవిత్ర దొరికేవరకు వచ్చింది. ఇక ఈ ఘటన తరువాత కూడా వీరు కలిసే ఉంటున్నారు. ఇటీవల కృష్ణ అంత్యక్రియల్లో ఈ జంటనే హైలైట్ అయ్యింది. దీంతో వారిపైనే మరోసారి మీడియా విరుచుకుపడింది. నరేష్- పవిత్ర లోకేష్ ల గురించి యూట్యూబ్ ఛానెల్స్, కొన్ని వెబ్ సైట్లు అసభ్యకరమైన పోస్టులు పెడుతూ సోషల్ మీడియాలో వైరల్ గా మార్చడంతో పవిత్ర సీరియస్ అయ్యింది. నేడు సైబర్ క్రైమ్ లో ఆమె ఫిర్యాదు చేస్తూ.. కొంతమంది టీవీ ఛానెల్స్, యూట్యూబర్స్ తమను టార్గెట్ గా చేసుకొని అభ్యంతరకర కామెంట్స్ తో పాటు తమ ఫోటోలను మార్ఫింగ్ చేసి వేధిస్తున్నారని తెలిపింది.

2 ‘ధృవ’ స్పేస్ టెక్ సైంటిస్టులకు సీఎం కేసీఆర్ అభినందనలు

భారత అంతరిక్ష రంగంలో ప్రభుత్వ రంగ సంస్థ ఇస్రోతో పాటు ప్రైవేట్ సంస్థలు కూడా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. తాజాగా తెలంగాణకు చెందిన ‘ధృవ’ స్పేస్ టెక్ ప్రయివేట్ సంస్థ ద్వారా, శనివారం శ్రీహరికోట నుంచి ప్రయోగించబడిన రెండు నానో సాటిలైట్స్ విజయవంతంగా అంతరిక్ష కక్షలోకి ప్రవేశించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో కు చెందిన ‘‘ పిఎస్ ఎల్ వీ -సి 54 ’’ తో పాటుగా హైద్రాబాద్ స్టార్టప్ కంపెనీ ధృవ’ స్టార్టప్ సంస్థ పంపిన ‘‘తై బోల్ట్ 1 మరియు తై బోల్ట్ 2’’ అనే రెండు నానో ఉప గ్రహాల ప్రయోగం విజయవంతం కావడం దేశ ఔత్సాహిక అంకుర సంస్థల చరిత్రలో సుదినంగా సిఎం పేర్కొన్నారు. ప్రయివేటు రంగం ద్వారా ఉప గ్రహ ప్రయోగాల చరిత్రలో మరో గొప్ప విజయం అన్నారు. టిహబ్ సభ్య సంస్థ అయిన, స్కైరూట్’ స్టాటప్ కంపెనీ ఇటీవలే ప్రయోగించిన ‘‘ విక్రమ్ –ఎస్ ’’ సాటిలైట్ విజయవంతం కావడం ద్వారా దేశ ఉప గ్రహ ప్రయోగాల చరిత్రలో తెలంగాణ స్టాటప్ కంపెనీ మొట్ట మొదటి సంస్థగా చరిత్రను లిఖించిందని సిఎం కేసీఆర్ అన్నారు.

3 బీజేపీ నేతలది ఓవరాక్షన్.. మండిపడ్డ మాజీ మంత్రి అనిల్

ఏపీలోని బీజేపీ నేతలపై నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యప్ప మాలలో ఉండి తానేదో నేరం, పాపం చేసినట్లు బీజేవైఎం నేతలు ఓవరాక్షన్ చేస్తున్నారని మండిపడ్డారు. తాను ముస్లిం కండువా కప్పుకోవడాన్ని తప్పుబడుతున్న బీజేపీ నేతలకు.. శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులందరూ ఎరుమేలిలో వావర్ స్వామిని దర్శించుకునే విషయం తెలియదా అని ప్రశ్నించారు. వావర్ స్వామి ముస్లిం కాదా అని నిలదీశారు. కన్నెస్వాములందరూ వావర్ స్వామి ఉండే మసీదును దర్శించుకుంటారని.. ముస్లిం దేవతలను ప్రార్థించేవారిలో సగానికి సగం మంది హిందువులే ఉంటారని అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. సోము వీర్రాజు లాంటి బీజేపీ నేతలు కనీసం అవగాహన లేకుండా ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. తాను హిందువులను అవమానించినట్లు మాట్లాడటం సరికాదన్నారు.

4 గుజరాత్ అల్లర్లు.. అమిత్ షాకి ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్ట్రాంగ్ కౌంటర్

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ ఆ రాష్ట్రంలో జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే! ఈ నేపథ్యంలోనే నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఒకరిపై మరొకరు ఆరోపణలు, విమర్శలు సంధించుకుంటున్నారు. సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. సరికొత్త వివాదాలకూ తెరలేపుతున్నారు. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ప్రచారంలో భాగంగా ఆయన 2002 గుజరాత్ అల్లర్ల విషయాన్ని తిరిగి తెరమీదకి తీసుకురావడమే అందుకు కారణం అన్నారు. గుజరాత్ తొలి విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక బహిరంగ సభలో మాట్లాడిన అమిత్ షా.. గోద్రా అల్లర్ల గురించి ప్రస్తావించారు. కాంగ్రెస్ పాలనలో గుజరాత్‌లో తరచూ మతోన్మాద దాడులతో పాటు అల్లర్లు జరిగేవని ఆరోపించారు. అందుకే 2002 అల్లర్లు జరిగాయని పేర్కొన్నారు. అయితే.. ఆ అల్లర్లకు కారణమైన వారికి ఆనాడే బీజేపీ గుణపాఠం చెప్పిందన్నారు. బీజేపీ చెక్ పెట్టడం వల్లే.. సంఘవిద్రోహ శక్తులు హింసా మార్గాన్ని వదిలిపెట్టాయన్నారు. మతపరమైన హింసలో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుని, గుజరాత్‌లో శాశ్వత శాంతిని బీజేపీ స్థాపించిందని అమిత్ షా తెలిపారు. ఈ విధంగా అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఒవైసీ తనదైన శైలిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

5 MMTS ఫేజ్ – II ప్రాజెక్టు ఆలస్యానికి కారణం ఎవరు?

తెలంగాణ సర్కార్ పై ఒక రేంజ్ లో ఫైరయ్యారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణలో వివిధ ప్రాజెక్టుల ఆలస్యానికి కేసీఆర్ కారణమన్నారు. 1:2 రేషియో ప్రాతిపదికన రూ.816.55 కోట్ల అంచనా వ్యయంతో 2012-13 లో మంజూరు చేసిన MMTS ఫేజ్ – II ప్రాజెక్టుకు తన వాటా నిధులు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తూ వస్తోంది. అయినా నేడు కేంద్రం సహకరించకపోయినా మేము పూర్తి చేస్తాం అని మాటలు మాట్లాడటం ఒక్క కల్వకుంట్ల కుటుంబానికే చెందుతుంది. కేసీఆర్ ను మొదలుకొని కల్వకుంట్ల కుటుంబం మాట్లాడే మాటలకు ఏపాటి విలువ ఉందో, మాటమీద ఎంతలా నిలబడతారో, తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి పనిగట్టుకొని అసత్యాలను ఎంతలా ప్రచారం చేస్తారో గత ఎనిమిదిన్నర సంవత్సరాలుగా యావత్ తెలంగాణ సమాజం చూస్తూ ఉంది. పెరిగిన అంచనా వ్యయం ప్రకారం మొత్తం ప్రాజెక్టు విలువ దాదాపు రూ.1122 కోట్లకు పెరగింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా క్రింద దాదాపు రూ.760 కోట్లు చెల్లించవలసి ఉండగా ఇంతవరకూ చెల్లించింది కేవలం రూ.179 కోట్లు మాత్రమే.

6 క్రికెట్ ఆడిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. ముందస్తుకి మేం రెడీ

సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎప్పుడు వచ్చినా మేం రెడీ అన్నారు. క్రికెట్ ఆడి అందరినీ ఉత్సాహ పరిచారు. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, చింతల్ హెచ్ఎంటీ గ్రౌండ్ లో ఎన్ ఎస్ యూ ఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాజీవ్ గాంధీ 16వ క్రికెట్ టౌర్నమెంట్ ను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి యువతతో కలిసి క్రికెట్ ఆడారు. రాజీవ్ గాంధీ గారు 18 ఏళ్లకే యువతకు ఓటు హక్కు కల్పించారు. దేశంలో టెక్నాలజీ తీసుకొచ్చిన ఘనత రాజీవ్ గాంధీ గారిది..ఈ రోజు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్స్ ఉన్నాయంటే కారణం రాజీవ్ గాంధీయే. ఈ టెక్నాలజీ ని తీసుకొని రావడం వల్ల యువతకు ఉపాధి దొరికింది. ఇంతటి మహా నేత రాజీవ్ గాంధీ పేరు మీద కుత్బుల్లాపూర్ లో NSUI ఆధ్వర్యంలో క్రికెట్ టౌర్నమెంట్ నిర్వహించడం సంతోషంగా ఉంది. బీజేపీ -టీఆర్ఎస్ ప్రభుత్వాలు పబ్లిక్ కి సర్వీస్ చేయడం లో ఫెయిల్ అయ్యాయి ఇది చాలా దురదృష్టకరం అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో సంవత్సరం సమయం, పార్లిమెంట్ ఎన్నికలకు ఇంకో సంవత్సరాంనర్రా ఉండగానే ఎన్నికల వాతావరణం క్రియేట చేస్తున్నారు.టీఆర్ఎస్- బీజేపీ దాగుడుమూతల ఆటా ఆడుతున్నాయి..కేంద్ర ప్రభుత్వం ఐటీ ,ఈడీ దాడులతో,రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు తో ఆటలు ఆడుతున్నారు.దీని వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం, ప్రయోజనం లేదు.ప్రజా సమస్యలకు సంబందించిన అంశాలే చర్చకు లేవు..టీవీలు ఆన్ చేస్తే చాలు బీజేపీ -టీఆర్ఎస్ కొట్టుకోవడం కోరుకోవడం ఇదే న్యూస్. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సనస్యలు గాలికి వదిలేసి కొట్టుకోవడం చాలా దురదృష్టకరం అన్నారు.

7 ఏడుకొండలపై అయ్యన్నపాత్రుడు వింతకోరిక…. ఏం కోరాడో తెలిస్తే షాక్!

చింతకాయల అయ్యన్నపాత్రుడు… ఏపీలో ఉత్తరాంధ్రకు చెందిన ఈ నేత టీడీపీలో కీలకం. ఆయనేం మాట్లాడినా సంచలనమే..ఆయన తనమీద అధికార పార్టీ కేసుల మీద కేసులు పెడుతోందని, ఉక్కిరి బిక్కిరి చేస్తోందని మండిపడుతున్నారు. తాజాగా అయ్యన్నపాత్రుడు తిరుమల వెంకన్న దర్శనం నుంచి బయటికి వచ్చారు. వస్తూనే మీడియాను చూసి ఉత్సాహంగా మాట్లాడారు. ఏంటో అంత ఉత్సాహంగా ఉన్నారని మీడియా మిత్రులు అడిగితే ఆయన అసలు విషయం చెప్పుకొచ్చారు. రాష్ట్రాన్ని దుర్మార్గుల‌ పరిపాలన నుంచి కాపాడవయ్యా ఏడుకొండలవాడా అని కోరుకున్నారు అయ్యన్న. అంతేకాదండోయ్ ఆయన రెండో కోరిక తెలిస్తే మాత్రం షాకవ్వక మానరు. రెండో కోరిక మాత్రం వైసీపీ నేత, ఎంపీ విజయ సాయి ఫోన్ దొరకాలని కోరుకున్నారట. ఎందుకంటే ఆయన ఫోన్ దొరికితే అసలు కథ అప్పుడు ప్రారంభం అవుతుందట. అసలు సంగతి యేటంటే ఈ ఇద్దరి మధ్య నిత్యం మాటల యుద్ధం సాగుతూనే వుంటుంది. విజయసాయి నిప్పు అయితే అయ్యన్న ఉప్పు.. ఇద్దరూ ఎప్పుడూ చిటపటలాడుతుంటారు. అయ్యన్న మీద గంజాయి రవాణా.. భూ ఆక్రమణ.. సారాయి అంటూ నిత్యం విజయసాయిరెడ్డి విరుచుకుపడుతుంటారు. అదే తరుణంలో అయ్యన్న కూడా ఏమాత్రం తగ్గకుండా ఏ-2 అని సంభోదిస్తూ ప్రెస్ మీట్లు..ప్రకటనలు కామెంట్లు చేస్తుంటారు.

8 బికినీలో రష్మీ అందాల విందు.. చూడాల్సిందే

బుల్లితెర హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక పక్క యాంకర్ గా కొనసాగుతూనే ఇంకోపక్క హీరోయిన్ గా కూడా కొనసాగుతోంది. ఇక ఇటీవలే బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమాలో కనిపించి మెప్పించిన రష్మీ ప్రస్తుతం మాల్దీవుల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. తన లేడీ గ్యాంగ్ తో మాల్దీవుల్లో రచ్చ చేస్తోంది. ఇక మొన్నటికి మొన్న వెకేషన్ లో అందాలు ఆరబోస్తూ ఫోటోలను షేర్ చేసింది. ప్యాంట్ లేకుండా థైస్ అందాలను ఎరగా వేస్తూ.. వైట్ షర్ట్ లో హాట్ గా కనిపించింది. ఇక తాజాగా అమ్మడు తన బికినీ వీడియోను పోస్ట్ చేసి అందరికి షాక్ ఇచ్చింది. బోట్ పైన కూర్చొని వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్న రష్మీ వెనుక నుంచి వారి ఫ్రెండ్స్ వీడియో తీసినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా అమ్మడు వెనక్కి తిరిగేసరికి బికినీలో ఉన్న రష్మీ అందాలన్నీ బయటపడ్డాయి. ఇక బికినీ లో రష్మీ ని చూసిన కుర్రకారు ఔరా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.